Rahul Gandhi on elections: సార్వత్రిక ఎన్నికలు చాలా దగ్గరకు వచ్చాయని, సన్నద్ధం కావాలంటూ కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. జీ20 శిఖరాగ్ర సదస్సు త్వరలోనే జరగనుందని పేర్కొన్నారు. INDIAలోని పార్టీల మధ్య ఐక్యత అసాధ్యమని బీజేపీ విమర్శించిందన్నారు. బీజేపీ అంచనాలు తారుమారు చేస్తూ INDIA పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని స్పష్టం చేశారు. (Rahul Gandhi on elections)
బీజేపీ ఓటమికి INDIA కూటమి బలమైన నిర్ణయాలు తీసుకుందని రాహుల్ స్పష్టం చేశారు. INDIA కూటమిని ఓడించడం బీజేపీ వల్ల కాదని హెచ్చరించారు. దేశంలోని నలుగురికి మాత్రమే మేలు చేసేందుకే మోదీ సర్కార్ కృషి చేస్తోందన్నారు. అదానీ విషయంలో ఉన్నతస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ వేదికపై 60 శాతం భారత్ ఉందన్నారు. ఈ బలమైన శక్తిని ఓడించడం బీజేపీ తరం కాదని జోస్యం చెప్పారు. ప్రధాని, బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు.
వారంపాటు తాను ఉత్తరభారతంలో గడిపానని రాహుల్ చెప్పారు. ప్యాంగ్ యాంగ్ సరస్సును తాను సందర్శించానన్నారు. భారత భూభాగాన్ని చైనా వాళ్లు తీసుకున్నారని ప్యాంగ్ యాంగ్‌లో ప్రజలు చెప్పారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Read Also : Gudivada Amarnath: చంద్రబాబు అవినీతి చిట్టా బయటకొస్తోంది: మంత్రి గుడివాడ అమర్నాథ్