Sharwanand: టాలీవుడ్‌లో యువ కథానాయకుడిగా గుర్తింపు పొందిన శర్వానంద్ (Sharwanand) ఓ ఇంటి వాడయ్యాడు. శనివారం రాత్రి రక్షితారెడ్డి మెడలో మూడు ముళ్లు వేశాడు శర్వానంద్. రెండు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని లీలా ప్యాలెస్ వీరి వివాహానికి వేదిక అయ్యింది. రెండు రోజులపాటు వీరి వివాహ వేడుక అత్యంత వైభవంగా సాగింది. నూతన దంపతులను పలువురు సినీ ప్రముఖులు కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు. శర్వానంద్, రక్షితారెడ్డి వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
శర్వానంద్ (Sharwanand Marriage) వివాహానికి అతడి క్లోజ్ ఫ్రెండ్, స్టార్ హీరో రామ్ చరణ్‌తో (Ram Charan) పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సీనియర్ హీరో సిద్ధార్థ్, అతిది రావు హైదరీ (Siddharth Aditi Rao Hydari) కూడా పెళ్లికి వెళ్లారు. శర్వానంద్ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో క్రమంగా బయటికు వస్తున్నాయి. శర్వాకు నెటిజన్లు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు. కొత్త దంపతులకు శుభాకాంక్షలంటూ కామెంట్లు చేస్తున్నారు. శుక్రవారం సంగీత్, హల్దీ వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం రాత్రి పెళ్లి కార్యక్రమం పూర్తయ్యింది. శర్వానంద్ పెళ్లి గురించి చాలా రోజులుగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే.
నటుడు శర్వానంద్ (Sharwanand) వివాహం నేపథ్యంలో వధువు రక్షితా రెడ్డి గురించి, ఆమె బ్యాగ్రౌండ్ ఏంటనే అంశంపై నెట్టింట జోరుగా సెర్చ్ చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 26న ఎలాంటి ప్రకటన లేకుండా సడన్‌గా నిశ్చితార్ధం చేసుకున్నాడు శర్వానంద్. మాజీ మంత్రి, టీడీపీ దివంగత నేత బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి మనవరాలు, హైకోర్టు లాయర్ మధుసూధనారెడ్డి కుమార్తే ఈ రక్షితారెడ్డి. ఆమెనే శర్వానంద్ మనువాడాడు. జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో వీరి పెళ్లికి ఇరు కుటుంబాల వారు, బంధువులు, సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు.
శర్వానంద్ భార్య రక్షిత సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అని తెలుస్తోంది. రక్షితారెడ్డి తండ్రి తెలంగాణ హైకోర్ట్ న్యాయవాదిగా పని చేస్తున్న మధుసూదన్‌రెడ్డి. తల్లి సుధారెడ్డి. శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ఇటీవలే ‘ఒకే ఒక జీవితం’ అనే మూవీతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత శర్వానంద్, దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యతో ఓ క్రేజీ సినిమా చేస్తున్నట్లు ప్రకటన కూడా చేశారు. ఈ ఏడాది జనవరిలో శర్వానంద్ నిశ్చితార్ధం జరగ్గా.. ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయ్యిందనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. దీంతో గందరగోళానికి తెర దించుతూ శర్వానంద్ తన వివాహ తేదీని కూడా ప్రకటించాడు.
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ 2003లో సినిమా పరిశ్రమలో అడుగు పెట్టాడు. ‘ఐదో తారీఖు’ శర్వా ఫస్ట్ మూవీ. అలా వెండితెరకు పరిచయమయ్యాడు. అనంతరం పలు సినిమాల్లో సైడ్ ఆర్టిస్ట్ గా కూడా నటించాడు. చిరంజీవితో థమ్స్ అప్ యాడ్‌లో నటించడంతో శర్వానంద్‌కు మంచి పేరు వచ్చింది. అప్పటి నుంచి గుర్తింపు పొందాడు. అదే సమయంలో ‘శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిన్న పాత్రలో నటించే చాన్స్ లభించింది.
అటు తర్వాత హీరో విక్టరీ వెంకటేష్‌తో ‘సంక్రాంతి’, ‘లక్ష్మి’ చిత్రాల్లో కథానాయకుడి తమ్ముడి పాత్రలో శర్వానంద్ నటించాడు. గమ్యం సినిమాతో తెలుగు, తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న శర్వా.. అలా వరుస సినిమాల్లో నటించి హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్ని సినిమాలు డిజాస్టర్లుగా కూడా నిలిచాయి. అయితే, శర్వానంద్ నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘గమ్యం’, ప్రస్థానం, శతమానం భవతి లాంటి చిత్రాలు శర్వానంద్ కెరీర్‌ను గాడిలో పెట్టాయి.
Read Also : AP Fiber: విడుదలైన రోజే ఇంట్లో కొత్త సినిమా చూసేయండిలా..!