టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ప్రదర్శన గురించి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరల్డ్ నంబర్ వన్ ఆల్ రౌండర్‌గా కూడా జడ్డూ (Ravindra Jadeja) పలు రికార్డులు సృష్టించాడు. తాజాగా ఐపీఎల్‌లోనూ (IPL 2023) జడేజా (Ravindra Jadeja) సత్తా చాటుతున్నాడు. సాధారణంగానే ఫీల్డింగ్, స్పిన్ బౌలింగ్, బ్యాటింగ్.. ఇలా ఏది పట్టుకున్నా పట్టువదలని విక్రమార్కుడిలా జడేజా తీరు ఉంటుంది. కొన్నిసార్లు ప్రత్యర్థులకు కళ్లు చెదిరేలా బౌలింగ్, ఫీల్డింగ్‌లో సత్తా చాటుతుంటాడు. తాజాగా ఐపీఎల్‌లోనూ ఇలాంటి ఘటనే ఆవిష్కృతమైంది.
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ రద్దయింది. వరుణుడు ఆటంకం కలిగించడంతో మ్యాచ్ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో చెరో పాయింట్ దక్కాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. లక్నోను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. గాయం కారణంగా సిరీస్‌కు దూరమైన కేఎల్ రాహుల్ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు కృనాల్ పాండ్యకు అప్పగించారు.
బ్యాటింగ్‌కు దిగిన లక్నో బ్యాటర్లు.. ఆరంభంలోనే తడబడ్డారు. పిచ్ పూర్తిగా బౌలర్లకు సహకరిచింది. లక్నో జట్టులో ఆయుష్ బదోని (Ayush Badoni) ఒక్కడే అర్ధ శతకంతో మెరిశాడు. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. 33 బంతుల్లోనే 4 సిక్సర్లు, 2 ఫోర్లతో 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు బదోని. అంతకు ముందే బ్యాటింగ్‌కు వచ్చిన మార్కస్ స్టొయినిస్‌కు జడేజా బౌలింగ్‌లో కళ్లు బైర్లు కమ్మేలా చేశాడు.
జడేజా బౌలింగ్ చేస్తుండగా స్టొయినిస్ క్రీజులో ఉన్నాడు. ఆఫ్ స్పిన్‌లో చేయి తిరిగిన జడ్డూ.. ఓ అద్భుతమైన బంతిని స్టొయినిస్ మీదకు వదిలాడు. అంతే అది క్లీన్‌గా కట్ అయి లెగ్ సైడ్ మీదుగా వెళ్లి ఆఫ్ సైడ్ వికెట్‌ను ముద్దాడింది. ఊహించని ఈ పరిణామంతో స్టొయినిస్ నిర్ఘాంతపోయాడు. స్టంప్ అవుటా? బౌల్డా? అంటూ బిక్కమొహం వేసి అంపైర్‌కేసి చూడసాగాడు.
కాసేపు ఏమీ అర్థం కాలేదు. తర్వాత రీప్లేలో మిరాకిల్ బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యానని అర్థం అయ్యింది స్టొయినిస్‌కి. రవీంద్ర జడేజా వర్షం రాకపోయి ఉంటే బ్యాటింగ్‌లోనూ మెరుపులు చూపించేవాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితేనేం.. బాల్‌తో నిప్పులు కురిపించాడని కామెంట్లు చేస్తున్నారు.
రవీంద్ర జడేజాను క్రికెట్‌లో రాక్‌స్టార్ అని ఇందుకే పిలుస్తారంటూ సీఎస్కే అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది తాజాగా మరోసారి లక్నోలో రుజువు చేశాడంటున్నారు. ప్రపంచంలోని ఏ బ్యాట్స్‌మెన్ తన ముందు నిలబడలేనంత ప్రమాదకరమైన బంతిని విసిరాడని.. ఈ బంతికి స్టొయినిస్ బలయ్యాడని చెబుతున్నారు. జడేజా వేసిన బంతిని మార్కస్ ఎదుర్కోలేక పెవిలియన్ బాట పట్టాడని, జడేజా వేసిన ఈ బంతిని ఐపీఎల్‌లో అత్యుత్తమ బాల్ అంటూ అభిమానులు కితాబిస్తున్నారు.
𝗣.𝗘.𝗔.𝗖.𝗛!
That was an epic delivery from @imjadeja 🔥🔥
Follow the match ▶️ https://t.co/QwaagO40CB #TATAIPL | #LSGvCSK pic.twitter.com/dhPSVB4BuF
— IndianPremierLeague (@IPL) May 3, 2023
లక్నో ఇన్నింగ్స్ భాగంగా 7వ ఓవర్‌లో జడేజా ఈ బంతిని స్టొయినిస్‌కు వేశాడు. జడేజా వేసిన ఈ బంతి లెగ్ స్టంప్‌కు వెళ్లింది. తర్వాత గిర్రున తిరిగి ఆఫ్ స్టంప్‌ను పడగొట్టింది. బంతి తిరిగిన మలుపులు మ్యాచ్‌కే హైలెట్ అయ్యాయి. కొద్దిసేపు కామెంటేటర్లకు కూడా విషయం అర్థం కాలేదు. ఇక స్టొయినిస్ ఆశ్చర్యపోతూ పెవిలియన్‌కుచేరాడు.
Read Also : Mohammed Shami: షమీపై మాజీ భార్యకు ఎంతకంత పగ.. వివాహేతర సంబంధాలంటూ మళ్లీ తీవ్ర ఆరోపణలు!