మంగళవారం, 15 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Cinema

Pawan Kalyan Movies: రీమేక్‌లతో పవన్‌ దారి తప్పుతున్నారా? వేగంగా పూర్తయ్య వాటికే ప్రయారిటీ.. అందుకే తప్పట్లేదా?

Keerthanaa News Deskప్రచురణ తేదీ: శనివారం, 8 జూలై 2023

Pawan Kalyan Movies: ఒకవైపు పొలిటికల్‌గా యాక్టివ్‌గా ఉన్న పవన్‌ కల్యాణ్‌.. మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఏపీలో కొంత కాలంగా జోరు పెంచిన పవన్‌.. ఇటీవలే ఎన్నికలకు సిద్ధం అంటూ వారాహి వాహనం కూడా ఎక్కారు. ఇది జనసేనాని అభిమానుల్లో జోష్‌ పెంచేలా చేసింది. అయితే, దీనిపై అటు వైసీపీ నేతలు మాటల యుద్ధం, విమర్శల తాకిడి పెంచారు. మొదట్లో మిలటరీ ఉపయోగించే రంగును పవన్‌ వాహనానికి వేశారని, ఇది నిషిద్ధ కలర్‌ అని కామెంట్లు వెల్లువెత్తాయి. దీనిపై జనసైనికులు, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. (Pawan Kalyan Movies)

ఇక ఎన్నికలు తొమ్మిది నెలల్లో రానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పొలిటికల్‌గా కాస్త ఎక్కువ సమయం పవన్‌ ఏపీలో గడపాల్సి ఉంటుందనేది వాస్తవం. ఈ తరుణంలో ఎన్నికల ఖర్చు కోసమైనా సినిమాలు చేయక తప్పని పరిస్థితి నెలకొందనే విశ్లేషణలు వస్తున్నాయి. అయితే కొత్త కథలపై వెళ్లకుండా పవన్‌ ప్రస్తుతానికి సేఫ్‌ జోన్‌ చూసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగమే తేరీ రీమేక్‌ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవలి కాలంలో పవన్‌ ఎక్కువగా రీమేక్‌ మూవీలకే ప్రాధాన్యత ఇస్తున్నారనేది కాదనలేని వాస్తవం.

భవగీయుడు భగత్‌సింగ్‌ చిత్రం ద్వారా మంచి విజువల్‌ ఎఫెక్ట్‌ ఉన్న మూవీని ప్రేక్షకులకు అందించాలని పవన్‌ కల్యాణ్‌ భావిస్తున్నారట. ఆ మూవీ కోసం కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నారని తెలుస్తోంది. అయితే, ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలోపు రీమేక్‌లు ఓ రెండు మూడు త్వరగా కంప్లీట్‌ చేస్తే బెటర్‌ అనే అభిప్రాయంలో పవన్‌ ఉన్నారట. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రయోగాలు చేయాల్సిన అవసరం కూడా ఉండదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్‌ వర్క్‌లో కాస్త మార్పులు చేసుకుంటే సరిపోతుందంటున్నారు. అంటే నేటివిటీకి తగ్గట్లు మార్చుకుంటే కథ సెట్‌ అయినట్లేనని, మిగతాదంతా సేఫ్‌ జోన్‌లో ఉన్నట్లుగా చిత్రీకరణ చేసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. అందుకే రీమేక్‌లకు పవన్‌ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఇలా గ్యారెంటీ సినిమాలు చేయడం వల్ల బడ్జెట్‌తోపాటు హిట్‌ కూడా గ్యారెంటీగా వస్తుందని పవన్‌ భావిస్తున్నారట. కాబట్టి ప్రేక్షకులు ఎలాగూ ఆదరిస్తారని అంచనా వేస్తున్నారట. ఈ క్రమంలో వకీల్‌ సాబ్‌ అయితేనేమి, భీమ్లా నాయక్‌ అయితేనేమి.. హిట్‌ కొట్టి రుజువయ్యాయని అభిమానులు ఉదహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్‌ కల్యాణ్‌ తీసుకొనే నిర్ణయాలు పూర్తిగా తప్పనిసరి పరిస్థితుల్లోనే అనే విశ్లేషణ అటు పవన్‌ అభిమానులు, ఇటు జనసేన పార్టీ నేతలు చెబుతున్నారు. ఏ కథ చేసినా కనీసం వంద కోట్లకుపైగా మార్కెట్‌ లభిస్తుందన్న నమ్మకం కలగడం కొత్త జోష్‌ను ఇస్తోందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వేగంగా పూర్తయ్యే సినిమా ప్రాజెక్టులకే మొదటి ప్రయారిటీ ఇస్తున్నారని పవన్‌ అభిమానులు చెబుతున్నారు.

కలెక్షన్లపై ఆ రకమైన ప్రభావం తప్పడం లేదు..

తాజాగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ టార్గెట్‌గా ఆయన ప్రసంగాలు సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని, అందుకోసం అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి జగన్‌ ఓటమికి పాటుపడతామని చెబుతున్నారు పవన్‌. ఈ నేపథ్యంలో పవన్‌కు ఏపీలో సినిమా కలెక్షన్ల పరంగా కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. సినిమా టికెట్ల రేట్ల పెంపుదల కోసం ప్రత్యేకంగా ఏ ప్రభుత్వానికైనా అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఏపీ ప్రభుత్వంతో పవన్‌ కయ్యం పెట్టుకోవడంతో ఆ పరిస్థితి లేకుండా పోతోంది. ఫలితంగా కొన్ని చిత్రాలకు కలెక్షన్లలో పవన్‌ను నమ్ముకున్న వారు నష్టాలపాలు కాక తప్పడం లేదు.

Read Also : Pawan Kalyan: పార్టీని నడపడం చాలా కష్టసాధ్యమైన పని.. జవాబుదారీతనంతో రాజకీయాలు చేస్తున్నా: పవన్‌ కల్యాణ్‌

ట్యాగ్స్: , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading