బాహుబలి మూవీతో తెలుగు సినిమా (Telugu Movies) రేంజ్ ఏంటో ప్రపంచానికి తెలిసింది. దాని తర్వాత టాలీవుడ్ (Telugu Movies) హీరోలు చాలా మంది పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలను విడుదల చేసేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు. అయితే, ఇందులో కొన్ని సినిమాలు (Telugu Movies) చాలా స్పీడ్ గా డిజాస్టర్ లిస్టులో చేరిపోతున్నాయి. అగ్ర హీరోల సినిమాలు సైతం ఈ లిస్టులో ఉన్నాయి. ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ డిజాస్టర్ గా నిలిచింది.
పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాత వాసి మూవీ 70 కోట్ల బడ్జెట్ తో వచ్చింది. అయితే, మొత్తం 123 కోట్లకు అమ్మారు. కానీ 57 కోట్లే వసూలు చేసి 67 కోట్ల నష్టాలను మిగిల్చింది. పవన్ కెరీర్ లో డిజాస్టర్ గా నిలిచిపోయింది. బాలయ్య, రానా నటించిన మహానాయకుడు మూవీ 30 కోట్లతో తెరకెక్కించారు. 51 కోట్ల ప్రీ బిజినెస్ చేసింది. అయితే, కేవలం ఐదు కోట్ల రూపాయల షేర్ ను రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
రాధే శ్యామ్ మూవీ వరల్డ్ వైడ్ గా 200 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అయితే, మొత్తంగా మూవీ టార్గెట్ కు 120 కోట్ల రూపాయల దూరంలో నిలిచి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా కూడా ప్లాప్ అయ్యింది. 132 కోట్ల టార్గెట్‌తో వచ్చిన ఈ సినిమా సుమారు 80 కోట్ల నష్టాలను మిగిల్చింది.
పవన్ నటించిన మరో సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. ఈ మూవీ కూడా సుమారు 37 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. మూవీకి 32 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు 84 కోట్లు.
సినిమా షూటింగ్ అక్కడ తీస్తే.. రూ.2 కోట్ల రాయితీ..
సినిమా రంగాన్ని, పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం మొన్నామధ్య కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో కనీసం 50 శాతం షూటింగ్ జరుపుకొనే సినిమాలకు గరిష్టంగా 2 కోట్ల రూపాయల వరకు నగదు ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఇందులో భాగంగా లొకేషన్లకు చెల్లించే ఫీజులో సుమారు 75 శాతం వరకు వెనక్కి తిరిగి ఇచ్చేస్తోంది మధ్య ప్రదేశ్ ప్రభుత్వం.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏ మూలలోనైనా షూటింగ్ జరుపుకొనేలా అనుమతులు సరళతరం చేసింది. ప్రోత్సాహకాలు, అనుమతులు, షూటింగ్ లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం లాంటి చర్యలతో తమ రాష్ట్రంలో సినిమా రంగాన్ని, పర్యాటక రంగాన్ని బలోపేతం చేయనున్నామని మధ్య ప్రదేశ్ టూరిజం బోర్డు డైరెక్టర్ ఉమాకాంత్ చౌదరి వెల్లడించారు.
తమ ప్రభుత్వ నిర్ణయాలు, రాయితీ వివరాలు తెలిపేందుకు ఆయన తన స్టాఫ్ తో పాటు మొన్నామధ్య హైదరాబాద్ కు వచ్చారు. ముఖ్యంగా దళారుల ప్రమేయం అస్సలు లేకుండా, మధ్యవర్తులతో పని లేకుండా నేరుగా సినిమా రంగం వారు ప్రభుత్వంతో చర్చలు జరిపి తమ రాయితీలను అందుకోవాలని కోరారు. ప్రతి విషయంలోనూ తమ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని క్లారిటీ ఇచ్చారు.
దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మధ్య ప్రదేశ్ లో సినిమా రంగం వారికి సౌలభ్యాలు కల్పిస్తున్నామని ఉమాకాంత్ చౌదరి తెలిపారు. అద్భుతమైన సందర్శన ప్రాంతాలు ప్రపంచానికి పరిచయం చేయడానికి, ప్రోత్సాహకాలు అందించడానికి ముందుకొస్తున్నామన్నారు. ప్రత్యేకంగా దీని కోసం ఓ వెబ్ సైట్ ను ప్రారంభించామని, అన్ని విషయాలూ అందులో ఉన్నాయన్నారు. ఈ సదవకాశం దక్షిణాది భాషా చిత్రాలకు వర్తిస్తుందని వివరించారు.
Read Also : Sraddha Das: శ్రద్ధా దాస్, వరుణ్ కథ తెలుసా?