నేటి కాలంలో చాలా మంది నిద్ర లేమితో బాధపడుతుంటారు. వృత్తి జీవితంలో టెన్షన్లు, ఇంట్లో పిల్లల పెంపకం, చదువులు.. ఇలా అన్నీ చూసుకోవడం వల్ల కంటికి కునుకు తక్కువ అవుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కళ్ల కింద డార్క్ సర్కిళ్లు (Dark Circle) వస్తుంటాయి. ఫలితంగా మొహంలో కాంతివంతం లేకుండా పోతుంది. మరి కళ్ల కింద డార్క్ వలయాలను (Dark Circle) తగ్గించి మొహాన్ని కాంతివంతంగా తయారు చేసుకోవాలంటే ఏం చేయాలి?
1. సరైన ఆహారం తీసుకోకపోయినా కళ్ల కింద వలయాలు వస్తాయి.
2. వీటిని తగ్గించుకోవడానికి అనేక రకాల ట్రీట్మెంట్లు తీసుకొని అలసిపోతుంటారు.
3. కానీ ఫలితం లేదని కొందరు వాపోతుంటారు. ఇలాంటి వారికి అల్లోవెరా బెస్ట్ ఉపశమనం ఇస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
4. కలబందను అనేక రకాలుగా మనం ఆరోగ్య ప్రయోజనాల కోసం వాడుకోవచ్చు.
5. నిమ్మ, కలబందతో బోలెడు లాభాలు ఉన్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
6. కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ను రూపుమాపాలంటే కలబంద, నిమ్మకాయను వినియోగించవచ్చు. ఇవి మంచి ఫలితాలను ఇస్తాయి.
7. గిన్నెలో 2 టీస్పూన్ల కలబంద రసం తీసుకొని అందులో కొన్ని చుక్కల నిమ్మ రసం కలపాలి. దీన్ని కళ్ల కింద అప్లై చేసుకోవాలి.
8. ఓ అరగంట పాటు అలా ఉంచేసి క్లీన్ చేసుకుంటే కొన్ని రోజుల్లోనే డార్క్ సర్కిల్స్ సమస్య దూరమవుతుంది.
9. అలాగే, బంగాళా దుంపతో కలిపి అల్లోవెరా తీసుకున్నా డార్క్ సర్కిల్స్ సమస్య తగ్గుముఖం పడుతుంది.
10. వీటిని రెండింటినీ కలిపి పేస్ట్ చేసి కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఉన్న చోట పూసుకోవాలి.
11. టీస్పూన్ బంగాళాదుంప రసం, ఓ టీస్పూన్ అల్లోవెరా రసం కలిపి అప్లై చేసుకోవాలి.
12. దీంతో పాటు రోజ్ వాటర్, అల్లోవెరా కలిపి అప్లై చేసినా బెస్ట్ రిజల్ట్ చూడవచ్చు.
13. ఇవి అప్లై చేశాక 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి.
14. ఇలా అనేక పద్ధతులను పాటించడం ద్వారా కళ్ల కింద డార్క్ సర్కిల్స్‌ను తగ్గించుకోవచ్చు.
లైఫ్ లో టెన్షన్లు, ఇంట్లో పిల్లల పెంపకం, చదువులు.. ఇలా అన్నీ చూసుకోవడం వల్ల కంటికి కునుకు తక్కువ అవుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కళ్ల కింద డార్క్ సర్కిళ్లు (Dark Circle) వస్తుంటాయి. ఫలితంగా మొహంలో కాంతివంతం లేకుండా పోతుంది.
Also Read : Bad cholesterol: ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ తగ్గించాలంటే ఏం తినాలి?