Laptop: ల్యాప్ టాప్ కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Laptop: లాప్ టాప్ కొనాలని అనుకునేవారు… కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే మనం వెచ్చించే ధరకు తగిన, మనం కోరుకున్న ఫీచర్స్ కలిగిన లాప్ టాప్ సొంతం చేసుకోవచ్చు. లేదంటే… కొన్న తర్వాత బాధపడ్డా ప్రయోజనం ఉండదు. ల్యాప్ టాప్, పర్సనల్ కంప్యూటర్ ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరికి తప్పనిసరి అవసరంగా మారాయి. ముఖ్యంగా క్యారీ చేయడం ఈజీగా ఉండడం కోసం ఎక్కువమంది లాప్ టాప్ కొనేందుకు ప్రిఫర్ చేస్తున్నారు. మరి లాప్ టాప్ కొనేటప్పుడు తరచుగా కొన్ని తప్పులు చేస్తుంటారు. (Laptop)

ఏదైనా కొత్త వస్తువు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఎవరికైనా సరే… చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. మార్కెట్లో ఉన్న రకరకాల లాప్ టాప్ లు ఆకర్షిస్తుంటాయి. అందులో మనకు అవసరమైన స్పెసిఫికేషన్స్ ఏంటో… అనవసరమైన ఫీచర్స్ ఏంటో తెలుసుకోవాలి. అందుకు తగినట్టుగానే సరేనా లాప్ టాప్ ఎంచుకోవాలి. ఇందుకోసం 8 జాగ్రత్తలు తీసుకోవాలి.

లాప్ టాప్ తీసుకునేటప్పుడు ఎక్స్టర్నల్ డివైసెస్ విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. మీరు కొనుక్కునే లాప్ టాప్ కు సూట్ అయ్యే… ప్రింటర్స్, మైక్స్, చార్జర్స్, యూఎస్బీ కేబుల్స్ ఎక్కడ లభిస్తాయో తెలుసుకోవాలి. లాప్ టాప్ లో ఉన్న కంటెంట్ ను ప్రజెంటేషన్ రూపంలో చూపించాల్సి వచ్చినప్పుడు… ఏయే డివైసెస్ అవసరమో ముందే గుర్తించాలి. వీటన్నింటిని కూడా అందుబాటులో పెట్టుకోవాలి. మంచి స్పీకర్స్, మైక్రోఫోన్స్ సెట్ చేసుకోవాలి. అప్పుడే ప్రజెంటేషన్ లో ఎలాంటి అంతరాయాలూ కలగవు.

లాప్ టాప్ అనేది క్యారీ చేసేందుకు కంఫర్ట్ గా ఉండాలి. పెద్ద స్క్రీన్ కలిగిన లాప్ టాప్ తీసుకుంటే చూసేందుకు స్క్రీన్ చాలా బిగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కానీ క్యారీ చేయడం ఇబ్బంది కలిగిస్తుంది. మరీ చిన్న లాప్ టాప్ తీసుకుంటే స్క్రీన్ చిన్నగా ఉంటుంది. అలాగే టైపింగ్ చేసేందుకు కీబోర్డ్ కంఫర్ట్ గా అనిపించదు. అందుకే పోర్టేబుల్ లాప్ టాప్ తీసుకుంటే బెటర్.

లాప్ టాప్ లో హై క్వాలిటీ డిస్ప్లే చాలా ఇంపార్టెంట్. ఇది ఓవరాల్ యూజర్ ఎక్స్పీరియన్స్ ను ప్రభావితం చేస్తుంది. అందుకోసం స్క్రీన్ రిజల్యూషన్, సైజ్, ప్యానల్ టైప్, రిఫ్రెష్ రేట్, కలర్ అక్యురసీ, గ్రాఫిక్స్ ప్రాసెసర్ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

లాప్ టాప్ బ్యాటరీ సైజ్ చాలా ముఖ్యం. ఒక్కోసారి చార్జింగ్ పెట్టుకునే అవకాశం లేని సందర్భం రావచ్చు. అలాంటప్పుడు బ్యాటరీ పైనే ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి బ్యాటరీ సైజ్ గురించి ప్రత్యేకంగా శద్ధ వరించాలి. బ్యాటరీని ఒకసారి ఫుల్ చార్జ్ చేసుకోవడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవాలి. లాప్ టాప్ ప్రకటనల్లో పేర్కొన్న సమయానికి… వాస్తవానికి తేడా ఉండొచ్చు. అందుకోసం యూజర్ల రివ్యూ చదవాలి.

