గురువారం, 24 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh, National

YS Jagan : చెన్నై వేదికగా జగన్ పొలిటికల్ స్కెచ్.. ‘మాస్టర్ ప్లాన్’?

Keerthanaa News Deskప్రచురణ తేదీ: బుధవారం, 18 ఫిబ్రవరి 2026

YS Jagan : చెన్నై: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల చెన్నైలో పర్యటించడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ పెను సంచలనంగా మారింది. జగన్మోహన్ రెడ్డి తన అన్నయ్య కుమారుడి వివాహ వేడుక కోసం చెన్నై వెళ్లినప్పటికీ, అక్కడ ఆయన కలిసిన వ్యక్తులు, గడిపిన సమయం చూస్తుంటే ఇది కేవలం కుటుంబ వేడుక మాత్రమే కాదు, రాబోయే కాలంలో జాతీయ రాజకీయాల్లో రాబోయే మార్పులకు పునాది అని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఒకే వేదికపై దిగ్గజ నేతలు
ఈ వివాహ వేడుకలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, కాంగ్రెస్ అగ్రనేత పి.చిదంబరం, వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితుడైన కేవీపీ రామచంద్రరావు వంటి హేమాహేమీలు కనిపించడం చర్చకు దారితీసింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ కాలంగా దూరంగా ఉంటున్న జగన్, చిదంబరంతో భేటీ కావడం వెనుక ఏదో బలమైన రాజకీయ వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ వేడుకలో జగన్ అందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించడం, ముఖ్యంగా కేవీపీని చూడగానే ‘అంకుల్ ఎలా ఉన్నారు’ అంటూ హగ్ చేసుకోవడం అభిమానులను మురిపించింది.

ఒకే వేదికపై ఇద్దరు మాస్ లీడర్లు.. ఆసక్తి రేపుతున్న యువ నేతల కలయిక!
తమిళనాడులో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సినీ నటుడు, రాజకీయ నేత దళపతి విజయ్‌తో జగన్ భేటీ కావడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరు మాస్ ఫాలోయింగ్ ఉన్న యువ నేతలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో దక్షిణాది రాజకీయాల్లో వేడి పెరిగింది. సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ఎలివేషన్స్ వచ్చాయి. అయితే చైన్నైలో దళపతికి జగన్ అభిమానులు.. ఆంధ్రాలో వైయస్ జగన్ కి దళపతి విజయ్ అభిమానులు బలంగా అవుతారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది?
రాజకీయాల్లో ఏదీ యాదృచ్ఛికం కాదు. చెన్నై వేదికగా జరిగిన ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాకుండా, జాతీయ స్థాయిలో కూడా కీలక మార్పులకు దారితీసే అవకాశం ఉంది. జగన్ సైలెంట్‌గా ఉన్నారంటే అది ‘తుఫాను ముందు ప్రశాంతత’ అని, త్వరలోనే ఆయన తన రాజకీయ చక్రాన్ని తిప్పబోతున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి, ఒక వివాహ వేడుకను వేదికగా చేసుకుని వైఎస్ జగన్ పక్కా పొలిటికల్ క్లారిటీతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది.

ఇవీ చ‌ద‌వండి: YS Jagan with Jogi Ramesh : అరాచకాలు ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేస్తారా? నాగరిక సమాజం తల దించుకునేలా చంద్రబాబు చర్యలు: జగన్ ధ్వజం
ys jagan vijay : ఒకే వేదిక‌పై వైఎస్ జ‌గ‌న్, విజ‌య్.. చెన్నైలో జ‌రిగిన వివాహ వేడుక‌లో సెల‌బ్రిటీల సంద‌డి

ట్యాగ్స్: , , , , , , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading