నటుడు, రచయిత ఉత్తేజ్ (Uttej) తన కూతురుపై షాకింగ్ కామెంట్స్ చేశాడట. ఉత్తేజ్ (Uttej) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ఇంట్రడ్యూస్ చేయాల్సిన పని లేదు. 90లలో మూవీల నుంచి ఇప్పటి వరకు అనేక చిత్రాల్లో నటించారు. అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు పొందారు. నటుడిగానే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్, రైటర్ గానూ ఉత్తేజ్ గుర్తింపు పొందారు. ఇటీవల మొన్నా మధ్య ఓ ఇంటర్వ్యూలో తన జెర్నీలోని విశేషాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా తన గురించి, తన కుమార్తె నట జీవితం గురించి అనేక విషయాలు తెలిపారు ఉత్తేజ్.
ఈ సందర్భంగా చేతన గురించి ఉత్తేజ్ ను పలు ప్రశ్నలు అడుగుతుంది యాంకర్. పూర్తి స్థాయి హీరోయిన్ గా ఎప్పుడు తయారు చేస్తున్నారన్న ప్రశ్నకు పిచ్చిగా నచ్చావ్ అనే సినిమాలో ఇప్పటికే హీరోయిన్ గా చేసిందని ఉత్తేజ్ బదులిస్తాడు. ఉత్తేజ్ కూతురు బాగా చేసిందనే మాట తనకు వినిపించకూడదని చెబుతాడు ఉత్తేజ్. అలా అంటే తన కూతుర్ని చచ్చిపోమని చెప్పానని ఉత్తేజ్ బదులిస్తాడు. చేతన బాగా చేసిందంటేనే తనకు సంతృప్తి కలుగుతుందన్నాడు.
తన కుమార్తె చేతన గురించి ప్రస్తావన రాగా బద్రి సినిమాలో నటించిన సీన్ ను యాంకర్ చూపించి పలు ప్రశ్నలు అడుగుతుంది. ఆ మూవీలో పవన్ కల్యాణ్ వద్దకు వచ్చిన ఓ చిన్నారి.. నీ పేరేంటి.. ఎందుకు డల్ గా ఉన్నావ్ అని అడుగుతుంది. అప్పుడు పవన్ కల్యాణ్, ఆ చిన్నారి మధ్య జరిగే సీన్ ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సీన్ లోని పాప నేడు హీరోయిన్ గా చేస్తోంది. ఆమే ఉత్తేజ్ కుమార్తె చేతన.
ఇక ఉత్తేజ్ పూర్తి స్థాయి డైరెక్టర్, పూర్తి స్థాయి నటుడిగా ఉండటం తాను ఇష్టపడతానని తెలిపాడు. సినిమాలే తన ప్రపంచమని, సినిమా లేకపోతే తాను చచ్చిపోతానని చెప్పాడు ఉత్తేజ్. సినిమా రంగం అనేది ఒక టైమ్ మిషన్ లాంటిదని చెప్పాడు. ఒక సినిమాలో మనం నటిస్తే కొన్ని వందల సంవత్సరాలు మనం బతికుంటామన్నాడు. ఓ సినిమా వెనక్కి వెళ్తే మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆర్థిక వ్యవస్థ, ఇలా అన్నీ బయటకు వస్తాయని తెలిపాడు.
Anu Emmanuel: అల్లు హీరోకు, అనుకు మధ్య అలాంటి రిలేషన్ ఉందా?
టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్, హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ జంటగా మొన్నామధ్య నటించిన చిత్రం ఊర్వసివో, రాక్షసివో. ఈ చిత్రం యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి ఇంప్రెషన్ ఇచ్చింది. సినిమాలో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయి నటించిన సంగతి తెలిసిందే. అచ్చం నిజ జీవితంలో లవర్స్ లాగే ప్రవర్తిస్తూ నటనలో అదరగొట్టారు. ఆ నేపథ్యంలో వీరిద్దరిపై పుకార్లు వచ్చాయి. అను ఇమ్మాన్యుయేల్, అల్లు శిరీష్ కలిసి డేటింగ్ చేస్తున్నారనే వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి.
ఊర్వసివో, రాక్షసివో సినిమాలో కొన్నిరొమాంటిక్ సీన్లు ఉన్నాయి. ప్రేమ, డేటింగ్ లాంటి కాన్సెప్ట్‌లతో ఈ మూవీ తెరకెక్కించారు. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు హల్ చల్ సృష్టిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, ట్రైలర్లు విడుదలైనప్పటి నుంచి వీరిపై ఇలాంటి పుకార్లు షికార్లు చేశాయి.
దీనిపై నటి అను ఇమ్మాన్యుయేల్ కూడా రియాక్ట్ అయ్యింది. సినిమా రంగంలో ఇలాంటి పుకార్లు కామన్‌గా వస్తుంటాయని, అలాంటి వార్తలను తాను పట్టంచుకోనని అప్పట్లో ఆమె కొట్టి పారేసింది. అసత్య వార్తలను తాను లైట్ తీసుకుంటానని అను అమ్మాన్యుయేల్ చెప్పింది. అయితే, ఈ తరహా వార్తలకు తన తల్లి బాగా బాధపడుతోందని వాపోయింది. అలాంటి పుకార్లు వద్దని పేర్కొన్న విషయం తెలిసిందే.
ఒకరోజు అల్లు అరవింత్ తన ఇంటికి పిలింపించి శిరీష్‌తో డేటింగ్ చేస్తున్నావా? అంటూ అడిగారని అను ఇమ్మాన్యుయేల్ తెలిపింది. శిరీష్‌తో పుకార్ల గురించి ఇద్దరూ మాట్లాడుకొని కొంత సేపు సరదాగా నవ్వుకున్నామంటూ చెప్పింది ఈ అమ్మడు.
Read Also : Simhadri: సింహాద్రి రీరిలీజ్.. మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే ఏంటో చూస్తారు!