Priyanka Gandhi: తెలంగాణలో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు, నిధుల కోసం తెలంగాణ ప్రజలు కలలు కన్నారని, మీ కలలు సాకారం అవుతాయని బీఆర్ఎస్ ని నమ్మి ఓటేశారని గుర్తు చేశారు. ఉద్యోగాలు వస్తాయని పిల్లల భవిష్యత్ మారుతుందని అనుకున్నారని, అవన్నీ కల్లలయ్యాయన్నారు. మీ కలను కాంగ్రెస్ అర్ధం చేసుకుందని చెప్పారు. (Priyanka Gandhi)
ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ..
* సామాజిక న్యాయం జరగాలన్నదే కాంగ్రెస్ సిద్ధాంతం
* మీ అందరి ఆకాంక్షలు నెరవేర్చేందుకే తెలంగాణను ఏర్పాటు చేశాం
* తెలంగాణ ఇస్తే రాజకీయం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని సోనియా కు తెలుసు
* కానీ సోనియా గాంధీ మీ కోసం ఆ నిర్ణయం తీసుకున్నారు
* రాజకీయ లబ్ది కోసం కాకుండా, తెలంగాణ ప్రజల కోరిక మేరకు ఆ నిర్ణయం తీసుకున్నారు
* సోనియా గాంధీ దూరదృష్టి తో తెలంగాణ ఏర్పాటుకు కృషి చేశారు
* కాంగ్రెస్ హయాంలోనే ఐఐటీ, ఐఐఎం లాంటి సంస్థలు వచ్చాయి
* తెలంగాణ కోసం కాంగ్రెస్ రోడ్ మ్యాప్ తయారు చేసింది. అని ప్రియాంక గాంధీ చెప్పారు.
ట్విట్టర్ లో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో మార్పునకు విజయభేరి యాత్ర నాంది పలుకుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అభివృద్ధి హామీతో టీ. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్నారు.’బీజేపీ రిష్టేదార్ సమితి’ ప్రభుత్వం పోతుందంటూ ట్విట్టర్లో రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్ చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ తొలి విడత బస్సు యాత్ర ప్రారంభం
అధికారమే లక్ష్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్రచారం సాగిస్తోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆ పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు. తొలి విడత బస్సు యాత్ర ప్రారంభమైంది. రామప్ప ఆలయం నుంచి బస్సు యాత్రను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రారంభించారు. ములుగు బహిరంగ సభలో రాహుల్, ప్రియాంక పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Rahul Gandhi on elections: ఎన్నికలు చాలా దగ్గరకు వచ్చాయి.. సిద్ధం కావాలి : రాహుల్ గాంధీ