జూనియర్ ఎన్టీఆర్ (NTR) నటిస్తున్న 30వ చిత్రానికి (NTR 30) ”దేవర”గా (Devara) నామకరణం చేశారు. ఈ విషయాన్ని ఇవాళ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌ను (NTR First Look) విడుదల చేశారు. ఆర్ఆర్ఆర్ (RRR) మూవీతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన జూనియర్ ఎన్టీఆర్.. తర్వాతి చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో దేవర మూవీ రాబోతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అన్ని భాషల్లోనూ దేవర (Devara) టైటిల్‌తోనే రిలీజ్ చేయనున్నారట. 2024 ఏప్రిల్ 5వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
నందమూరి వారసుడిగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి అనేక హిట్ చిత్రాలు ప్రేక్షకులకు అందించాడు. సీనియర్ ఎన్టీఆర్ మాదిరే నటనలో మంచి మార్కులు కొట్టేశాడు జూనియర్ ఎన్టీఆర్. గంభీరమైన ఆహార్యం, అదిరిపోయే స్టెప్పులు వేయడం జూనియర్ ఎన్టీఆర్ స్పెషాలిటీ. సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో చాలా అవమానాలు, కష్టాలు ఎదుర్కొన్న తారక్.. తర్వాత నిలదొక్కుకున్నాడు.
స్టార్టింగ్ చిత్రాలు నిన్ను చూడాలని, రాఖీ సినిమాల్లో లావుగా కనిపించిన ఎన్టీఆర్.. యమదొంగ, కంత్రీ సినిమాల టైమ్ కి సన్నబడ్డాడు. సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ పలు సినిమాలు చేసి ఇండస్ట్రీ హిట్లు కూడా కొట్టాడు. తాజాగా రిలీజైన ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సీఫీసును బద్దలు కొట్టింది. రికార్డులు తిరగరాసింది.
ఇక దేవర (Devara) విషయానికి వస్తే.. టైటిల్‌తో పాటు సినిమా ఫస్ట్‌లుక్‌ను కూడా అధికారికంగా నేడు విడుదల చేశారు. చేతిలో కత్తి, ఒంటి నిండా రక్తంతో జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ కంటే కాస్త పొడవైన జుట్టుతో జూనియర్ ఎన్టీఆర్ కనిపించారు. వెనుక పడవలో శవాల గుట్ట కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే మాంచి యాక్షన్ సినిమాగా ‘దేవర’ తెరకెక్కనుందని క్లారిటీ వస్తోంది. ఈ మాస్ ఫస్ట్‌లుక్‌తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
#Devara pic.twitter.com/bUrmfh46sR
— Jr NTR (@tarak9999) May 19, 2023
దేవర మూవీలీఓ జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో జాన్వీ కపూర్‌కు ఇదే తొలి మూవీ. మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) ఇందులో విలన్ రోల్ చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్‌కు కూడా నేరుగా మొదటి తెలుగు మూవీ ఇదే కావడం విశేషం. ఇందులో సైఫ్ అలీ ఖాన్‌కు జోడిగా ప్రముఖ టీవీ నటి చైత్ర రాయ్ (Chaitra Roy) నటిస్తున్నట్లు ఇటీవలే చిత్ర యూనిట్ నుంచి హిట్ వచ్చింది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) కూడా మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడట.
#Devara 🔥🔥🔥
Happy Birthday my dear @tarak9999 ❤️❤️❤️#KoratalaSiva directorial 🥳🥳🥳@NANDAMURIKALYAN @sabucyril @sreekar_prasad @NTRArtsOfficial @YuvasudhaArts #NTR30 pic.twitter.com/HNRd9ZDt5k
— Anirudh Ravichander (@anirudhofficial) May 19, 2023
ఈ సినిమా టెక్నీషియన్ల విషయంలో కూడా నిర్మాతలు ఎక్కడా రాజీ పడటం లేదని తెలుస్తోంది. మ్యూజికల్ సెన్సేషన్ అనిరుథ్ రవిచందర్ ‘దేవర’కు స్వరాలు సమకూరుస్తున్నారు. జాతీయ అవార్డు అందుకున్న ఎ. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్‌లకు పని చేసిన సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా ఉండటం విశేషం. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్, ఆక్వామ్యాన్ వంటి సినిమాలకు పని చేసిన బ్రాడ్ మినిచ్ వీఎఫ్ఎక్స్ ఎడిటర్‌గా ఉన్నారు.
Read Also : Faria Abdullah: నాకంటే పెద్ద వారితోనే సన్నిహితంగా ఉంటా.. ఫరియా అబ్దుల్లా