Pregnancy: సంతానం కోసం చాలా మంది ఆశగా ఎదురు చూస్తుంటారు. అలాంటి క్షణాలు ఉద్విగ్నభరితమైనవి. చక్కటి సంతానం కావాలని, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. మాతృత్వపు మాధుర్యం అనేది తియ్యనిది. ప్రెగ్నెన్సీ కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలి? వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా మందికి ఆసక్తి కలిగించే అంశం. తెలుసుకోవాలనిపించే అంశం. కానీ.. ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసినప్పటి నుంచే స్తీ, పురుషులు ఇద్దరూ చాలా విషయాల్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. (Pregnancy)
గర్భధారణకు 6 నెలలు, ఏడాది, రెండేళ్ల ముందు నుంచే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎక్సర్‌సైజ్ దగ్గర నుంచి సరైన పౌష్టికారం తీసుకోవడం వరకు ప్రతీ అంశంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. గర్భం దాల్చడానికి ముందు మహిళలు తమ శరీరం సహకరించేలా చూసుకోవాలి. ఎముకలు, కండరాల పటిష్టత, రక్త పరిమాణం, శారీరక, మానసిక బలం కూడా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. థైరాయిడ్, విటమిన్ D3, విటమిన్ B12, బ్లడ్ షుగర్ టెస్టులు కూడా చేయించుకోవాలి.
పౌష్టికాహారం తీసుకోవడం ముఖ్యం
సంతానోత్పత్తి పూర్తి శరీరానికి సంబంధించిన ప్రక్రియ. గర్భం ధరించేందుకు శరీరం సహకరించాలి. అండం, వీర్యం ఆరోగ్యకరంగా ఉండాలి. ఇందుకోసం స్త్రీ, పురుషులిద్దరూ సరైన పౌష్టికాహారం తీసుకోవాలి. బ్యానెన్స్‌డ్ బ్లడ్ షుగర్, పోషకాలు శరీరానికి అందించాలి. ఆకుపచ్చ కూరగాయలు, పుల్లటి పండ్లు, గింజలు, పాలు, పెరుగు, దోశా, పులిసిన సలాడ్స్ వంటి బలీయమైన ఆహారం తీసుకోవాలి. శరీరంలో సరైన మోతాదులో నీరు ఉండేలా చూసుకోవాలి.
చాలామంది అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు పిల్స్ వాడుతుంటారు. కానీ.. ఆ తర్వాత ప్రెగ్నెన్సీపైనా ఈ పిల్స్ ప్రభావం చూపొచ్చు. అందుకే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడానికి 6 నెలలు రెండేళ్ల ముందు నుంచే గర్భ నిరోధక మాత్రలు వాడకపోవడం బెటర్ అని గైనకాలజీ నిపుణులు సూచిస్తుంటారు.
సంతానం కోసం ప్లాన్ చేసుకునే స్త్రీ, పురుషులిద్దరూ… ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తుల్ని వదిలేయాలి. లేదంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపైనా ప్రభావం చూపొచ్చు. ఆహారంలో వేపుళ్లు కూడా తీసుకోవొద్దు. ఒత్తిడిని దరిచేరనీయొద్దు. ఒత్తిడి వల్ల అండాల ఉత్పత్తి, వీర్య కణాల సంఖ్యపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది.
శారీరక, మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. ఇందుకోసం సముద్రపు అలల కదలికలు, జలపాతాలు, వర్షం, అడవి శబ్ధాలు వింటూ ఉండాలి. ఫోలిక్ యాసిడ్, ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి. శారీరకంగా దృఢంగా ఉండేందుకు రోజుకు కనీసం గంట సేపు వ్యాయామం చేయాలి. వాకింగ్, ఫ్లోర్ ఎక్సర్‌సైజ్, యోగ ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలు 8-10 గంటల పాటు సరిపడా నిద్ర పోవాలి.
ప్రాణాయామం కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. విటమిన్ డీ కోసం రోజు 20 నిమిషాలు సూర్యరశ్మి పడేలా చూసుకోవాలి. గర్భం దాల్చిన తర్వాత కూడా నిపుణుల సలహాలు, సూచనల కోసం స్పెషల్ క్లాసెస్ తీసుకుంటే పండంటి బిడ్డకు జన్మివ్వవచ్చని గైనకాలజిస్టులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: Nithya Menon: పెళ్లి గురించి నిత్యా మీనన్ అభిప్రాయం ఏంటంటే..