Telangana News: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఏకంగా 31 మంది ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. ఎంసీఆర్ హెచ్ఆర్డీ డీజీగా శశాంక్ గోయల్ నియమితులయ్యారు. హైదరాబాద్ కలెక్టర్ గా అనుదీప్ దురిశెట్టి బదిలీ అయ్యారు. ములుగు కలెక్టర్ గా హిలా త్రిపాఠిని ప్రభుత్వం నియమించింది. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ గా ప్రియాంక నియమితులయ్యారు. పెద్దపల్లి కలెక్టర్ గా ముజామిల్ ఖాన్ను ప్రభుత్వం నియమించింది. (Telangana News)
మరోవైపు భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ గా ప్రతిగ్ జైన్ నియమితులయ్యారు. ఆయుష్ డైరెక్టర్ గా హరిచందనను ప్రభుత్వం నియమించింది. స్పోర్ట్స్ డైరెక్టర్ గా కొర్ర లక్ష్మీ, అగ్రికల్చర్ డిప్యూటీ సెక్రటరిగా సత్య శారద నియమితులయ్యారు. సెర్ఫ్ సీఈవోగా గౌతమ్ పాత్రు, హ్యాండీ క్రాప్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా అలుగు వర్షిణి, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ గా మంద మకరంద్ నియమితులయ్యారు.
