Simhadri: సింహాద్రి రీరిలీజ్‌.. మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ అంటే ఏంటో చూస్తారు!

నందమూరి వారసుడిగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం అగ్రశ్రేణి హీరోగా రాణిస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి అనేక హిట్ చిత్రాలు ప్రేక్షకులకు అందించాడు. సీనియర్ ఎన్టీఆర్ మాదిరే నటనలో మంచి మార్కులు కొట్టేశాడు జూనియర్‌ ఎన్టీఆర్. గంభీరమైన ఆహార్యం, అదిరిపోయే స్టెప్పులు వేయడం జూనియర్ ఎన్టీఆర్ స్పెషాలిటీ. రాజమౌళి-ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన చిత్రాలన్నీ బంపర్‌ హిట్‌ అందుకున్నాయి. అందులో ఒకటి సింహాద్రి (Simhadri) సినిమా. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సింహాద్రి (Simhadri) మూవీ ఇంటస్ట్రీ హిట్‌ కొట్టింది.

సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో చాలా అవమానాలు, కష్టాలు ఎదుర్కొన్న తారక్‌.. తర్వాత నిలదొక్కుకున్నాడు. స్టార్టింగ్ చిత్రాలు నిన్ను చూడాలని, రాఖీ సినిమాల్లో లావుగా కనిపించిన ఎన్టీఆర్.. యమదొంగ, కంత్రీ సినిమాల టైమ్ కి సన్నబడ్డాడు. సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ పలు సినిమాలు చేసి ఇండస్ట్రీ హిట్లు కూడా కొట్టాడు. తాజాగా రిలీజైన ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సీఫీసును బద్దలు కొట్టింది. రికార్డులు తిరగరాసింది. సింహాద్రి (Simhadri) సినిమాను మళ్లీ రిలీజ్‌ చేసేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన భూమిక (BhumikaChawla) నటించింది. ఆమెతో పాటు అంకిత కూడా నటించింది. #Simhadri4K ఈ సినిమాలో పాటలు కూడా పెద్ద ప్లస్‌ పాయింట్‌.

సింహాద్రి సినిమాని మళ్లీ ఈనెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు (NTR Birthday) సందర్భంగా విడుదల చేయనున్నారు. అయితే, ఈ సినిమాను 4కే క్వాలిటీతో విడుదల చేయనుండటం విశేషం. ఇప్పటికే అభిమానులు భారీ సంఖ్యలో ఈచిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. అనేక ప్రాంతాల్లో జూనియర్‌ ఎన్టీఆర్ భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎన్టీఆర్ అభిమానులు రక్తదానం, అన్నదానం, సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక సింహాద్రి మూవీని తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా, దుబై, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లలో కూడా రిలీజ్‌ చేయనున్నారు.

#Simhadri4KOnMay20 ఇలా ప్రపంచ వ్యాప్తంగా రీ-రిలీజ్ అవటం మొదటి సారి అని చెబుతున్నారు. అదీ కాకుండా ఈ సినిమా ప్రచారానికి కూడా భారీగానే ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. సుమారు రూ.2 కోట్ల మేర ప్రచారానికి మాత్రమే ఖర్చు పెడుతున్నారంటే ఈ మూవీ బజ్‌ ఎంత క్రియేట్‌ చేస్తోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మే 7 వ తేదీ సాయంత్రం 5.31 నిముషాలకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర సుదర్శన్ 35 ఎంఎంలో ఈ సినిమాలోని “నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి” పాటను ప్రదర్శించారు. సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ ఇప్పటికే ట్రెండ్‌ సెట్‌ చేస్తున్నారు. ‘సింహాద్రి మాస్ జాతర మొదలైంది’ అని పోస్టులు భారీగా పెడుతున్నారు. ఇలా వీటన్నితోపాటు జపాన్ లో కూడా ఈ సినిమా విడుదల అవుతోంది. ఈ సినిమా సుదర్శన్ థియేటర్ లో టెస్టింగ్ కూడా చేశారు. 4కే క్వాలిటీతో విడుదలకు సర్వం సిద్ధం చేస్తున్నారు.

9 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే ఏకైక హీరో!

అగ్ర కథానాయకులకు తమ మాతృభాషతోపాటు హిందీ లేదంటే ఇంగ్లిష్ మాట్లాడగలుగుతారు. ఇక దగ్గరగా ఉన్న భాష కాస్త తెలిసి ఉండొచ్చు. అయితే, ఏకంగా 9 ప్రాంతీయ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే సత్తా ఉన్న హీరో మీకు తెలుసా? గుక్క తిప్పుకోకుండా మాట్లాడేస్తూ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు ఆ హీరో. దక్షిణాదిలో అన్ని భాషల్నీ మంచినీళ్లు తాగేసినంత ఈజీగా మాట్లాడుతాడు.

తెలుగు అతని మాతృభాష అయినప్పటికీ.. తమిళం, కన్నడ, మలయాళం ఈజీగా మాట్లాడేస్తాడు. వీటితోపాటు ఇంగ్లిష్‌, హిదీ, స్పానిష్‌, జపనీస్‌, చైనీస్‌… ఇలా సుమారు 9 భాషల్లో ప్రావీణ్యం సంపాదించాడు. ఇంతకీ ఎవరా హీరో అనుకుంటున్నారా? అతడే మన యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్. ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్లలో ఇలా అన్ని భాషలూ మాట్లాడుతూ తన ప్రావీణ్యాన్ని చూపించాడు.

Read Also : Adipurush: ఆదిపురుష్‌ ట్రైలర్‌.. ఈసారి కొడితే సోషల్‌ మీడియా షేక్‌ అవ్వాలి!

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles