Bad cholesterol: ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ తగ్గించాలంటే ఏం తినాలి?

మనం తీసుకొనే ఆహారంలో రోజూ చెడు కొలెస్ట్రాల్ (Bad cholesterol) కొద్ది మొత్తంలో చేరుతూ ఉంటుంది. అలాంటి కొవ్వు పదార్థాన్ని కరిగించాలంటే అనేక పద్ధతులు అవలంభించవచ్చు. చెడు కొలెస్ట్రాల్ (Bad cholesterol) వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. గుండె జబ్బులు, హై బీపీ, మధుమేహం లాంటివి త్వరగా అటాక్ చేసే ప్రమాదం ఉంది. అందుకే వీలైనంత వరకు కొవ్వును అధికంగా తెచ్చే పదార్థాలను ఎక్కువగా తీసుకోరాదు. ఒకవేళ తీసుకున్నా కొన్ని పద్ధతులు పాటిస్తే కొలెస్ట్రాల్ ను వెన్నలాగా కరిగించేయవచ్చు.

1. కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల కేవలం గుండెకు మాత్రమే కాదు.. ఛాతిలో నొప్పి, త్వరగా అలసిపోవడం, మత్తు రావడం, రక్తపోటు వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.

2. రోజూ ఎక్సర్ సైజ్ చేస్తే ఎక్కువ శాతం కొలెస్ట్రాల్ ను కరిగించవచ్చు.

3. కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కూడా కొవ్వు శాతాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

4. శరీరంలో కొలెస్ట్రాల్ వల్ల అన్ని రకాలుగా నష్టాలే. త్వరగా జబ్బుల బారిన పడతారు.

5. తీసుకొనే ఆహారంతో పాటు సరైన వ్యాయామం లేకపోవడం, జీవన శైలిలో మార్పులు కొలెస్ట్రాల్ పెరిగిపోవడానికి కారణమవుతాయి.

6. దీని వల్ల రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండెకు చేరే రక్త ప్రవాహానికి అడ్డు ఏర్పడుతుంది. కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యాన్ని బాగా దెబ్బ తీస్తుంది.

7. బీన్స్ ను తీసుకోవడం వల్ల విటమిన్లు, మినరల్స్ బాగా దొరుకుతాయి.

8. చెడు కొలెస్ట్రాల్ చాలా వరకు తగ్గుతుంది. ఆకు కూరల్లో బచ్చలి కూర ప్రాధాన్యం అంతా ఇంతా కాదు.

9. కొలెస్ట్రాల్ పెరగకకుండా అరికట్టడంలో కూడా బచ్చలి కూర ముఖ్య భూమిక పోషిస్తుంది.

10. ఇందులో విటమిన్ బి, ఇ, మెగ్నీషియం ఉంటాయి. అలాగే బెండకాయలు కూడా బరువును తగ్గించడం, కొలెస్ట్రాల్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.

11. టమోటా, బ్రోకలీ కూడా కొలెస్ట్రాల్ ను దరిచేరనీయవు. బ్రోకలీలో ఆరోగ్యకరమైన పోషకాలుంటాయి.

12. విటమిన్ సి తో పాటు ఫైబర్ కంటెంట్ అధికమొత్తంలో ఉంటుంది.

13. ఇది రక్త ప్రసరణలో ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నివారిస్తుంది.

Also Read : Health Tip 30 Years : 30 ఏళ్లకే చర్మంపై ముడతలు పడుతున్నాయా? ఈ టిప్స్‌ మీకోసమే!

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles