సోమవారం, 19 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Crime News, Telangana

Hyderabad: ఫ్లాట్‌లో స్నేహితుడితో ఉన్న యువతి.. తండ్రి రావడంతో తప్పించుకునే ప్రయత్నంలో ఎనిమిదో అంతస్తు నుంచి..

Keerthanaa News Deskప్రచురణ తేదీ: ఆదివారం, 21 డిసెంబర్ 2025

Hyderabad: నగరంలో విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫ్లాట్‌లో స్నేహితుడితో ఉన్న సమయంలో తండ్రి అక్కడికి రావడంతో భయపడిన 20 ఏళ్ల యువతి, తప్పించుకునే ప్రయత్నంలో ఎనిమిదో అంతస్తు నుంచి కిందపడిపోయి మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీకి చెందిన యువతి నగరంలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. అదే సంస్థలో పనిచేస్తున్న ఓ యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. యువతి కుటుంబానికి తెల్లాపూర్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ ఉంది.

గురువారం రోజున యువతి తన స్నేహితుడితో కలిసి ఆ ఫ్లాట్‌కు వెళ్లి అక్కడ కొంతసేపు గడుపుతున్నారు. ఈ సమయంలో రేషన్ బియ్యం తీసుకునేందుకు యువతి తండ్రి ఆ ఫ్లాట్‌కు వచ్చాడు. బయట నుంచి ఫ్లాట్‌కు తాళం వేసి ఉన్నప్పటికీ, లోపల నుంచి చప్పుళ్లు రావడంతో ఎవరో ఉన్నారని అనుమానించిన తండ్రి బయట నుంచి కేకలు వేసినట్లు పోలీసులు తెలిపారు.

తండ్రి వచ్చాడన్న భయంతో యువతి, ఆమె స్నేహితుడు పక్క ఫ్లాట్ వైపు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎనిమిదో అంతస్తులోని బాల్కనీ నుంచి యువతి కిందపడిపోయింది. తీవ్ర గాయాలపాలైన ఆమె ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి: Telangana Crime : అక్క వరుసయ్యే మహిళతో వివాహేతర బంధం.. చివరకు భర్త చేతిలో ఏమైందంటే..
Supreme Court: వివాహేతర బంధం నిర్ధారణకు కాల్‌ రికార్డులు తీసుకోవచ్చా? సుప్రీంకోర్టు ఏమందంటే..

ట్యాగ్స్: , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading