Vishal: విశాల్ ప్రేమాయణంపై రూమర్లు.. నిజం కాదన్న నటి!

తెలుగు కుర్రాడు, తమిళంలో రాణిస్తున్న నటుడు విశాల్.. (Vishal) టాలీవుడ్‌ ప్రేక్షకులకూ బాగా దగ్గరయ్యాడు. ఆయన (Vishal) నటించిన చిత్రాలు దాదాపు అన్నీ తెలుగులో డబ్ అవుతుంటాయి. హీరో తర్వాత నిర్మాతగానూ మారాడు విశాల్ (Vishal). తన పేరుతో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ కూడా స్థాపించాడు. కొన్నాళ్ల కిందట ఓ నటితో విశాల్ నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే, తదుపరి పరిణామాలతో వివాహం రద్దు చేసుకున్నారు.

రీసెంట్ గా విశాల్ గురించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. విశాల్ ఓ నటితో ప్రేమాయణంలో ఉన్నాడట. దీనిపై సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం అవుతోంది. అయితే, ఇలాంటివి విశాల్ కు కొత్తేమీ కాదని చెప్పాలి. వరలక్ష్మీ శరత్ కుమార్ తో ప్రేమలో ఉన్నాడనే ప్రచారం కూడాజరిగింది. అయితే, అవన్నీ వదంతులేనని కొట్టి పారేశారు.

ప్రస్తుతం దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విశాల్.. ఇప్పటికీ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్నాడు. అయితే, నటి అభినయ తో తాజాగా ప్రేమలో ఉన్నాడనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారని ఆ గాసిప్స్ సారాంశం.

సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్న ఈ ప్రచారంపై నటుడు విశాల్ అయితే ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ నటి అభినయ మాత్రం వీటిపై ఫైర్ అయ్యింది. ప్రస్తుతం విశాల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం మార్క్ ఆంటోనీ. ఈ సినిమాలో విశాల్ భార్యగా అభినయ నటిస్తోంది. తమిళనాట నాడోడిగల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె.. పుట్టుకతోనే చెవిటి, మూగ. ఈ లోపాలను జయించి సినిమాల్లో రాణిస్తోంది. విశాల్ తో ప్రేమాయణం వార్తలు పూర్తిగా అసత్యమని అభినయ ఖండించింది. రీల్ లైఫ్ లో మాత్రమే భార్యగా నటిస్తున్నానని, రియల్ లైఫ్ లో భార్య కాగలమా? అని ప్రశ్నించింది.

అల్లు శిరీష్ పెళ్లి గురించి ఏమన్నాడు?

అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ నటించిన ఊర్వశివో, రాక్షసివో సినిమా ఓ మోస్తరు హిట్‌ టాకు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అప్పట్లో హైదరాబాద్ లో నిర్వహించారు. ఆ కార్యక్రమానికి నందమూరి బాలయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు శిరీష్ పెళ్లి గురించి హాట్ డిస్కషన్ జరిగింది ఇద్దరి మధ్య. స్టేజ్ పైకి వెళ్లే ముందు బాలయ్య కాసేపు శిరీష్ ను టీజ్ చేశాడు.

సినిమాలోని కొన్ని అంశాలను ప్రస్తావించిన బాలయ్య.. ఆ పోస్టర్లేంటి.. సినిమాల్లోనేనా, బయటకూడా అలాంటి వేషాలే వేస్తావా? అని ప్రశ్నించారు. తన తండ్రి అల్లు అరవింద్ ఎదుటే ఇలా బాలయ్య ఆట పట్టించడంతో అల్లు శిరీష్ కాస్త ఇబ్బంది పడ్డాడు. దీనికి బదులిచ్చిన శిరీష్.. సినిమాల్లో మాత్రమే ఇలా అని బయట చాలా బుద్ధి మంతుడినని చెప్పాడు.

బాలయ్య ప్రశ్నల వర్షం కురిపిస్తుండడంతో అల్లు శిరీష్ స్పందిస్తూ.. సార్.. ఇలా అందరి ముందు టీజ్‌ చేస్తే ఇక నాకు పెళ్లి ఎలా అవుతుంది అని ప్రశ్నించాడు. పిల్లని ఎవరూ ఇవ్వరంటూ ఆవేదన వ్యక్తం చేశాడు శిరీష్‌. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని బాలయ్య అడగ్గా.. చాలా ప్రయత్నాలు చేస్తున్నాను సర్‌ అని తెలిపాడు. ప్రేమ గీమా అంటూ ట్రై చేస్తున్నానని, ఏదీ వర్కౌట్‌ కావట్లేదన్నాడు శిరీష్. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని, మిమ్మల్ని కూడా పిలుస్తానన్నాడు. అయినప్పటికీ పెళ్లి ఎందుకు సార్‌, ఇలా సింగిల్‌గా ఎంజాయ్‌ చేసేయొచ్చు కదా అని వ్యాఖ్యానించాడు.

ఊర్వశివో రాక్షసివో సినిమాతో యువతీ యువకుల్ని చెడగొడుతున్నావా? అని బాలయ్య అడుగుతాడు. దీనికి శిరీష్ బదులిస్తూ, చెడగొట్టాలని కాదు, బయట యువత ఎలా ఉందో చెబుతాదామని తీశాము అని చెబుతాడు. వాళ్లెలా ఉంటే నీకెందుకోయ్.. అంటూ బాలయ్య చురకలంటిస్తాడు. యువతకు నచ్చుతుందని ట్రయల్‌ వేశానని శిరీష్‌ చెబుతాడు. బాగుంది.. నేను నీ కంటే ఏజ్‌ కొంచెం తక్కువేనంటూ బాలయ్య అందరిలో హుషారు నింపుతారు.

Read Also : Prabhas: మీకు తెలుసా..? ప్రభాస్‌ను ఓ హీరోయిన్‌ అన్నా అని పిలిచింది..!

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles