గురువారం, 22 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
International

America : అమెరికా డ్రీమ్‌కు బ్రేక్! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు షాక్ ఇచ్చిన H-1B కొత్త పాలసీ

Keerthanaa News Deskప్రచురణ తేదీ: శుక్రవారం, 26 డిసెంబర్ 2025

America : అమెరికా వెళ్లాలనుకునే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటివరకు అదృష్టం ఉంటే చాలు—లాటరీలో పేరు పడితే అమెరికా గేట్లు తెరుచుకునేవి. కానీ ఇకపై ఆ విధానానికి పూర్తిగా ఫుల్‌స్టాప్ పడింది. H-1B వీసాల కోసం లాటరీ విధానాన్ని రద్దు చేస్తూ, జీతం, నైపుణ్యాల ఆధారంగా ఎంపిక చేసే కొత్త పాలసీకి అమెరికా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇప్పటివరకు H-1B వీసాల కోసం లక్షల సంఖ్యలో అప్లికేషన్లు వచ్చేవి. వాటన్నింటినీ కంప్యూటర్ లాటరీలో వేయగా, ఎవరి పేరు వస్తే వారికి వీసా దక్కేది. ఆ సమయంలో అభ్యర్థి జీతం ఎంత? నైపుణ్య స్థాయి ఏంటి? అన్న విషయాలకు పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. దీంతో తక్కువ స్కిల్స్ ఉన్నవారికీ వీసా రావడం, టాప్ టాలెంట్‌కు అవకాశాలు తగ్గిపోవడం వంటి విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో United States ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకపై లాటరీ కాదు—జీతమే ప్రధాన ప్రమాణం. ఒకే వీసాకు నలుగురు దరఖాస్తు చేస్తే, ఎవరికైతే కంపెనీ ఎక్కువ ప్యాకేజ్ ఆఫర్ చేస్తుందో వారికే ముందుగా అవకాశం లభిస్తుంది. తక్కువ జీతం ఉన్నవారికి వీసా వచ్చే అవకాశాలు దాదాపు శూన్యంగా మారనున్నాయి.

అంటే, టాప్ లెవల్ స్కిల్స్‌తో పాటు హై సాలరీ ఉంటేనే అమెరికా డ్రీమ్ సాధ్యమవుతుంది. ఇది పూర్తిగా అమెరికా ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయమని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

ఈ కొత్త నిబంధనలు ముఖ్యంగా భారత ఐటీ ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే భారత్ నుంచి వెళ్లే చాలామంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు తక్కువ లేదా మధ్యస్థ ప్యాకేజీలతోనే అమెరికా వెళ్లేవారు. కొత్త పాలసీ అమల్లోకి వస్తే, అలాంటి వారికి వీసా దక్కడం చాలా కష్టం కానుంది. అలాగే కంపెనీలు కూడా భారతీయులను ఆన్‌సైట్‌కు తీసుకెళ్లాలంటే తప్పనిసరిగా భారీ ప్యాకేజీలు ఆఫర్ చేయాల్సి ఉంటుంది.

ఇంకొక వైపు, ఒక్కో H-1B వీసాకు ప్రభుత్వ ఫీజు భారీగా పెరిగి సుమారు 84 లక్షల రూపాయల వరకు ఉండటం కూడా సాధారణ ఉద్యోగులకు భారంగా మారుతోంది. గతంలో కొన్ని కంపెనీలు ఒకే అభ్యర్థి పేరుతో అనేక అప్లికేషన్లు వేసి లాటరీలో గెలిచేలా అక్రమాలకు పాల్పడ్డాయి. అయితే కొత్త వెయిటెడ్ సెలక్షన్ సిస్టమ్ వల్ల ఇలాంటి మోసాలకు పూర్తిగా చెక్ పడనుంది.

ఈ కొత్త నిబంధనలు 2026 ఫిబ్రవరి నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో భారత ఐటీ కంపెనీలు తమ రిక్రూట్‌మెంట్ విధానాలు, ఆన్‌సైట్ వ్యూహాలను తిరిగి సమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇకపై అమెరికా వెళ్లాలంటే అదృష్టం కాదు—ప్రతిభ, స్కిల్స్, భారీ ప్యాకేజీ తప్పనిసరి అన్న సంకేతాన్ని ఈ పాలసీ స్పష్టంగా ఇస్తోంది.

ఇవీ చదవండి: America: అమెరికాలోని భారతీయులకు శుభవార్త.. ఇక పాస్‌పోర్ట్, వీసాల కోసం దూర ప్రయాణాలు అవసరం లేదు!
America : భారతీయులకు వరుసగా షాకులిస్తున్న ట్రంప్ మావ.. టూరిస్ట్ వీసాలపై అమెరికా కఠిన నిర్ణయం

ట్యాగ్స్: , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading