HomeTelanganaTelangana BJP: పుస్తెలమ్మి పోటీ చేస్తే.. వంద కోట్లెలా వచ్చాయి? బండి సంజయ్‌పై రఘునందన్‌రావు ఫైర్‌.....

Telangana BJP: పుస్తెలమ్మి పోటీ చేస్తే.. వంద కోట్లెలా వచ్చాయి? బండి సంజయ్‌పై రఘునందన్‌రావు ఫైర్‌.. తెలంగాణ బీజేపీలో ముదిరిన వర్గపోరు!

Telangana BJP: ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖలో విభేదాలు భగ్గుమన్నాయి. స్టేట్‌ చీఫ్‌ బండి సంజయ్‌పై ఎమ్మెల్యే రఘునందన్‌ రావు వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. అధ్యక్షుడి మార్పుపై కొన్ని రోజులుగా సంకేతాలు వెలువడుతుండడంతో ఇప్పుడు ఒక్కొక్కరుగా అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ని తప్పించి ఆ స్థానంలో కిషన్‌రెడ్డికి పగ్గాలు అప్పగించే యోచనలో జాతీయ పార్టీ అధిష్టానం ఉందన్న సంకేతాలు తాజాగా వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ వెళ్లిన దెబ్బాక శాసన సభ్యుడు రఘునందన్‌ రావు.. బండి సంజయ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. (Telangana BJP)

ఢిల్లీలో ఎమ్మెల్యే రఘునందన్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడి మార్పుపై మీడియాలో ప్రసారమవుతున్న, ప్రచురితమవుతున్న వన్నీ వాస్తవమేనని రఘునందన్‌ రావు వ్యాఖ్యానించారు. పదేళ్లుగా రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కోసం తనకంటే ఎక్కువ ఎవరూ కష్టపడలేదని పేర్కొన్నారు. దుబ్బాకలో తనను చూసి మాత్రమే ప్రజలు గెలిపించారని చెప్పారు. తన గెలుపు చూసే ఈటల రాజేందర్‌ లాంటి వారు పార్టీలో చేరారని స్పష్టం చేశారు.

బండి సంజయ్‌కి 100 కోట్లు ఎక్కడివి?

పుస్తెలు అమ్మి పోటీ చేసిన బండి సంజయ్‌కి యాడ్స్ ఇవ్వడానికి రూ.100 కోట్లు ఎక్కడివంటూ రఘునందన్‌రావు ప్రశ్నించారు. శాసన సభాపక్ష నేత లేడనే విషయం జాతీయ అధ్యక్షుడైన జేపీ నడ్డాకు తెలియదన్నారు. సేవకు ప్రతిఫలం దక్కకపోతే నడ్డాపై మోదీకి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు రఘునందన్‌ రావు. తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూడు పదవుల్లో ఏదో ఒక పదవి ఇవ్వాలని కోరారు. పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్ లేదంటే జాతీయ అధికార ప్రతినిధి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దశాబ్ద కాలంగా తాను కష్టపడుతున్నానని, తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు. తానెందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కానని ఆయన ప్రశ్నించారు. ఓట్లేసేది తరుణ్‌చుగ్ బొమ్మను చూసి కాదని ఈటల, రఘునందన్ బొమ్మలుంటేనే బీజేపీకి ఓట్లు పడతాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రఘునందన్‌ రావు.

వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు పోటీ ఇచ్చే సత్తా ఉంటుందని భావించిన బీజేపీలో ఇలాంటి పరిణామాలు ఊహాతీతమని రాష్ట్ర పార్టీ కేడర్‌ చర్చించుకుంటోంది. బండి సంజయ్‌ సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్తారని భావించిన నేతలు.. ఇప్పుడు అధ్యక్షుడి మార్పుతో ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇవాళ ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ప్రగతి మైదాన్ కన్వెన్షన్ సెంటర్ లో కేంద్ర మంత్రి మండలి భేటీ జరిగింది. మంత్రిత్వశాఖల వారీగా పురోగతి, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రధాని, మంత్రులు చర్చించారు.

విధానపరమైన నిర్ణయాలపైనా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. మంత్రిత్వశాఖల వారీగా పురోగతి వివరాలను మంత్రిత్వ శాఖల కార్యదర్సులు, మంత్రులు వివరించారు. కేంద్ర కేబినెట్‌ భేటీ రాత్రి వరకు కొనసాగింది. సమావేశం అనంతరం మంత్రులకు ప్రధాని మోదీ విందు ఇవ్వనున్నారు. కేబినెట్ మంత్రులు సహా స్వతంత్ర , సహాయ మంత్రులకు ఆహ్వానం అందింది. ఈ వారంలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read Also : Rahul Gandhi On Telangana Bjp: తెలంగాణలో బీజేపీని తుడిచేస్తాం.. ఇతర రాష్ట్రాల్లోనూ కర్ణాటక పరంపర!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు