మనం తినే ఆహారాన్ని నిల్వ చేయడం కోసం రకరకాల పద్ధతులు ఫాలో అవుతుంటారు. ఈ మధ్య కాలంలో అయితే ఫుడ్‌ను నిల్వ ఉంచడానికి అల్యూమినియం కవర్లు (Aluminum Foil Use) కాస్త ఎక్కువగానే వినియోగిస్తున్నారు. ఆఫీసులకు బాక్సు తీసుకెళ్లే వారికైనా, పిల్లలకు టిఫిన్ బాక్సులైనా ఈ మధ్య అల్యూమినియం ఫాయిల్‌లో (Aluminum Foil Use) ఫుడ్ ఉంచుతున్నారు. అల్యూమినియం ఫాయిల్‌లో ఆహారాన్ని ఉంచడం వల్ల ఎక్కువ సమయం వేడిగా, ఫ్రెష్‌గా ఉంటాయని చెబుతారు.
రోలింగ్ మిల్ అనే యంత్రంలో ఈ అల్యూమినియం ఫాయిల్‌ను తయారు చేస్తారు. అయితే, అల్యూమినియం కవర్లలో ఎక్కువ సమయం ఆహార పదార్థాలను ఉంచడం ప్రమాదకరమని నిపుణులు పేర్కొంటున్నారు. అల్యూమినియం ఫాయిల్‌లో మిగిలిపోయిన ఫుడ్‌ని నిల్వ చేయటం వల్ల లోపలే బ్యాక్టీరియా పెరిగేలా చేస్తుందంటున్నారు. ఒక రోజు తరువాత ఆహారం పాడవుతుంది కాబట్టి ఎక్కువ సమయం ఉంచరాదని చెబుతున్నారు.
మరోవైపు రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు పెద్ద ఎత్తున వీటిని వినియోగిస్తుంటారు. అయితే, అల్యూమినియం ప్రస్తుతం ప్యూర్ దొరకడం లేదని చెబుతున్నారు. స్వచ్ఛమైన అల్యూమినియం అంత సులువుగా దొరకదని చెబుతున్నారు. అల్యూమినియం ఫాయిల్‌ను తయారు చేయాలంటూ దానికి ముందుగా అల్యూమినియంను కరిగిస్తారు.
ఆహారాన్ని నిల్వ చేయటానికి ఈ మధ్యకాలంలో అల్యూమినియం కవర్స్ వాడకం బాగా పెరిగింది. ఆఫీస్ బాక్స్ అయినా.. పిల్లల టిఫిన్ బాక్స్ అయినా.. ఈరోజుల్లో అల్యూమినియం ఫాయిల్ లో ఫుడ్ పెడుతున్నారు. అల్యూమినియం ఫాయిల్ ను ఆహారాన్ని ఎక్కువసేపు తాజాగా మరియు వేడిగా ఉంచడానికి ఉపయోగిస్తారు.
ఐదు గంటలకంటే మించి ఉంచరాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఫాయిల్ కంటెయినర్స్‌లో నిల్వ ఉంచడం, అందులోని ఫుడ్‌ను చాలా సేపటి తర్వాత తీసుకోవడం ఆరోగ్యానికి హాని చేస్తుందంటున్నారు. ఆల్కహాలిక్, సెలైన్‌తో పోలిస్తే ఇది ఆమ్ల, సజల ద్రావణాలలో గణనీయంగా ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అల్యూమినియం ఫాయిల్ హై టెంపరేచర్ పరిస్థితుల్లో నిల్వ ఉంచే ఆహారాల్లో లోహం కలిసేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఐదు గంటల కంటే ఎక్కువ సమయం ఉంచకూడదని స్పష్టం చేస్తున్నారు.
Read Also : Ginger Peel Benefits: తొక్కే కదా అని పడేస్తున్నారా? అల్లం తొక్కతో..