Actor Naresh: రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం చిత్రంలో ఓరయ్యో నా అయ్యా పాటలో తన హావ భావాలతో జనాలందరినీ ఏడిపించేసిన నరేష్.. అ ఆ.. సినిమాలో సమంత తండ్రిగా తనదైన కామెడీ రోల్ పోషించారు. ఇలా ఏ రకమైన పాత్ర చేయాలన్నా సిద్ధమైపోతారు నరేష్. మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నరేష్.. పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. (Actor Naresh)
సీనియర్ యాక్టర్, ఒకప్పటి హీరో నరేష్ ఇప్పుడు రిలీజ్ అవుతున్న చాలా సినిమాల్లో హీరోలు, హీరోయిన్ల తండ్రి పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోయే నరేష్.. తనదైన కామెడీ టైమింగ్ తో కూడా ఆకట్టుకుంటాడు. సీరియస్ వేషమైనా, కామెడీ అయినా, నటనలో పండిపోయిన నరేష్.. ఏ పాత్ర ఇచ్చినా న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది.
తాను బాల నటుడిగా చేసిన చిత్రాల్లో కుటుంబమంతా కలిసి నటించామన్నాడు నరేష్. అప్పట్లో తనకు ఏడేళ్లు ఉండేవని.. ఆ సమయంలో 12 సంవత్సరాలున్న జయసుధ తన ఫస్ట్ కజిన్ అని తెలిపాడు. హీరోగా చేసిన సినిమాల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ కు కాస్త సమయం తీసుకున్నానన్న నరేష్.. ఇప్పుడు బిజీగానే ఉన్నానని తెలిపాడు. జంధ్యాల, విజయనిర్మల తన గురువులని చెప్పాడు.
రచయితగా జంధ్యాల అంటే అమితమైన ఇష్టమని నరేష్ చెప్పాడు. ఈ విషయంలో జంధ్యాలను బీట్ చేసేవారు లేరన్నాడు. ఆయన ఎన్నో కుటుంబాల్లో దీపం వెలిగేలా చేశారని గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నానని తెలిపాడు. ఇటీవల పవిత్రా లోకేష్, నరేష్ ఎపిసోడ్ తో వీరిద్దరూ పాపులర్ అయ్యారు. నరేష్ ను అభిమానించే వారు కూడా రోజు రోజుకూ పెరుగుతున్నారు.
ఇదీ చదవండి: Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ జోరు.. రెమ్యునరేషన్ పెంచేసిందిగా.. వయ్యారి భామ ఫొటో గ్యాలరీ
Raasi career: రాశి కెరీర్‌ను దెబ్బ తీసిన సినిమా అదేనా? తర్వాత కోలుకోలేకపోయిన ఫ్యామిలీ హీరోయిన్!