జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా (NTR 30) శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రంపై అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. టాలీవుడ్‌లో ఎందరు హీరోలున్నా… డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్ డెలివరీ.. సాంగ్స్ ఇలా అన్నింటిలోనూ తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ పేరు మార్మోగుతోంది. అదే జోష్‌తో ప్రస్తుతం ఎన్టీఆర్ 30 సినిమా (NTR 30) చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ 30 సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. మొదటి షెడ్యూల్‌ను హైదరాబాద్ నగర శివారు ప్రాంతం శంకర్‌పల్లిలో ప్రత్యేక సెట్స్ వేసి పూర్తి చేశారు. అనంతరం నగరంలోని రామోజీఫిల్మ్ సిటీలో రెండో షెడ్యూల్‌ను జరిపారు. రెండు షెడ్యూళ్లలోనూ జూనియర్ ఎన్టీఆర్‌తోపాటు ముఖ్య పాత్రలు చేస్తున్న నటుల మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అలాగే యాక్షన్ సీన్లు కూడా చిత్రీకరణ చేసినట్లు తెలుస్తోంది. లేటెస్ట్‌గా ఎన్టీఆర్ 30చిత్రంపై ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. సినిమాలో ఇతర ఇండస్ట్రీలకు చెందిన స్టార్లు కూడా నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. సైఫ్‌కు వైఫ్ పాత్రలో ప్రముఖ సీరియల్ హీరోయిన్ చైత్ర రాయ్‌ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
చైత్ర రాయ్ అష్టా చెమ్మా ఫేమ్. ఇప్పటికే ఆమె ఈ సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఓ సీరియల్ నటి పాన్ ఇండియా రేంజ్ మూవీలో నటించడం ఇప్పుడు టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ మధ్య ఇప్పటికే జనతా గ్యారేజ్ మూవీ వచ్చింది. తర్వాత నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రస్తుత సినిమా రాబోతోంది. ఈ మూవీకి అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్నారు. సినిమాను 2024 ఏప్రిల్ 5న విడుదల చేస్తామని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఎన్టీఆర్ (NTR), కొరటాల శివ (Koratala siva) కలయికలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. NTR 30 మూవీలో అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి ముద్దుల తనయ.. జాన్వీ కపూర్ కూడా నటిస్తోంది. జాన్వీ పుట్టిన రోజు సందర్బంగా మార్చి 6న చిత్ర బృందం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఎన్టీఆర్ చిత్రంలో తనకు నటించాలని ఉందని అనేక ఇంటర్వ్యూల్లో జాన్వీ కపూర్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రంలో జాన్వీ కపూర్‌కు అవకాశం దక్కడంతో అభిమానులు ఖుషీఖుషీగా ఉన్నారు.
ఈ మూవీతో జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో అడుగు పెడుతుండడం విశేషం. ఆమె ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం మొన్నామధ్యనే పోస్టర్ రూపంలో విడుదల చేసింది. జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ అభిమానులను అలరించింది. ఆ పోస్టర్‌లో చీరతో అభిమానుల మనుసు దోచుకుంటోంది జాన్వీ. నందమూరి కుటుంబంలో తారకరత్న మరణంతో షూటింగ్ ఈ చిత్రం వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆస్కార్ కోసం అమెరికా వెళ్లిన తారక్.. షూటింగ్‌లో పాల్గొనేందుకు కాస్త ఆలస్యమైంది. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎన్టీఆర్ కూడా జోక్యం చేసుకుంటున్నట్లు సమాచారం. పాన్ ఇండియా కాదు పాన్ ఇంటర్నేషనల్ లెవెల్ సినిమాతో ఎన్టీఆర్ ని చూపించబోతున్నామని కొరటాల శివ చెబుతుండడం విశేషం.
ఓ పల్లెటూరి యువకుడు దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎలా ఎదుగుతాడనే కోణంలో కథ సాగుతుందని తెలుస్తోంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా.. సినీ ఇండస్ట్రీలో కొత్త రికార్డులు సృష్టిస్తుందని భావిస్తున్నారు.
Read Also : Guru Rahu Yuti 2023: ప్రారంభమైన గురు చండాల యోగం.. ఏయే రాశుల వారికి ఎఫెక్ట్ అంటే..