Thyroid: చాలా మంది థైరాయిడ్ (Thyroid) సమస్యతో బాధపడుతుంటారు. గజిబిజి జీవన శైలి కారణంగా సరైన ఆహారం తీసుకోకపోవడం, విటమిన్లు, మినరల్స్ బాడీకి అందకపోవడం లాంటి కారణాలతో థైరాయిడ్ వ్యాధి బారిన పడుతుంటారు. థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారు ఆహారం తీసుకోవడంపై శ్రద్ధ వహించాలి. ప్రతి పది పందిలో ఐదుగురు థైరాయిడ్ జబ్బుతో సతమతం అవుతున్నారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరంలో కొన్ని కీలకమైన గ్రంథుల్లో థైరాయిడ్ ఒకటి.
ఒక్కసారి థైరాయిడ్ వచ్చిందంటే రోజూ మందులు వాడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అయితే, దీనికి ఓ పరిష్కారం ఉంది. రోజూ పరగడపున కొబ్బరి నీరు తాగితే.. థైరాయిడ్ (Thyroid) నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. పరగడపున కొబ్బరి నీరు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు చేకూరుతాయని స్పష్టం చేస్తున్నారు. రోజూ పరగడుపున కొబ్బరి నీటిని తాగడం వల్ల మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. శరీరం అంతర్గతంగా శుభ్రం కావడానికి దోహదపడుతుందని చెబుతున్నారు. ఒంట్లో ఉండే బాక్టీరియా, వైరస్‌లు బయటకు వెళ్లిపోతాయని స్పష్టం చేస్తున్నారు.
థైరాయిడ్ టీ3, టీ4 అనే రెండు హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. శరీరంలోని చాలా భాగాలతో థైరాయిడ్ ముడిపడి ఉంటుంది. థైరాయిడ్ సమస్య వచ్చిందంటే శరీరంలోని చాలా భాగాలు ప్రభావం అవుతాయి. శ్వాస వ్యవస్థ, గుండె, నాడీ, జీర్ణ వ్యవస్థ, సంతానోత్పత్తి వ్యవస్థ లాంటి వాటిపై ప్రధానంగా థైరాయిడ్ హార్మోన్ ఎఫెక్ట్ చూపుతుంది.
రోజూ ఉదయం లేవగానే కొబ్బరి నీళ్లు (Coconut Water) తాగితే మూత్ర నాళాలు, కిడ్నీల్లో ఉండే రాళ్లు కరిగిపోతాయట. శరీరానికి కొత్త శక్తి చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజంతా ఉత్సాహంగా పనులు చేసుకొనేందుకువ వీలవుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుందట. చర్మంపై ఉండే మచ్చలు, ముడతలు లాంటివి తొలగిపోతాయని చెబుతున్నారు. చర్మం మృదువుగా తయారవుతుంది. జీర్ణాశయం, పేగుల్లో ఉండే క్రిములు చనిపోతాయి. అజీర్ణం, గ్యాస్, అసిడిటీ సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
అసలేంటీ థైరాయిడ్…?
థైరాయిడ్ అనేది సీతాకోక చిలుక రూపంలో కంఠం వద్ద ఉండే ఒక ఎండోక్రైన్ గ్లాండ్. ఇది థైరాక్సిన్ అనే థైరాయిడ్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. దీంతో బాడీలో అనేక మెటబాలిక్ ప్రాసెస్‌లపై ఎఫెక్ట్ చూపిస్తుంది. సాధారణంగా ఉండే థైరాయిడ్ సమస్యల్లో తగినంత థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ కాకపోవడం, అవసరమైన ఆని కంటే ఎక్కువగా థైరాయిడ్ రిలీజ్ కావడం, థైరాయిడ్ స్వెల్లింగ్, థైరాయిడ్ ట్యూమర్స్, థైరాయిడ్ క్యాన్సర్ లాంటివి కనిపిస్తాయి.
ఇక హైపోథైరాయిడిజం, హైపర్‌థైరాయిడిజం అనేవి చాకా సాధారణంగా ఉండే థైరాయిడ్ డిసార్డర్స్. ఇవి శరీరంలో ఉండే టిష్యూలకి వ్యతిరేకంగా అబ్నార్మల్ గా జరిగే ఇమ్యూన్ రెస్పాన్స్ వల్ల వచ్చేస్తాయి. దీన్నే ఆటో ఇమ్యూనిటీ అని పిలుస్తారు. థైరాయిడ్ లక్షణాల విషయానికి వస్తే.. ఉన్నట్టుండి బరువు పెరగడం, ఎక్కువ సమయం పాటు నీరసంగా అనిపించడం, చలిగా ఉండటం, స్కిన్ పొడిబారడం, కాన్‌స్టిపేషన్, మతిమరుపు రావడం, ఏకాగ్రత లోపించడం.. లాంటివి కనిపిస్తుంటాయి. వీటితోపాటు స్త్రీలలో పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా రావడం, అధికంగా రక్తస్రావం కావడం, సబ్ ఫెర్టిలిటీ కూడా ఉండే చాన్స్ ఉంటుంది. పిల్లల్లో ఎదుగుదల లోపించడం, ప్యూబర్టీ ఆలస్యం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
ఇక థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా విడుదల కావడం వల్ల ఉన్నట్టుండి బరువు తగ్గడం, వణుకు, యాంగ్జైటీ, నెర్వస్‌నెస్, పాల్పిటేషన్, విపరీతంగా చెమట పట్టడం, మాటిమాటికీ మలవిసర్జన చేయాల్సి రావడం, పీరియడ్స్‌లో బాగా తక్కువ రక్తం రావడం జరుగుతుంటుంది. ఇలాంటి సమయాల్లో వైద్యులను సంప్రదించి తగిన చికిత్స విధానాలు పాటించాలి.
Read Also : Sabja Seeds: సబ్జా గింజలతో లాభాలు తెలుసా? చర్మ సమస్యలకు చెక్