జాతిరత్నాలు సినిమా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. చూడటానికి నార్త్ ఇండియన్ గర్ల్‌లా కనిపించే ఈ అమ్మడు.. (Faria Abdullah) అచ్చమైన హైదరాబాదీ అమ్మాయే. తాను పుట్టింది, పెరిగింది, చదివిందంతా హైదరాబాద్ నగరంలోనేనని చెబుతోంది. దీంతో పాటు తన ఇష్టాలను తాజాగా ప్రేక్షకులతో పంచుకుంది. అవేంటో మీరూ తెలుసుకోండి..
జాతి రత్నాలు సినిమా తన కెరీర్‌లో గుర్తిండిపోతుందని ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) చెప్పింది. ఈ మూవీ తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది తెలిపింది. జాతిరత్నాలు సినిమా ఫస్ట్ డే ఫస్ట్‌షో చూడ్డానికి వెళ్లేటప్పుడు ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నానని తెలిపింది. ఈ మూవీలో తనకు పేరు వచ్చినా రాకున్నా తాను మాత్రం మారిపోరాదని నిర్ణయించుకున్నానంటూ తెలిపింది. ఆ వీడియో ఇప్పటికీ తన ఫోన్‌లో ఉంటుందని చెప్పింది.
తాను జీవితంలో ఏ పనీ అనుకున్న సమయానికి పూర్తి చేయలేదని ఫరియా పేర్కొంది. ఏదైనా మొదలు పెడితే మధ్యలో ఆపేస్తానంటోంది. ఓ పుస్తకం చదవడం మొదలు పెడితే మధ్యలో ఆపేసి మరో పుస్తకం అందుకుంటానంది. ఇక జాతి రత్నాలు మూవీ తర్వాత తొందరపడి సినిమాలు ఒప్పుకోలేదని, ఆ మూవీతో వచ్చిన పేరును చెడగొట్టుకోవడం ఇష్టంలేకే ముఖ్యమైన మూవీస్‌లో మాత్రమే నటించాలని నిర్ణయించుకున్నానని తెలిపింది.
రోజూ నృత్యం చేయకుండా ఉండలేనని చెప్పింది. పెయింటింగ్ కూడా ఇష్టమని చెప్పింది. ఇంకా తనకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అంటే అమితమైన ఇష్టమని పేర్కొంది. ఐశ్వర్యరాయ్ అందం, నటి టబు నటన, సుస్మితాసేన్ లుక్స్ అంటే బాగా లైక్ చేస్తానంది. తనకు కొంత మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నా వారు కేవలం ఫ్రెండ్ వరకేనంది. ఇక తనకంటే వయసులో పెద్ద వారితో ఎక్కువగా సన్నిహితంగా మెలుగుతానంది. తద్వారా మంచి విషయాలు తెలుసుకోగలుగుతానంది.
సినిమాలతో పాటు తనకు అనేక వ్యాపకాలున్నాయంటోంది ఫరియా. ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమని చెబుతోంది. తనకు పర్యటించడం అంటే ఇష్టమని, ఇతర ప్రాంతాల్లో కల్చర్, పద్ధతులు అలవాట్లను తెలుసుకోవడం అంటే ఆసక్తి అని తెలిపింది. దీనిపై త్వరలో ఓ పుస్తకం కూడా రాస్తానని వెల్లడించింది. దాంతోపాటు డ్యాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది.
Anasuya: అనసూయ జాతకంలో అలాంటి సమస్యలా?
యాంకర్ అనసూయ.. తర్వాత సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో ప్రకటనల్లోనూ నటించి పెద్ద మొత్తంలో క్యాష్ చేసుకుంది. కోట్లాది రూపాయల ఆస్తిని పోగేసుకుంది. అయితే, ప్రస్తుతం జబర్దస్త్ షోలో లేక, సినిమాల్లో అవకాశాలు తగ్గి పొజిషన్ కాస్త డౌన్ ఫాల్ అవుతోంది. అనసూయకు ఇలా ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదట.
ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అనసూయ.. ఎప్పటికప్పుడు కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటూ ఉంటుంది. విజయ్ దేవరకొండ మూవీపై ట్వీట్ చేయడంతో రౌడీ ఫ్యాన్స్ అనసూయపై రెచ్చిపోయారు. విపరీతమైన నెగిటివ్ కామెంట్లు చేస్తూ హోరెత్తించారు. ఈ క్రమంలో అనసూయ కూడా తగ్గడంలేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కౌంటర్లు వేస్తూ వస్తున్నారు.
అయితే, ఈ మధ్య కాలంలో ఇది మరీ శృతి మించింది. అనసూయను చాలా మంది ఆంటీ అంటూ కామెంట్లు చేయడంతో ఆమె ఏకంగా పోలీస్ ఫిర్యాదు కూడా చేసింది. అంకుల్, తాతా.. అంటూ అనసూయ కూడా రెచ్చిపోతోంది. ఈ నేపథ్యంలో అనసూయ గురించి మరో వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. అనసూయ జాతకంలో కొన్ని దోషాల కారణంగానే ఆమె విపరీతమైన నెగిటివిటీ, ట్రోలింగ్‌ను ఎదుర్కొంటోందట.
దోష నివారణ కోసం పరిహార పూజలు వీలైనంత తొందరగా చేయించుకుంటేనే అనసూయ కెరీర్ మళ్లీ ట్రాక్ ఎక్కుతుందంటున్నారు. లేకపోతే ఇక సినిమా కెరీర్‌తోపాటు యాంకరింగ్ కెరీర్ కూడా నాశనం అయ్యే పరిస్థితులు దగ్గర్లోనే ఉన్నాయని చెబుతున్నారు.
గతంలో తనపై ట్రోల్స్ వస్తే అనసూయ ఘాటుగా స్పందించేదని, ఇప్పుడు నోటి దూకుడు ఎక్కువగా ప్రదర్శిస్తోందంటున్నారు. మరోవైపు అనసూయను పుష్ప2 మూవీ నుంచి తొలగించారనే వార్తలు కూడా హల్ చల్ చేస్తున్నాయి. మొత్తానికి ఈ నెగిటివిటీ అంతా పోవాలంటే గట్టిగా పూజలు చేయాలని అనసూయకు ఫ్యాన్స్ సూచిస్తున్నారు.
Read Also : Nandamuri Balakrishna: ఇలాంటి మూవీస్‌ను బాలకృష్ణ వదులుకున్నాడా? ఆల్ టైమ్ హిట్లు!