అమ్మాయిల విషయంలో అబ్బాయిలు (Love Tips) తమ ప్రవర్తన కారణంగా వారితో బంధాన్ని వదులుకోవాల్సి వస్తుంటుంది. అమ్మాయిలు సంతోషంగా ఉండాలంటే అబ్బాయిల ప్రవర్తన అనేది చాలా ముఖ్యం. ఏ బంధమైన సుదీర్ఘకాలం కొనసాగాలంటే అన్యోన్యత (Love Tips) ఉండాల్సిందే. అబ్బాయిలు చేసే కొన్ని పొరపాట్ల వల్ల అమ్మాయిలు నొచ్చుకొనే అవకాశం ఉంటుంది. అలాంటి తప్పులు చేయకుండా ఉండాలంటే రిలేషన్ షిప్ లో కొన్ని టిప్స్ (Love Tips) పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
1. సాధారణంగా అమ్మాయిలు ఎవరైనా వాళ్ల సోల్ మేట్ తో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తుంటారు. అలా టైమ్ స్పెండ్ చేయడానికి ఇష్టపడుతుంటారు. ఇలాంటి పరిస్థితిని అబ్బాయిలు అర్థం చేసుకోవాలి.
2. వారితో స్నేహంగా ఉండటంతోపాటు ఎక్కువ సమయం కలిగి గడపడానికి ప్రాముఖ్యతనివ్వాలి. అయితే, అబ్బాయిల్లో ఎక్కువ శాతం మంది తమ ఫ్రెండ్స్ తో ఛిల్ అవుతుంటారు.
3. అందుకోసమే ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు. ఇలా చేస్తే అమ్మాయిలు నొచ్చుకొని బంధానికి దూరమయ్యే చాన్స్ ఉంటుంది.
4. వివాహం అయ్యాక జీవిత భాగస్వామి విషయంలోనూ కొన్ని విధానాలు పాటించాలి. కొత్తగా అత్తారింట్లో అడుగు పెట్టిన అమ్మాయిని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి.
5. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల వద్ద మాటల సందర్భంలో ఎప్పుడూ భార్యను తక్కువ చేసి మాట్లాడటం, హేళన చేయడం లాంటివి చేయరాదు. భార్యపై అందరి ముందూ కోపంగా విసుక్కోరాదు. ఇలా చేసినా మీ బంధం బలహీనపడుతుంది.
6. ఉద్యోగం, వ్యాపారంలో అబ్బాయిలకు బోలెడు టెన్షన్స్ ఉంటాయి. ఆఫీసులో ఒత్తిడి ఎదుర్కొంటుంటారు. ఆ ఒత్తిడులను ఇంట్లో వరకు తీసుకురాకండి.
7. ముఖ్యంగా ఆ కోపం, ఒత్తిడి భార్యపై కోపం చూపిస్తే వారు భరించలేరు. ఇంటికొచ్చాక కాస్త రిలాక్స్ అయిపోండి. తర్వాత నెమ్మిదిగా భాగస్వామితో మాట్లాడితే టెన్షన్ తగ్గిపోతుంది.
8. అమ్మాయిలకూ హ్యాపీ అనిపిస్తుంది. మా ఆయన వెరీ కూల్ అంటూ మీ భార్య అందరికీ చెప్పుకుంటుంది. ఇక దురలవాట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
9. ఆల్కహాల్, సిగరెట్ లాంటి అలవాట్లు మీ దాంపత్య జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.
మిమ్మల్ని ఆమె విపరీతంగా అభిమానిస్తోందా? సంకేతాలు ఇవే..
1. మగువలు తమకు నచ్చిన మగాడిని అమితంగా లవ్ చేస్తారు. అబ్బాయిలు కూడా తనకు నచ్చిన అమ్మాయి బాగా ప్రేమించాలని కోరుకుంటారు. అలాంటి అమ్మాయిలే తమ జీవిత భాగస్వామిగా కావాలని ప్రతి మగాడూ కోరుకుంటారు.
2. మరి మగువ మిమ్మల్ని అమితంగా ప్రేమించడానికి గల కారణాలేంటో తెలుసా..? తాను పిచ్చిగా ప్రేమిస్తోందనడానికి కొన్ని సంకేతాలు గమనించవచ్చు. అవేంటో తెలుసుకోండి..
3. మీ పార్ట్నర్ బాగా షాపింగ్ చేసో, లేదంటే ఉద్యోగంలో బాగా అలసిపోయే ఇంటికి వచ్చిన సందర్భంలోనూ మీరు చెప్పేది ఓపికగా వింటుంటే మిమ్మల్ని బాగా ఇష్టపడుతున్నట్టు లెక్క.
4. ఎంత ఓపిక లేకున్నా మీపై అమితమైన ఇష్టంతో మీకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటుందని అర్థం. మీపై పిచ్చి ప్రేమ ఉన్నట్లు నిదర్శనం. మీరు క్షమించరాని తప్పులు చేసినా ఆమె పెద్ద గొడవ చేయకుండా చాలా ఈజీగా మన్నించేస్తోందంటే ఇక మీపై చెరగని అనురాగం ఉన్నట్లు గుర్తించాలి.
5. దాంపత్య జీవితంలో స్త్రీకి, పురుషుడికి వేర్వేరు అభిరుచి ఉంటుంది. మీ అలవాట్లు మార్చుకోకున్నా, ఆమె మీ ట్రాక్ లోకి వచ్చి అడ్జస్ట్ అవుతోందంటే ఆమెకు మీపై అమిత ప్రేమ ఉందనుకోవాలి.
6. కొత్త విషయాలు నేర్చుకొనే క్రమంలోనూ మీవెంటనే నడిచిందంటే మీపై పిచ్చి ప్రేమ ఉన్నట్లే. ప్రతి సందర్భంలోనూ, సందర్భం లేకున్నా మీకు బహుమతులిచ్చి సర్ ప్రైజ్ చేస్తున్నా మీపై ప్రేమ బాగా ఉన్నట్లు లెక్క.
7. ప్రతి క్షణం మీపై ఏదో ఓ రకంగా ప్రేమను కనబరుస్తూ ఉంటే, మిమ్మల్ని సంతోష పెట్టాలని ప్రయత్నిస్తుంటే ఆమె మిమ్మల్ని, మీ అనురాగాన్ని బాగా ఇష్టపడుతోందని అర్థం.
8. పొరపాటున ఆమె ఏదైనా తప్పు చేస్తే.. వెంటనే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతోందంటే మీపై చెప్పలేనంత ప్రేమ ఉన్నట్లుగా భావించాలి. మెట్టినింట్లో భర్త కుటుంబ సభ్యుల్ని సైతం భార్య మెప్పించాలని యత్నించడం కూడా ఇందులో భాగమే.
Read Also : Astrology tips : అతి ప్రేమ చూపిస్తున్నారా? ఈ రాశుల వారికి జరిగేది ఇదే..