Disha Patani: బాలీవుడ్ భామ దిశా పటాని సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండింగ్ దుస్తులను ధరిస్తూ యువతలో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. (Disha Patani)
1992 జూన్ 13న ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో జన్మించిన దిశా పటాని.. పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత లక్నోలోని అమిటీ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్‌లో డిగ్రీ చదువుకుంది.
మోడలింగ్‌పై మక్కువతో ఈ రంగంలోకి వచ్చిన దిశ.. ప్రసిద్ధ నటిగా స్థిరపడింది. టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన లోఫర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
2015లో లోఫర్ మూవీ వచ్చింది. ఈ సినిమాతో ఫుల్ రోల్ హీరోయిన్ పాత్ర పోషించింది. దిశా పటాని మొదటి బాలీవుడ్ అరంగేట్రం 2016లో జరిగింది.
ప్రముఖ దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ “M.S ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ” చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సరసన దిశ పఠాని నటించింది.
ఈ మూవీతో దిశ కెరీర్ మలుపు తిరిగిందని చెప్పొచ్చు. తర్వాత బాలీవుడ్‌లో వరుసపెట్టి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.
దిశ పఠాని స్టార్ డెబ్యూ ఆఫ్ ది ఇయర్ ఫిమేల్‌కి IFFA అవార్డు, ఉత్తమ మహిళా డెబ్యూగా స్క్రీన్ అవార్డు, ఈ చిత్రానికి ఉత్తమ నటనకు స్టార్‌డస్ట్ అవార్డును కూడా దక్కించుకుంది.
యూట్యూబ్‌లో 32 మిలియన్ వ్యూస్‌ను అందుకున్న టైగర్ ష్రాఫ్ సరసన దిశా పటానీ మ్యూజిక్ వీడియో కూడా చేసింది. 2017లో జాకీ చాన్ చలనచిత్ర ప్రాజెక్ట్ కుంగ్ ఫూ యోగాలోనూ దిశ పటాని నటించింది.
దిశా ఏప్రిల్ 2018లో టైగర్ ష్రాఫ్ సరసన బాఘీ 2లో చిత్రంలో పనిచేసింది. ఈ మూవీకి అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించారు. సాజిద్ నడియాద్వాలా నిర్మాణంలో వచ్చింది. దిశా పటాని వాణిజ్య ప్రకటనలు, మోడలింగ్ కూడా చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.
🔥🔥💗 #DishaPatani pic.twitter.com/zPtFUFvU2c
— . (@Ilaahi_) July 11, 2023
Read Also : Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఫొటో గ్యాలరీ..