శుక్రవారం, 23 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Agriculture, Telangana

Telangana: అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఈ నెల నుంచే కొత్త పథకం అమలు.. రూ.101 కోట్ల నిధులు విడుదల!

Keerthanaa News Deskప్రచురణ తేదీ: శుక్రవారం, 2 జనవరి 2026

Telangana: తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక శుభవార్త అందించింది. వ్యవసాయ రంగంలో ఆధునికత పెంచే లక్ష్యంతో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని జనవరి నుంచే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అమలుకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.101.83 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.

ఈ పథకాన్ని కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేయనున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు సమకూర్చనుండగా, మిగిలిన 40 శాతం వాటాను తెలంగాణ ప్రభుత్వం భరిస్తుంది. పథకం ద్వారా రైతులకు వ్యవసాయ పనిముట్లు సబ్సిడీపై అందించనున్నారు.

వ్యవసాయ పనిముట్లపై భారీ రాయితీ
ఈ స్కీమ్ కింద రైతులు వ్యవసాయ యంత్రాలు, పనిముట్లపై భారీ రాయితీ పొందే అవకాశం ఉంది.
ఎస్సీ, ఎస్టీ మహిళా రైతులు – గరిష్టంగా 50 శాతం సబ్సిడీ
ఇతర వర్గాల రైతులు – 40 శాతం సబ్సిడీ

ఇప్పటికే ఈ పథకం కోసం 5.50 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకోగా, తొలి దశలో 1.30 లక్షల మంది రైతులను ఎంపిక చేశారు. వీరికి త్వరలోనే రాయితీ సౌకర్యం అందించనున్నారు. తక్కువ ధరకు వ్యవసాయ పనిముట్లు లభించడంతో రైతులపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుంది.

ఎవరు అర్హులు?
ఇంతకుముందు ప్రభుత్వం స్వయంగా యంత్రాలను కొనుగోలు చేసి రైతులకు సబ్సిడీపై అందించేది. అయితే ఇప్పుడు నిబంధనల్లో మార్పులు చేసి కొత్త విధానాన్ని తీసుకొచ్చింది.
ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులు
మొత్తం 15 రకాల వ్యవసాయ పనిముట్లను సబ్సిడీ జాబితాలో చేర్చారు
ప్రస్తుతం ప్రభుత్వం 16 కంపెనీలను అధికారికంగా ఎంపిక చేసింది

ఈ కంపెనీల వద్ద రైతులు యంత్రాలను కొనుగోలు చేస్తే, రైతు చెల్లించాల్సిన వాటా మినహా మిగిలిన సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా కంపెనీల ఖాతాల్లో జమ చేస్తుంది.

టెక్నాలజీతో దుర్వినియోగానికి చెక్
యంత్రాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను వినియోగించనుంది.
రూ.లక్షకు పైగా విలువైన పరికరాలకు జియో ట్యాగింగ్
చిన్న పరికరాలకు ఏఐ ఆధారిత టెలిమాటిక్స్ కిట్లు అమరిక
దీంతో యంత్రాల వినియోగాన్ని పర్యవేక్షించడం సులభమవుతుందని అధికారులు చెబుతున్నారు.

వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు ఆధునిక పరికరాలు తక్కువ ఖర్చుతో అందుబాటులోకి రానున్నాయి. ఇది రైతుల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, వ్యవసాయ వ్యయాన్ని కూడా తగ్గించనుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

ఇవీ చదవండి: Andhra Pradesh : ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. 22ఏ సమస్యకు చెక్.. రైతన్నలకు భూములపై పూర్తి హక్కులు
Srisailam: శ్రీశైలం భక్తులకు బంపర్ గుడ్ న్యూస్.. ఉచిత దర్శనం మాత్రమే కాదు.. వసతి, రాకపోకలు కూడా ఫ్రీ

ట్యాగ్స్: , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading