Raasi career: నైన్‌టీస్ హీరోయిన్లలో రాశిది టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం. రాశి గురించి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు హీరోయిన్ రాశి సినిమాలంటే యువతలో మంచి క్రేజ్ ఉండేది. చైల్డ్ ఆర్టిస్టుగా కూడా రాణించిన రాశి.. తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించింది. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడం ఆమెకు ప్లస్ అయ్యింది. ఇండస్ట్రీలో హీరోయిన్ అయ్యాక తక్కువ సమయంలోనే ఫ్యామిలీ ఓరియెంటెడ్ హీరోయిన్ గా ముద్ర వేసింది. (Raasi career)
ఆమె నటించిన చిత్రాలు తెలుగుతో పాటు తమిళంలోనూ హిట్ అయ్యాయి. సుమారు దశాబ్దం పాటు హీరోయిన్ గా రాణించింది. రాశి అంద చందాలకు కుర్రాలు మతులు పోగొట్టుకొనే వారు. థియేటర్లలో ఆమె దర్శనమివ్వగానే ఈలలు కేకలతో హోరెత్తించేవారు. నేటికీ రాశి ఫ్యాన్స్ అనేక మంది ఉన్నారనడంలో సందేహం లేదు. వడ్డే నవీన్, శ్రీకాంత్, జగపతి బాబు, పవన్ కల్యాణ్ ఇలా అనేక మంది హీరోల సరసన నటించారు రాశి.
ఏ మూవీతో రాశి కెరీర్ దెబ్బతినిందంటే..
ఓ రేంజ్‌లో సాగిపోతున్న రాశి సినీ కెరీర్ ను ఓ సినిమా దారుణంగా దెబ్బతీసిందని చెబుతారు. రాశి కెరీర్ దెబ్బతినడానికి కారణం మహేష్ బాబు సినిమా నిజం అని టాక్. ఆ సినిమా డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చింది. ఆ సమయంలో గోపీచంద్ విలన్ క్యారెక్టర్ చేశాడు. ఈ నేపథ్యంలో గోపీచంద్ కీప్ గా నటించేందుకు తొలుత రాశిని సంప్రదించారట. అయితే, హీరోయిన్ గా చేస్తున్న తనకు అలాంటి క్యారెక్టర్ సూట్ కాదని ఆమె ఒప్పుకోలేదని తెలుస్తోంది.
ఇలాంటి పాత్రలు చేస్తే ప్రేక్షకుల నుంచి నెగిటివ్ కామెంట్లు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడ్డారట రాశి. అయినా సరే.. రాశిని బలవంతంగా ఒప్పించారట డైరెక్టర్ తేజ. మంచి పేరొస్తుందని మాయమాటలు చెప్పి చివరకు ఒప్పుకోక తప్పేలా లేదన్నట్లు పరిస్థితి క్రియేట్ చేశారని తెలుస్తోంది. ఈ దెబ్బతో రాశికి అవకాశాలు తగ్గుముఖం పట్టాయట. తర్వాత వాస్తవంగానే సినిమాల్లో ఆమె కనిపించలేదు.
ఇదీ చదవండి: Rashi Khanna: బ్లాక్ డ్రెస్‌లో అందాల రాశి.. లేటెస్ట్ హాట్ ఫొటోషూట్ వైరల్!