Bandla Ganesh: ఆ వెబ్‌సైట్‌పై బండ్ల గణేష్‌ ఆగ్రహం.. ట్విట్టర్‌లో ఫైర్‌.. ఏం జరుగుతోంది?

Bandla Ganesh: టాలీవుడ్‌లో ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌. (Bandla Ganesh) పవన్‌ కల్యాణ్‌ అంటే విపరీతమైన అభిమానం, భక్తి భావం చూపిస్తుంటారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌పై ఇటీవల ఆయన చేస్తున్న వ్యాఖ్యలను కోట్‌ చేస్తూ వెబ్‌సైట్‌ రాసిన వార్తపై భగ్గుమన్నారు బండ్ల గణేష్‌. ఇంతకీ ఆ వెబ్‌సైట్‌ ఏం రాసింది? బండ్ల గణేష్‌ ఏమన్నారు? అసలేం జరుగుతోందనే వివరాల్లోకి వెళ్తే..

ఆ వెబ్‌సైట్‌ ఏం రాసింది?

బండ్ల గణేష్‌ (Bandla Ganesh) రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారంటూ వెబ్‌సైట్‌ రాసుకొచ్చింది. ”తెరవెనుక అంతా ఓకేనా బండ్ల గణేశా?” అనే టైటిల్‌ పెట్టి ఓ ఓ వార్తను రాశారు. అందులో వివాదాల్ని రేపడం, వాటిని వదిలేయడం బండ్ల గణేష్‌కు బటర్‌తో పెట్టిన విద్య అని రాశారు. ఇలా వివాదాలు రేపిన సందర్భాల్లో పైకి చెప్పకపోయినా ఆయనకు ఏదో న్యాయం జరుగుతోందంటూ నర్మగర్భ వ్యాఖ్యలతో రాశారు. గురూజీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ట్విట్టర్‌ వేదికగా బండ్ల గణేష్‌ చేస్తున్న ట్వీట్లను ప్రస్తావించిందా వెబ్‌సైట్‌. వివాదం మొదలు పెట్టిన రెండు రోజులకే ఏమీ ఎరగనట్టు సైలెంట్‌ అయిపోతాడని, దీంతో అతడిపై సోషల్‌ మీడియాలో పలు రకాల కామెంట్లు వినిపిస్తున్నాయని రాశారు.

తెర వెనుక వివాదం సెటిల్‌ అయ్యి ఉండొచ్చని కొందరు పోస్టులు పెడుతున్నారని, ఈ వివాదాన్ని పవన్‌ కల్యాణ్‌ చల్లార్చారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారని రాశారు. ఇంకా.. రాజకీయాల్లోకి దూరమని ప్రకటించి మళ్లీ రాజకీయాల్లోకి వస్తానంటున్నారని, డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌, వైఎస్సార్‌సీపీ నేత విజయసాయిరెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, దేవర టైటిల్‌ తనదేనంటూ ప్రకటించి తర్వాత సైలెంట్‌ అయ్యారని, ఇలా ఎప్పటికప్పుడు మాట మారుస్తున్నారంటూ రాశారు సదరు వెబ్‌సైట్‌లో.

బండ్ల రియాక్షన్ ఏంటంటే..

ఈ కథనంపై బండ్ల గణేష్‌ తీవ్రంగా స్పందించారు. అరే వెంకట్‌ రెడ్డి.. నువ్వు పెద్ద బ్రోకర్‌ అంటూ సదరు వెబ్‌సైట్‌ ఓనర్‌ను ఉద్దేశించి ఘాటుగా పోస్టు పెట్టారు బండ్ల గణేష్‌. ”ఇక్కడ మీ మూర్తిగాడు చిన్న బ్రోకర్.. నీలి వార్తలు రాసుకొని, నీలి బతుకులు బతుకుతూ.. దొంగచాటుగా తిరిగే నీకు మా గురించి ఎందుకురా లఫుట్. మేము ప్రేమిస్తాం, పూజిస్తాం, ప్రాణం ఇస్తాం, కోపం వస్తే అలుగుతాం. ప్రేమించినప్పుడు, పూజించినప్పుడు అలిగే హక్కు కూడా ఉంటుందిరా లఫుట్. సినిమా వాళ్ళ వార్తలు, సినిమా వాళ్ళ ఇంటర్వ్యూలు లేకపోతే నీకు పప్పం గడవదురా వెంకీగా. నువ్వు మనిషివైతే నీకు సిగ్గు, శరం ఉంటే నువ్వు తినేది అన్నమే అయితే ఒక్కసారి ప్రత్యక్షంగా నాకు కనపడు.. నీలి వార్తలు రాసుకునే నీ బతుకు.. నీ ఇంట్లో నువ్వు లేనప్పుడు జరుగుతున్న నీలి చిత్రాలు గురించి చూసుకోరా బఫున్ కొడకా..
నిజాయితీగలడితో దూరంగా ఉండటానికి ప్రయత్నించు. నీతిగా బతికేవాడి జోలికి రాకు
మాడి మసై పోతావ్ 🔥🔥🔥🔥” అంటూ బండ్ల గణేష్‌ ట్విట్టర్‌లో స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చారు.

దాంతోపాటు.. ఆ వెబ్‌సైట్‌ ఓనర్‌కు సినిమా వాళ్లు ఎవరూ ఇంటర్వ్యూలు ఇవ్వొద్దంటూ బండ్ల గణేష్‌ పిలుపునిచ్చారు. సినిమా కళామతల్లి ముద్దు బిడ్డలు మన తెలివితో మన కష్టంతో మన రక్తాన్ని చమటగా మార్చి పని చేసుకొని కళామతల్లి సేవలో ఉన్న మనందరం సదరు వెబ్‌సైట్‌ను బహిష్కరిద్దామని పిలుపునిచ్చారు. రివ్యూలు, తప్పుగా రాయడం లాంటివి చేస్తే అంతు చూస్తానంటూ హెచ్చరించారు బండ్ల గణేష్‌. రాజకీయాల్లో ఎన్నయినా చేసుకోవాలని, తమకు సంబంధం లేదన్నారు. సినిమా పరిశ్రమపై, కళామతల్లి ముద్దు బిడ్డలపై సినిమాను నమ్ముకొని బతుకుతున్న వాళ్లపై ఏ మాత్రం రాసినా సహించేది లేదని వార్నింగ్‌ ఇచ్చారు బండ్ల గణేష్‌.

ఈ విషయం ఇప్పుడు అటు ఫిల్మ్‌ సర్కిళ్లలోనూ, ఇటు మీడియా సర్కిళ్లలోనూ వైరల్‌ అయ్యింది. పొలిటికల్‌ లింకులూ ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.

Read Also : Mangalavaram: ఆర్‌ఎక్స్100 దర్శకుడికి కొత్త ప్రాజెక్టు.. ‘మంగళవారం’ కథేంటి?

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles