ఆదివారం, 20 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Cinema

Bollywood : రాత్రికి రమ్మని ఒత్తిడి చేశారు.. బడా హీరోలతో అలా చేసేందుకు ఒప్పుకోలేదన్న స్టార్ హీరోయిన్

Keerthanaa News Deskప్రచురణ తేదీ: బుధవారం, 19 నవంబర్ 2025

Bollywood : సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సమస్య గురించి తరచూ వార్తలు బయటకు వస్తూనే ఉంటాయి. పలువురు హీరోయిన్స్ ధైర్యంగా ఇలా ఎదుర్కొన్న అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. తాజాగా మరో ప్రముఖ నటి కూడా క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

చిత్ర పరిశ్రమలో చాలా మంది నటీమణులు డీ–గ్లామర్ రోల్స్‌ నుంచి ఎక్స్‌ట్రీమ్ గ్లామర్ రోల్స్ వరకు చేసి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటారు. అయితే, బయట వాళ్లు పెద్దగా గుర్తించనివిధంగా ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్‌లు కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అలాంటి అనుభవమే తాను కూడా ఎదుర్కొన్నానని, రాజీకి ఒప్పుకోలేదని దీంతో సినిమా ఆఫర్లు తగ్గిపోయాయని ఈ నటి చెప్పింది.

ఒకప్పుడు బాలీవుడ్‌లో హాట్ అండ్ బోల్డ్ బ్యూటీగా సెన్సేషన్ సృష్టించిన మల్లికా షెరావత్ ఈ విషయంపై స్పందించింది. స్టార్ హీరోల సినిమాల్లో నటించి, బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లో కూడా తనదైన గుర్తింపు తెచ్చుకున్న మల్లికా, ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటుంది.

గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ—
“చాలా మంది హీరోలు నన్ను రాత్రివేళల్లో కలవాలని కోరేవారు. నేను బోల్డ్ పాత్రలు చేశానని వాళ్లు ఏం చెప్పినా వినాలా? ఎందుకు రాత్రి సమయంలో వెళ్లాలి? పెద్ద హీరోలతో రాజీ పడని కారణంగా నా చేతిలో సినిమాలు తగ్గిపోయాయి. కానీ నేను ఆ టైప్ కాదు,” అని స్పష్టంగా చెప్పింది.

తన బోల్డ్ ఆన్‌స్క్రీన్ ఇమేజ్‌ను నిజజీవితానికీ పోల్చడం ఆమెను తీవ్రంగా బాధించిందని, తమ ఆలోచనలను అంగీకరించలేనని మల్లికా చెప్పిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

ఇవీ చదవండి: Tollywood : తెలుగులో మొట్టమొదటి వెయ్యికోట్ల హీరోయిన్.. అందం.. నటనలోనూ చిరస్థాయిగా నిలిచిన అప్సరస
Bhagyashri Borse : అదరగొడుతున్న ముద్దుగుమ్మ.. రెడీ ఫర్ కింగ్‌డమ్!

ట్యాగ్స్: , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading