Heroines: మొన్నా మధ్య హీరోయిన్ సమంత తనకు అరుదైన వ్యాధి ఉందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, సినిమా కోసమే ఆమె ఇలాంటి ప్రకటనలు చేశారంటూ ఇటీవల విజయ్ దేవరకొండతో సినిమా రిలీజ్ అయిన తర్వాత నెటిజన్లు తెగ విమర్శలు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆరోగ్యం విషయంలో ఎవరూ ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వరనే అభిప్రాయాన్ని సమంత అభిమానులు చెబుతున్నారు. ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. తనకు అరుదైన వ్యాధి ఉందని ప్రకటించగానే సినీ ప్రముఖులు, అభిమానులు సమంతకు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుతూ ట్వీట్లు, కామెంట్లు చేశారు. అయితే, సమంత మాదిరే ఇంకా చాలా మంది హీరోయిన్లు వింత జబ్బులతో బాధపడుతున్నారట. (Heroines)
పైకి అందంగా కనిపించే వీరి జీవితాల్లో ఎవరికీ చెప్పుకోలేని విషాద గాధలున్నాయట. కోట్లాది రూపాయల సంపాదన, లగ్జరీ లైఫ్ లో ఉంటున్నా కొన్ని సమస్యలు మాత్రం తీర్చలేనివిగా వారి జీవితంలో మిగిలిపోతున్నాయి. కోట్లు సంపాదిస్తున్నా ఓ టైమింగ్ లేని జీవితాలు గడుపుతుంటారు. ఈ క్రమంలో సరైన సమయానికి తినడం కూడా వీలు లేకుండా ఉంటుంది. ఇలా దీర్ఘకాలిక జబ్బుల బారిన పడుతుంటారు.
లేడీ సూపర్ స్టార్ గా పేరు గాంచిన నయనతార కూడా ఓ దశలో తీవ్ర చర్మసమస్యతో బాధపడ్డారట. మేకప్ వేసుకోవడం వల్ల ఈ వ్యాధి సోకిందట. తర్వాత చికిత్స తీసుకొని ఆమె కోలుకున్నారు. బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనే సైతం ఈ కోవలోకి వస్తారు. ప్రస్తుతం దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ అమ్మడు.. ఒకప్పుడు తీవ్రమైన డిప్రెషన్ తో బాధపడింది. రణ్ బీర్ కపూర్ తో బ్రేకప్ తర్వాత మానసిక సమస్య వేధించింది. తర్వాత చికిత్స తీసుకుంది.
అనుష్క శర్మకు ఆ జబ్బు..
మరో స్టార్ హీరోయిన్, క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా గతంలో యాంగ్జైటీ జబ్బు బారిన పడ్డారు. ఈ రకమైన జబ్బు సోకితే చిన్న చిన్న వాటికి కూడా భయపడిపోతుంటారు. ఆందోళన చెందుతూ ఉంటారు. తర్వాత ఆమె చికిత్స తీసుకున్నారు. మరో హీరోయిన్ స్నేహ ఉల్లాల్ ఇమ్యూన్ డిజాస్టర్ సమస్యతో బాధపడ్డారు. కొన్నాళ్లపాటు ఆస్పత్రికే పరిమితైన ఈ అమ్మడు.. చికిత్స తీసుకొని కోలుకుంది. ఈ జాబితాలో ఇంకా పరిణీతి చోప్రా, ఇలియానా కూడా ఉన్నారు. అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ సైతం చిన్న వయసులోనే డయాబెటిస్ వచ్చింది. ఆమె చికిత్స తీసుకుంటోంది.
ఇదీ చదవండి: Ariyana Glory: అరియానా సంపాదన అన్ని లక్షలా? ఎలా సాధ్యమైందంటే..