Actress Pragathi: సినీ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కుటుంబ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయి నటిస్తుంటారు. అమ్మ పాత్రల్లో ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆమె వ్యక్తిగత వ్యాయామంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటారు. అందుకే వర్కవుట్ చేస్తున్నఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు. తద్వారా ఫిట్‌నెస్‌కు తాను అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు స్పష్టం చేస్తుంటారు. తాజాగా ప్రగతి చీరకట్టులో వర్కవుట్స్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. (Actress Pragathi)
ఇటీవల కాలంలో ప్రగతి మళ్లీ వార్తల్లో నిలిచింది. ప్రగతి రెండో పెళ్లంటూ కొన్ని ప్రధాన మీడియా చానళ్లు పత్రికలు తెగ వార్తలు రాశాయి. అయితే, వాటిపై ప్రగతి తన సోషల్ మీడియా ఖాతా ద్వారానే కుండబద్ధలు కొట్టింది. ఈ విషయంపై కొన్ని మీడియా సంస్థలకు నోటీసులు కూడా ఇచ్చింది ప్రగతి.
ఫిల్మ్ ఇండస్ట్రీలో సహాయ నటిగా, తల్లిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రగతి రాణిస్తున్నారు. పలు సినిమాల్లో అక్కగా, తల్లి, అత్త పాత్రలతో ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం ప్రగతి వయసు 47 ఏళ్లు. ఈ వయసులో కూడా యువ హీరోయిన్ల మాదిరిగా వర్కవుట్స్, అందంలో రాజీ పడకుండా రాణిస్తోంది.
ఇటీవల ప్రగతి రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్టార్ ప్రొడ్యూసర్ తో త్వరలో పెళ్లి జరగబోతోందని సోషల్ మీడియా కోడై కూసింది. దీంతో ఆమె.. ఈ కథనాలపై చిర్రెత్తుకొచ్చి క్లారిటీ ఇచ్చేశారు. ఆధారాలు లేకుండా ఇలా ఎలా రాస్తారంటూ ఫైర్ అయ్యింది. ఊహించి ఏదేదో రాసుకోకండని షాకింగ్ వీడియో రిలీజ్ చేసింది.
ప్రగతి తాజాగా ఓ జిమ్ వీడియో విడుదల చేసింది. ఫిట్ నెస్‌తో ఆరోగ్యంగా, బాడీని కూడా ఫిట్ గా మెయింటైన్ చేస్తున్న ప్రగతి.. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటున్నారు. తాజాగా చీరకట్టులో జిమ్ చేస్తున్న వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. జిమ్ లో అంత కష్టపడుతున్నారంటే గ్రేట్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రగతి చీర కట్టుకొని జిమ్ లో 90 కేజీల బరువు ఈజీగా మోసేసింది.
ఈ వీడియో చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. 90 కేజీల బరువు మోయడం, అది కూడా చీరలో ఇలా మోయడం నిజంగా గ్రేట్ అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ చదవండి: Ram Charan: చరణ్ వాడే వస్తువుల ఖరీదు అన్ని కోట్లా?