శనివారం, 12 సెప్టెంబర్ 2026తాజా వార్తలు • ట్రెండింగ్
Andhra Pradesh

YS Jagan Mohan Reddy: మహనీయులను స్మరించిన వైఎస్ జగన్.. అల్లూరి నుంచి రోశయ్య వరకు ఘన నివాళులు

Keerthanaa News Deskప్రచురణ తేదీ: శనివారం, 4 జూలై 2026

YS Jagan Mohan Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలువురు మహనీయుల జయంతి, వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య, స్వామి వివేకానంద, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య, ప్రజా నాయకుడు వంగవీటి మోహన రంగా సేవలను గుర్తుచేసుకుంటూ ‘ఎక్స్’ (X) వేదికగా ప్రత్యేక సందేశాలు పోస్టు చేశారు.

‘అల్లూరి.. ఈ పేరే ఒక స్ఫూర్తి’
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఆయన వీరత్వాన్ని కొనియాడారు.
“అల్లూరి.. ఈ పేరే ఒక స్ఫూర్తి.. ధైర్యసాహసాలకు ప్రతీక. దేశ స్వాతంత్ర్యం కోసం, గిరిజనుల హక్కుల కోసం బ్రిటీష్ పాలకుల తూటాలకు ఎదురొడ్డి పోరాడిన విప్లవ వీరుడు. ఆయన తెగువ, పోరాట స్ఫూర్తి, అఖండ దేశభక్తి నేటి యువతకు ఆదర్శం” అని పేర్కొంటూ అల్లూరికి నివాళులు అర్పించారు.

పింగళి వెంకయ్య సేవలను స్మరించిన జగన్
పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా భారత జాతీయ జెండా రూపకర్తగా ఆయన చేసిన సేవలను వైఎస్ జగన్ గుర్తు చేశారు.”గుండెల నిండా దేశభక్తిని నింపుకుని మువ్వన్నెల జాతీయ జెండాను రూపొందించిన మన ఆంధ్రుడు పింగళి వెంకయ్య. ఆయన వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాను” అని తన సందేశంలో పేర్కొన్నారు.

స్వామి వివేకానంద యువతకు చిరస్మరణీయ స్ఫూర్తి
స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా యువతకు ఆయన అందించిన సందేశాలను వైఎస్ జగన్ గుర్తుచేశారు.
“మీపై మీకు విశ్వాసం ఉంటేనే గొప్ప విజయాలకు పునాది పడుతుంది అని చెప్పిన దార్శనికుడు స్వామి వివేకానంద. భారత యువతలో ఆత్మవిశ్వాసం, సేవా దృక్పథం, దేశభక్తిని నింపిన మహనీయుడు. జ్ఞానాన్ని ఆయుధంగా, సేవను ధ్యేయంగా తీసుకుని దేశాభివృద్ధి కోసం ముందుకు సాగాలన్న ఆయన సందేశం నేటికీ స్ఫూర్తిదాయకమే” అని పేర్కొన్నారు.

రోశయ్య సేవలు చిరస్మరణీయం
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా కూడా వైఎస్ జగన్ ఆయనను స్మరించారు.
“నిరాడంబరత, నిజాయితీ, ప్రజా జీవితంలో ఉన్నత విలువలకు ప్రతీకగా నిలిచిన నాయకుడు రోశయ్య. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలను తెలుగు ప్రజలు ఎప్పటికీ మరువలేరు” అని పేర్కొంటూ నివాళులు అర్పించారు.

వంగవీటి మోహన రంగాకు నివాళులు
ప్రజా నాయకుడు వంగవీటి మోహన రంగా 79వ జయంతి సందర్భంగా కూడా వైఎస్ జగన్ ప్రత్యేకంగా నివాళులు అర్పించారు.
తన సందేశంలో..
“పేదలు, బలహీన వర్గాల పక్షాన నిలబడి, వారి అభ్యున్నతి కోసం తన చివరి శ్వాస వరకు పోరాడిన ప్రజానాయకుడు వంగవీటి మోహన రంగా. ప్రజలతో మమేకమై, వారి కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలుస్తూ ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన రంగాగారికి జయంతి సందర్భంగా నివాళులు” అని పేర్కొన్నారు.

మహనీయుల ఆశయాలే సమాజానికి దిక్సూచి
ఒకే రోజున పలువురు మహనీయులను స్మరించిన వైఎస్ జగన్.. వారి సేవలు, త్యాగాలు, విలువలను గుర్తుచేస్తూ చేసిన పోస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమయ్యాయి. స్వాతంత్ర్య సమరయోధులు, ఆధ్యాత్మిక గురువులు, రాజకీయ నాయకులు, ప్రజా ఉద్యమ నేతల సేవలను స్మరించడం ద్వారా వారి ఆశయాలను భావితరాలకు చేరవేయాల్సిన అవసరాన్ని కూడా ఆయన తన సందేశాల ద్వారా ప్రస్తావించారు.

ఇవీ చ‌ద‌వండి: YS Jagan: క్రాంతికుమార్‌ కుటుంబానికి అండగా ఉంటాం: వైఎస్ జగన్‌
YS Jagan Pressmeet: హే రామ్.. సేవ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌..! రాష్ట్రంలో ‘రూల్‌ ఆఫ్‌ ఫియర్‌ రాజ్యమేలుతోందన్న వైఎస్ జ‌గ‌న్
YS Jagan Pressmeet on DSC: డీఎస్సీ–2025 అక్ర‌మాల‌పై వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. సీబీఐ దర్యాప్తు జరపాల‌ని డిమాండ్

Summarize with AI

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading