ముంబైలో పుట్టి పెరిగిన హీరోయిన్, నటి శ్రద్ధా దాస్ (Sraddha Das) తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది. టాలీవుడ్ లో అనేక చిత్రాల్లో శ్రద్ధా దాస్ (Sraddha Das) నటించింది. సిద్ధు ఫ్రం శ్రీకాకుళం సినిమాలో తొలిసారి తెలుగు చిత్ర సీమలో అడుగు పెట్టింది శ్రద్ధా దాస్ (Sraddha Das). ఆమె బాల్యం, విద్యాభ్యాసమంతా ముంబైలోనే సాగింది. చిన్నతనం నుంచే నటనపై మక్కువ కలిగి ఉండేది. తన గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వర్క్ షాప్స్ కు అటెండ్ అయ్యేది.
తెలుగులో తొలి సినిమా చేయగానే వరుసగా అవకాశాలు ఆమెకు దక్కాయి. డైరీ, అధినేత, ఆర్య 2 చిత్రాల్లో శ్రద్ధ నటించింది. కొన్ని చిత్రాల్లో చిన్న పాత్రలైనా కూడా నటించేందుకు ఒప్పుకొని మెప్పించింది. హీరోయిన్ గా మాత్రమే చేయాలనే నిబంధన పెట్టుకోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంది. ఈ కారణంతోనే ఆమె అగ్ర హీరోయిన్ కాలేకపోయిందనే వాదన ఉంది. తెలుగుతో పాటు కన్నడ, బెంగాలీ, హిందీ మూవీల్లో సుమారు 30 సినిమాల్లో శ్రద్ధ నటించింది.
టాలీవుడ్ లో నటిస్తున్న క్రమంలో శ్రద్ధపై వివాదాలు కూడా చుట్టుముట్టాయి. అప్పట్లో హీరోగా పాపులర్ అయిన వరుణ్ సందేశ్ తో ప్రేమాయణం నడిపిందనే వార్తలు హల్ చల్ చేశాయి. 2010లో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన మరో చరిత్ర సినిమాలో మంచి గుర్తింపు ఉన్న పాత్రలో శ్రద్ధ నటించింది. అప్పటి నుంచి వారి మధ్య పరిచయం పెరిగి కొన్నాళ్లకు ప్రేమగా మారిందని చెబుతారు.
సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఓ ఏడాది తిరిగేలోపే శ్రద్ధపై పుకార్లు మరింత పెరిగాయి. అయితే, వారి ప్రేమకు వరుణ్ సందేశ్ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పారనే టాక్ నడిచింది. అయితే, కొన్నేళ్ల తర్వాత శ్రద్ధా దాస్ దీనిపై వివరణ ఇచ్చింది. తాను వరుణ్ సందేశ్ కొంత కాలం ప్రేమలో ఉన్నామని చెప్పింది. తర్వాత కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయ్యిందని వెల్లడించింది. తర్వాత వరుణ్ సందేశ్ 2015లో వితికను పెళ్లాడి సెటిలయ్యాడు.
Namrata: మహేష్ కంటే ముందు నమ్రత ఎవరిని ప్రేమించిదంటే..
హీరో కృష్ణ కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన మహేష్ బాబు.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. నటనలో చైల్డ్ ఆర్టిస్టుగానే ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు.. తర్వాత హీరోగా తనదైన ముద్ర వేశారు. మహేష్ బాబు పేరు చెబితే ముందుగా గుర్తొచ్చే సినిమా పోకిరి. ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా మహేష్ బాబు కెరీర్‌లో నిలిచిపోతుంది పోకిరి మూవీ.
టాలీవుడ్ లో మోస్ట్ అందగాడైనప్పటికీ మహేష్ బాబు హీరోయిన్లతో చెట్టపట్టాలేసుకొని తిరిగింది లేదు. తనకంటూ ప్రత్యేక శైలితో చాలా డీసెంట్ గా ఉంటాడనే పేరు తెచ్చుకున్నాడు. మహేష్ భార్య నమ్రత ముంబై అమ్మాయి. చాలా కలుపుగోలు మనిషిగా ఉండేది. మహేష్‌తో బంధానికి ముందు అనేక రిలేషన్ షిప్స్ ఉన్నప్పటికీ మహేష్ బాబుతో పెళ్లయ్యాక ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. మహేష్ ఫ్యామిలీలో చక్కగా కలిసిపోయింది.
హీరోగా మంచి పీక్‌లో ఉన్న టైమ్ లో మహేష్ బాబు.. హీరోయిన్ నమ్రతను పెళ్లాడాడు. టాలీవుడ్ లో చాలా మంది ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. మహేష్, నమ్రతల జంట బాగా పాపులర్ అయ్యారు. ఇప్పటికీ ఎలాంటి మనస్పర్ధలు లేకుండా సంతోషంగా జీవితం గడుపుతున్నారు. వీరిద్దరూ సుమారు ఐదేళ్లపాటు ప్రేమించుకున్నాక 2005లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తర్వాత గౌతమ్, సితార పిల్లలు కలిగారు.
మహేష్ భార్య నమ్రత కెరీర్ మొదట్లో మోడలింగ్ చేసేది. తర్వాత మిస్ ఇండియాగా ఎదిగింది. అనంతరం మిస్ యూనివర్స్ పీజెంట్ లో కూడా పాల్గొని ఆరో స్థానంలో నిలిచింది. బాలీవుడ్ సినిమాల్లో నటించే క్రమంలో రెస్టారెంట్ ఓనర్ అయిన దీపక్ శెట్టితో ప్రేమలో పడిందట. వీరిద్దరూ రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారనే టాక్ అప్పట్లో హల్ చల్ చేసింది. తర్వాత బ్రేకప్ అయ్యింది. అనంతరం మహేష్ మంజ్రేకర్ తో క్లోజ్ గా మెలిగిందట. అనతరం మహేష్ బాబుతో కలిని నటించే క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇక మహేష్ ను పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది.
Read Also : Janhvi Kapoor: ఆ హీరోను యాంగ్రీ యంగ్ మ్యాన్‌తో పోల్చిన జాన్వీ