Sugar Patient Fruits: చక్కెర వ్యాధి వచ్చిందంటే అలాంటి వారి జీవన శైలి మహా ఇబ్బందికరంగా మారుతుంది. ఏవి తినాలో ఏవి తినకూడదో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా పండ్ల విషయానికి వచ్చేసరికి.. కొన్నింటిని అస్సలు తినరాదు. ఇందులో ఏయే రకాల ఫ్రూట్స్ తినకూడదు? ఏవి తినాలో నిపుణులు వివరంగా చెబుతున్నారు. (Sugar Patient Fruits)
షుగర్ వ్యాధి ఉన్న వారు తినకూడని పండ్లు ఇవీ..
1. అరటిపండు
2. మామిడి
3. సపోటా
4. ఖర్జూరం
5. సీతాఫలం
వీటితోపాటు పైనాపిల్, నారింజ, ద్రాక్ష, ఎండిన రేగు, పుచ్చకాయ లాంటి ఫ్రూట్స్‌లోనూ అధిక స్థాయిలో గ్లైసెమిక్ సూచిక ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. వైద్యుల సూచన మేరకు ఈ పండ్లను తీసుకోవచ్చంటున్నారు.
ఇవి తప్ప మిగతా అన్ని ఫ్రూట్స్ తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే, మిగతా పండ్లు మాత్రమే తిని షుగర్‌కు వైద్యులు ఇచ్చిన మాత్రలు వేసుకొని నిద్రపోతే కూడా కొన్ని సమస్యలు వస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. అలా పండ్లు తిని టాబ్లెట్లు వేసుకొని పడుకుంటే ఆ నైట్ నిద్రపోయినప్పుడు షుగర్ డౌన్ అయిపోయే ప్రమాదం ఉందంటున్నారు. కొన్ని రకాల పండ్లు అంటే పుచ్చకాయ లాంటివి తిని పడుకుంటే ఆ జ్యూస్ కరిగిపోయి అందులోని గ్లూకోజ్ అంతా రెండు గంటల్లోపు కంట్రోల్ అయిపోతుందంటున్నారు. ఆ తర్వాత టాబ్లెట్ పవర్ అలాగే ఉండి షుగర్ డౌన్ అయ్యే చాన్స్ లేకపోలేదంటున్నారు.
శీతల పానీయాలు, వైట్ బ్రెడ్, వైట్ రైస్, బంగాళదుంపలలో గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోవద్దని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే గ్లైసెమిక్ ఇండెక్స్‌తో పాటు.. అధిక కార్బోహైడ్రేట్ స్థాయిలు కలిగిన పండ్లు, కూరగాయలు, ఆహారాలు కూడా డయాబెటిస్ ఉన్నవారికి ప్రమాదాన్ని తెచ్చిపెడతాయంటున్నారు.
ఈ క్రమంలో ఏ పండు తింటే ఏ ప్రమాదం ఉంటుందోనని షుగర్ పేషెంట్లు భయపడుతుంటారు. చక్కెర వ్యాధి ఉన్న వారు తినాల్సిన పండ్లు..
1. జామపండు తింటే షుగర్ కంట్రోల్‌లో ఉంటుందని నిపుణులు అంటున్నారు.
2. రేగు
3. కివీస్
4. జామూన్… లాంటి వాటిలో కాస్త తక్కువ స్థాయిలో గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటిని నిరభ్యంతరంగా తినొచ్చంటున్నారు.
Read Also : Dragon Fruit For Diabetes: డయాబెటిస్‌కు డ్రాగన్ ఫ్రూట్‌తో ఇలా చెక్..!