Astrology : గురువు ఈనెల 28వ తేదీన రాశి చక్రం (Guru Rahu Yuti 2023) మారాడు. గ్రహాలకు గురువైన బృహస్పతి.. మేషరాశిలో (Guru Rahu Yuti 2023) ప్రవేశించాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మేష రాశిలో రాహువు సంచారం జరుగుతోంది. రాహు, గురువు ఒకేసారి ఈ రాశిలో సంచారం చేయడం వల్ల గురు చండాల యోగం ఏర్పడుతోందని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఏయే రాశుల వారికి ప్రభావం చూపుతుందో పండితులు వివరించారు. ద్వాదశ రాశుల్లో కొన్ని రాశులపై గురు చండాల యోగం ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఆయా రాశులు ఏవో, తీసుకోవాల్సిన జాగ్రత్తలేవో ఓ లుక్కేయండి..
గురుచండాల యోగం ప్రభావంతో కొన్ని రాశులపై దుష్ప్రభావం పడినప్పటికీ మరికొన్ని రాశులకు శుభ ఫలితాలను కలిగిస్తుందని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. గురుచండాల యోగం ప్రభావితం చూపే రాశులను పరిశీలిస్తే..
సింహరాశి:
మొదటి రాశి అయిన మేష రాశిలో దేవ గురువైన బృహస్పత్రి సంచారం చేస్తున్నాడు. దీని వల్ల సింహ రాశి వారికి సమస్యలు అధికమవుతాయని పండితులు చెబుతున్నారు. అది ఏరూపంలోనో కూడా చెబుతున్నారు. వృత్తి రీత్యా సవాళ్లు ఎదురవుతాయంటున్నారు. కుటుంబ జీవితంలోనూ ఆర్థికంగా చితికిపోవడం, మత సంబంధిత ఆందోళనలు పెరగడం, బిజినెస్‌లో కూడా నష్టాలు చవిచూడటం లాంటివి కలుగతాయట. ఈ నేపథ్యంలో సింహ రాశి వారు జాగ్రత్తలు పాటించాలని జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు. గురుగ్రహం మేష రాశి నుంచి నిష్క్రమించేదాకా అప్రమత్తంగా మసలుకోవాలంటున్నారు.
కన్యారాశి:
కన్యారాశి వారికి గురు చండాల యోగం కారణంగా ప్రభావం చూపుతుంది. మేష రాశిలో బృహస్పతి సంచారంతో కన్యా రాశి వారికి ఆదాయం గణనీయంగా తగ్గిపోతుంది. అదే సమయంలో ఖర్చులు కూడా విపరీతం అవుతాయి. దాంతోపాటు రోజులు చాలా వరకు బిజీగా గడిపినా కూడా ఆశించిన ప్రయోజనం దక్కదు. కుటుంబంలో కొందరికి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. జాబ్ చేసే వారికి ప్రమోషన్లు రావడంలో అవరోధాలు ఎదురవుతాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి నిత్యం ఒడిదొడుకులు తప్పవు. ఈ నేపథ్యంలో కన్యారాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
తులారాశి:
మేష రాశిలో గురు సంచారం వల్ల తులా రాశి వారికి అశుభ ఫలితాలు కలుగుతాయి. ఏ పని తలపెట్టినా ఆటంకం ఏర్పడుతుంది. చేసిన పనికి తగిన గుర్తింపు లభించక ఇబ్బంది పడుతారు. పని చేస్తున్న కార్యాలయంలో తీవ్ర ఒత్తిడి ఉంటుంది. హెల్త్ సమస్యలు చుట్టుముడతాయి. బిజినెస్‌లో ఆర్థికంగా దెబ్బతినడం జరుగుతుంది. కుటుంబ బంధాలు బలహీనపడటం లాంటివి కూడా సంభవిస్తాయి. గ్రహ సంచారం మారేంత వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.
వృశ్చికరాశి:
ఈనెల 28వ తేదీ అంటే ఏప్రిల్ 28న మేష రాశిలో గురు గ్రహం ప్రవేశించింది. ఈ కారణంగా రాహు, గురు సంచారం మేష రాశిలో జరుగుతోంది. గురు చండాల యోగం సమయం కావడంతో వృశ్చిక రాశి వారికి అనుకోని ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సమస్యలు అధికమవుతాయి. మానసిక ఒత్తిడి వీటికి అధికం అవుతుంది. ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చి చేరుతాయి. వీలైనంత వరకు అవసరమైతేనే డబ్బు ఖర్చు చేసేలా ప్లాన్ చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
గురు చండాల యోగం కారణంగా సింహ రాశి, కన్యారాశి, తులా రాశి, వృశ్చిక రాశులకు చెందిన వ్యక్తులు ప్రభావానికి గురవుతారని, రాశి చక్రం మారేదాకా తగిన జాగ్రత్తలు పాటించాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. దైవారాధన చేసుకోవడం క్రమం తప్పకూడదని, పరిహారాల కోసం పండితులను సంప్రదించాలంటున్నారు. వ్యక్తిగత జాతకంలో దోషాలు ఉంటే గురు చండాల యోగం ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని, పరిహారాలు పాటించాలని సూచించారు.
Read Also: BRS Party : మహారాష్ట్రలో సై.. కర్ణాటకలో నై.. బీఆర్ఎస్ విస్తరణలో కేసీఆర్ ప్లాన్ ఏంటి?