కొత్త టెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వాలి

లాప్ టాప్ లు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయి. మనం వెచ్చించే అమౌంట్ తో పాత ఫీచర్స్ కలిగిన లాప్ టాప్ కొనుగోలు చేయడానికి బదులు… అదే రేట్ కు కొత్త ఫీచర్స్ కలిగిన లాప్ టాప్ ఏదైనా అందుబాటులో ఉందో చూసుకోవాలి. ఆ రోజుకు ఉన్న కొత్త టెక్నాలజీ లాప్ టాప్ కొనుక్కుంటే… కొంతకాలం పాటు వాడుకోవచ్చు. లేదంటే కొత్త స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ కోసం త్వరగానే మరొకటి కొనుక్కోవాల్సి వస్తుంది.

మీరు కొనాలనుకునే లాప్ టాప్ మోడల్ గురించి ముందే తెలుసుకోవాలి. ఇందుకోసం ఆన్ లైన్ లో రివ్యూస్ చదవాలి, స్పెసిఫికేషన్స్ తెలుసుకోవాలి. కొనేముందు లాప్ టాప్ ఫంక్షన్ ఎలా ఉందో కూడా టెస్ట్ చేయాలి. టైపింగ్, క్యారీయింగ్ తో పాటు, కీబోర్డ్ కంఫర్ట్, టచ్ ప్యాడ్ ఎక్స్పీరియన్స్, బ్యాటరీ లైఫ్ అవసరాలకు తగిన విధంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి.

చాలామంది మార్కెటింగ్ జిమ్మిక్కులతో, అనవసర ఫీచర్స్ కు ఆకర్షితులై మోసపోతుంటారు. అడ్వర్టైజ్మెంట్లలో చాలా ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవన్నీ కూడా చూడగానే నచ్చుతాయి. కానీ నిజంగా అందులో… ఏవి మనకు అవసరమో, ఏవి అవసరం లేదో ఆలోచించాలి. మనం యూజ్ చేయని ఫీచర్స్ కోసం ఎక్కువ రేట్ కలిగిన లాప్ టాప్ కొనాల్సిన అవసరం లేదు. ప్రాసెసింగ్ స్పీడ్, ర్యామ్, స్టోరేజ్ స్పేస్, గ్రాఫిక్స్ పెర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ వంటి కీలక అంశాలను మాత్రం కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి.

నచ్చిన, మెచ్చిన లాప్ టాప్ కొనేముందు పైన పేర్కొన్న 8 జాగ్రత్తలు తీసుకుంటే… కొన్న తర్వాత బాధపడాల్సిన అవసరం ఉండదు. ఆన్ లైన్ లో, ప్రత్యక్షంగా ఫ్రెండ్స్ ద్వారా రీసెర్చ్ చేసి, చాలా ఆలోచించి లాప్ టాప్ కొనుక్కుంటే బెటర్.

ఎవరైనా తామ కొనాలనుకున్న లాప్ టాప్ గురించి రివ్యూస్ చదవడంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. టెక్నాలజీకి సంబంధించి నమ్మకమైన యూట్యూబ్ ఛానల్స్ లో రివ్యూ చూడడం బెటర్. అంతేకాకుండా… సేమ్ మోడల్ లాప్ టాప్ వాడుతున్న ఫ్రెండ్స్ ను అడిగి తెలుసుకోవడం చాలా చాలా ఉత్తమం.

ఇదీ చదవండి: Morning Wake Up: ఉదయాన్నే త్వరగా నిద్ర లేస్తే.. ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం..!

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles