శనివారం, 12 సెప్టెంబర్ 2026తాజా వార్తలు • ట్రెండింగ్
Andhra Pradesh

YS Jagan: ఏబీఎన్ రాధాకృష్ణ‌పై వైఎస్ జ‌గ‌న్ ఫైర్.. ఆడ‌వాళ్ల‌పై ఏమిటీ రాత‌లంటూ మండిపాటు

Keerthanaa News Deskప్రచురణ తేదీ: బుధవారం, 8 ఏప్రిల్ 2026

YS Jagan: ఏపీలో మావిగ‌న్ మంట‌లు హాట్ టాపిక్ అయ్యాయి. అమ‌రావ‌తి రాజ‌ధానికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త నేప‌థ్యంలో మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మావిగ‌న్ ప్ర‌తిపాద‌న తెర‌పైకి రావ‌డంతో రాజ‌కీయ వేడి రాజుకుంది. దీనిపై నేత‌లు మాట‌ల తూటాలు పేలుస్తున్నారు. ఈ అంశాన్ని డైవ‌ర్ట్ చేసేందుకు ఆడ‌వాళ్లపై వ్య‌క్తిత్వ హ‌న‌నానికి పాల్ప‌డుతున్నారంటూ వైసీపీ మండిప‌డింది. వైసీపీలోని నేత‌ల‌ను, వారి భార్య‌ల‌ను ఉద్దేశించి చెల్లెళ్లుగా భావించి పెళ్లి సంబంధాలు చేస్తారంటూ ఏబీఎన్ రాధాకృష్ణ త‌న ఛాన‌ల్లో ప్ర‌సారం చేయ‌డం అగ్గిరాజేసింది. ఇవాళ హైద‌రాబాద్ లోని ఏబీఎన్ ప్ర‌ధాన కార్యాల‌యం వ‌ద్ద భారీ స్థాయిలో నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. అనంత‌రం మాజీ సీఎం జ‌గ‌న్.. ఏబీఎన్ రాధాకృష్ణ‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేశారు. ట్వీట్లో జ‌గ‌న్ ఏమ‌న్నారంటే..

“రేపు వైయస్‌ జగన్ మోహన్ ‌రెడ్డి మీ భార్యలను మీ భార్యలు కాదని చెబితే, మీరు దాన్ని నమ్మి, మీ సొంత భార్యలను అక్కచెల్లెళ్లుగా భావించి మరీ పెళ్లి సంబంధాలు చూసే స్థాయికి దిగజారిపోతారు. అంతగా వెన్నెముకలేని నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు!” అంటూ వేమూరి రాధాకృష్ణ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ లో వ్యాఖ్యానించారు.

మహిళలను ఉద్దేశించి ఇలాంటి అసహ్యకరమైన, దిగజారిన భాషను ఉపయోగించడం, వారిని రాజకీయ చర్చల్లోకి లాగడం విమర్శ కానే కాదు. ఆ వ్యాఖ్యలు మహిళలను అవమాన పరచడమే కాకుండా, వారిని కించపరిచేలా చేసిన దాడిగానే భావించాలి. ఎలాంటి వివక్ష పూరిత జర్నలిజం చేస్తున్నారన్నదానిపై ఈ వ్యాఖ్యలు తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇవి మహిళలను అవమానించడానికే కాదు, ప్రజల్లో “MAVIGUN” ప్రతిపాదనపై జరుగుతున్న చర్చను దారి మళ్లించడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం. “MAVIGUN” ప్రతిపాదనను రాజకీయంగా ఎదుర్కోలేక, చంద్రబాబు, ఆయనకు అనుకూలంగా ఉన్న మీడియా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోంది. దీంట్లో భాగంగా తప్పుడు ప్రచారాలు చేయడమే కాకుండా దూషణలకు కూడా దిగారు.

మేము శాంతియుతంగా నిరసనలు చేపట్టి, రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాము. ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ, మా నాయకులు, కార్యకర్తలు ఎక్కడా హింసకు పాల్పడకుండా, శాంతియుతంగా, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ అత్యంత సంయమనంతో వ్యవహరించారు.

ఈ జుగుప్సాకర వ్యాఖ్యలను ఖండించకుండా, చంద్రబాబు, నారా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌లు ఈ వ్యాఖ్యలకు మద్దతు ఇవ్వడం, మహిళల పట్ల వారికి ఉన్న అవమానకర ధోరణిని, ద్వేషభావాన్ని చూపిస్తోంది. రాధాకృష్ణపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. బాధ్యతారహిత, విషపూరిత వ్యాఖ్యలను సమర్థించిన నాయకుల వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అని జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

ఇవీ చ‌ద‌వండి: YS Jagan MAVIGUN: దేశంలో అతి పెద్ద స్కామ్‌కు క్యాపిటల్‌ అమరావతి.. మ‌చిలీప‌ట్నం, విజ‌య‌వాడ‌, గుంటూరు.. మ‌.వి.గ‌న్ అంటూ జగన్‌ సంచ‌ల‌నం
YS Jagan Tweet: హలో ఇండియా.. ఏపీలో నో పోలీస్‌, నో పోలీస్‌, నో పోలీస్‌.. వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న ట్వీట్
YS Jagan: నియోజకవర్గాల పెంపుపై వైఎస్ జ‌గ‌న్ హాట్ కామెంట్స్.. సీట్ల పెంపు, మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ల‌పై..

Summarize with AI

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading