Karnataka Viral Video: సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు పోస్టు చేయాలనే ఆకాంక్ష పలువురి ప్రాణాలను తీస్తోంది. వ్యూస్, కామెంట్లు, లైక్స్ కోసం యువత రకరకాల వేషాలు వేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. (Karnataka Viral Video)
వర్షంలో తడుస్తూ ఫొటోలు దిగడం ఫ్యాషన్ అయిపోయింది. ఇక జలపాతాల వద్దకు వెళ్లి వీడియోలు తీసుకునేందుకు యువత ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, ప్రమాదపుటంచుల్లో విన్యాసాలు చేస్తూ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. కర్ణాటకలో జరిగిన విషాదంలో ఓ యువకుడు జలపాతం వద్ద వీడియో కోసం వెళ్లి కాలుజారి వాటర్‌ఫాల్స్‌లో పడిపోయాడు.
స్మార్ట్ ఫోన్ వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో అంతే చేటు కలిగిస్తోందంటున్నారు నిపుణులు. సెల్ఫీ వీడియోలు, ఫొటోల కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. కదులుతున్న రైళ్ల వద్ద సెల్ఫీలు దిగుతూ విద్యుదఘాతానికి గురై చనిపోయిన ఘటనలు కూడా కోకొల్లలు ఉన్నాయి. రన్నింగ్ ట్రెయిన్ వస్తుండగా ట్రాక్‌పై వీడియోలకు ఫోజులిస్తూ రైలు ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు లేకపోలేదు. వాటర్‌ఫాల్స్‌లో పడిపోయిన యువకుడి ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది.
Read Also : Fennel Benefits: సోంపూ గింజలతో ఉపయోగాలేంటి? శరీరంలో ఈ మార్పులు ఖాయం..
శివమొగ్గ జిల్లాలోని భద్రావతి ప్రాంతానికి చెందిన ఓ 23 ఏళ్ల యువకుడు.. సోమవారం అరసినగుండి జలపాతాన్ని తిలకించేందుకు ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లాడు. జలపాతం అంచున బండరాయిపైన నిలబడి వీడియోలకు పోలివ్వసాగాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా పట్టుతప్పి కాలుజారి నీళ్లలో పడిపోయాడు. ఆమాంతం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు యువకుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
యువకుడు కొట్టుకుపోయిన వీడియోలు అతడి స్నేహితుడి మొబైల్ ఫోన్లో రికార్డు అయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫొటోల కోసం, వీడియోల కోసం వెళ్లి చనిపోయే పరిస్థితి తెచ్చుకోవద్దని పలువురు హితవు పలుకుతున్నారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడైనా బుద్ధి తెచ్చుకోవాలని చెబుతున్నారు. జీవితం చాలా విలువైనది. అలాంటి వీడియోలు లేకపోతే ఏమీ నష్టం లేదంటున్నారు.
VIDEO | A man died in Karnataka's Udupi after falling into an overflowing waterfall. pic.twitter.com/gP1q1L6EG7
— Press Trust of India (@PTI_News) July 24, 2023
Read Also : Viral Video: మందు బాబుల కొత్త ఐడియా.. గులాబ్ జామ్‌తో కలిపి..