Ekamukhi Rudraksha: గజిబిజి జీవనంలో కాస్త ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవడమే చాలా మంది మర్చిపోతున్నారు. కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడని ఓ నానుడి ఉంది. నిత్యం పనుల్లో ఉంటూ భగవన్నామ స్మరణ చాలామంది మర్చిపోతున్నారు. ఈ క్రమంలో ఆధ్యాత్మిక చింతన అలవర్చేందుకు అనేక పీఠాలు అవగాహన కల్పిస్తున్నాయి. ముఖ్యంగా శివస్వరూపమైన రుద్రాక్షను ధరించడం వల్ల భక్తి భావం పెరిగి.. దైవంపై నమ్మకం ఏర్పడుతుందని పెద్దలు చెబుతున్నారు. (Ekamukhi Rudraksha)
పురాణాల్లోనూ రుద్రాక్షల గురించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. శివుడి కన్నీళ్ల నుంచి రుద్రాక్ష ఉద్భవించిందని చెబుతారు. శివ మహాపురాణంలో 16 రకాల రుద్రాక్షలు ఉన్నాయి. ఇందులో ప్రతి రుద్రాక్షకు ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా ఏకముఖి రుద్రాక్ష వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని పెద్దలు చెబుతున్నారు. అయితే, ఇది కొన్ని రాశుల వారు మాత్రమే ధరించాలని సూచిస్తున్నారు.
రుద్రాక్షల్లో కొన్ని నకిలీలు కూడా వస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలైన రుద్రాక్షలు ధరించడం వల్ల ప్రయోజనాలు పొందవచ్చని స్పష్టం చేస్తున్నారు. ఆవనూనెలో ఏకముఖి రుద్రాక్ష వేయడం వల్ల మొదటి రంగు కంటే ముదురు రంగులో కనిపిస్తే అది నిజమైన రుద్రాక్షగా భావించాలని చెబుతున్నారు. ఏకముఖి రుద్రాక్షకు ఒకే గీత ఉంటుంది. రుద్రాక్షను వేడి నీటిలో ఉడికించి కూడా అసలైనదో కాదో తెలుసుకోవచ్చు. రంగు వెలిసిపోతే అది డూప్లికేట్‌గా పరిగణించాలి. ఏకముఖి రుద్రాక్ష అర్ధచంద్రాకారంలో ఉంటుంది. చూడటానికి జీడిపప్పు ఆకాంలో ఉంటుంది.
ఏ రాశివారు ధరించాలి?
ఏకముఖి రుద్రాక్షను కొన్ని రాశుల వారు ధరించాలని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. ఏకముఖి రుద్రాక్షను సింహరాశివారు ధరించాలని చెబుతున్నారు. ఇతర రాశుల వారు ధరించాలంటే జ్యోతిష్య నిపుణులను సంప్రదించి అనుసరించాలని చెబుతున్నారు. ఏకముఖి రుద్రాక్ష ధారణ వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గుండెకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయని పెద్దలు చెబుతున్నారు. అంతేకాదు.. డబ్బు సంపాదన పెరగడానికి కూడా ఏకముఖి రుద్రాక్ష తోడ్పడుతుందని స్పష్టం చేస్తున్నారు.
ఇదీ చదవండి: Devotional Tips work: పని మీద బయటకు వెళ్లేటప్పుడు ఈ పనులు చేస్తే.. అంతా శుభమే!