Ariyana Glory: బుల్లితెర నటి అరియానా గ్లోరీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. గతంలో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత బుల్లితెరపై స్టార్ డమ్ సంపాదించుకుంది. సంచలన డైరెక్టర్ ఆర్జీవీతో మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూ చేసిన ఈ చిన్నది.. అప్పటి నుంచి కెరీర్ లో దూసుకెళ్తోంది. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. బిగ్ బాస్ తర్వాత బాగా బిజీ అయ్యింది. చేతినిండా డబ్బు సంపాదిస్తోందని టాక్. (Ariyana Glory)
తన లేటెస్ట్ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. ఫ్యాన్స్ కు హాట్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది. ఈ పాపులారిటీతో ఆమె సంపాదన కూడా భారీగానే పెరిగిందని టాక్. ఒకప్పుడు సాధారణ జీవితం గడిపిన అరియానా.. ఫేమ్ అయ్యాక కాస్త కాస్ట్ లీ జీవితాన్ని మొదలు పెట్టిందట. దీంతో ఆమె లైఫ్ స్టైల్ ను గమనించిన అభిమానులు.. ఇంతకీ సంపాదన ఎంత అని ఆరా తీస్తున్నారు.
తొలుత యాంకర్ గా పెద్దగా రాణించలేకపోయిన అరియానా.. బిగ్ బాస్ లోకి వెళ్లాక గుర్తింపు పొందింది. అప్పటి నుంచే ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగింది. సోషల్ మీడియాలో తన క్రేజ్ ను క్రమంగా పెంచుకుంటోంది. దాంతో పాటు డ్రెస్ సెన్స్ విషయంలోనూ కాస్త పొదుపు పాటిస్తున్న ఈ సుందరి.. మోడ్రన్ డ్రెస్ లతో కుర్రకారును పిచ్చెక్కిస్తోంది.
సంపాదన తెలిస్తే షాక్
అరియానా పలు షోలతో పాటు ఈవెంట్లకు కూడా వెళ్తోంది. వెబ్ సిరీస్ లలోనూ నటిస్తోంది. ఇందుకోసం భారీ పారితోషకాన్ని తీసుకుంటోందని తెలుస్తోంది. బిగ్ బాస్ ప్రోగ్రామ్స్ తో పాటుగా అనేక ప్రకటనల్లో నటిస్తోంది. దాంతో పాటు ఇన్ స్టా గ్రామ్ ఇన్ కమ్ కూడా తోడైంది. ఇవన్నీ కలిపి నెలకు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల దాకా ఆర్జిస్తోందని తెలుస్తోంది.
ఇదీ చదవండి: Mahesh Babu: రెమ్యునరేషన్ విషయంలో మహేష్ బాబు సంచలన నిర్ణయం.. వచ్చే సినిమా నుంచే!