Gold Rates Today (13-06-2023): బంగారం ధరల్లో పెద్దగా మార్పులు జరగలేదు. నేడు కాస్తంత తగ్గింది. యూఎస్ సెంట్రల్ బ్యాంకు సమావేశం నేపథ్యంలో వడ్డీ రేట్లపై వరల్డ్ వైడ్ అంచనాలు పెరిగిపోయాయి. అటు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధరల్లో ఏ మాత్రం కదలిక లేదు. ప్రస్తుతం, ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 1,972 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇండియాలో 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర రూ.100, స్వచ్ఛమైన పసిడి ధర రూ.100 చొప్పున తగ్గాయి. కిలో వెండి ధర మాత్రం రూ.200 తగ్గింది. Gold Rates Today (13-06-2023)
తెలుగు రాష్ట్రాల్లో నేడు పసిడి, వెండి రేట్లు ఇలా..
తెలంగాణలోని హైదరాబాద్ గోల్డ్ మార్కెట్‌లో (Hyderabad Gold) 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,400గా ఉంది. అదే 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,450 వద్ద నమోదైంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.79,300 గా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఇవే ధరలు అమల్లో ఉంటాయి.
ఇక ఏపీలోని విజయవాడ గోల్డ్ మార్కెట్‌లో ఇవాళ 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ ధర రూ.55,400 వద్ద ఉండగా, 24 క్యారెట్ల బిస్కెట్ పసిడి ధర రూ.60,450 గా కొనసాగుతోంది. బెజవాడ సిటీలో కిలో వెండి ధర రూ.79,300 వద్ద ఉంది. రాష్ట్రంలోని విశాఖపట్నం, ప్రొద్దుటూరు, అనంతపురం, తాడిపత్రి పట్టణాల్లోనూ గోల్డ్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో విజయవాడ రేట్లే అమలు అవుతాయి.
దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో ఇవాళ పసిడి రేట్లు ఇలా..
చెన్నై నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల పసిడి రేటు నేడు రూ.55,800 గా కొనసాగుతోంది. అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,900 వద్దకు చేరింది. తమిళనాడులోని కోయంబత్తూరు పట్టణంలో కూడా బంగారం, వెండి ధరలు చెన్నైలో ఉన్న రేట్లే ఉంటాయి.
దేశ వాణిజ్య రాజధానిగా పేరు గాంచిన ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ ప్రైస్ రూ.55,400గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం రూ.60,450 వద్ద కొనసాగుతోంది. అక్కడి మరో ముఖ్య నగరం పుణెలో కూడా ముంబైలో కొనసాగుతున్న రేటే అమల్లో ఉంటుంది.
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల పసిడి ధర రూ.55,550 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,600 గా నమోదైంది. జైపూర్, లక్నో నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతాయి.
డబ్బున్న వారు ప్లాటినం కొనుగోలుకు ఎక్కువ ఇష్టపడుతుంటారు. 10 గ్రాముల ప్లాటినం ధర ఇవాళ రూ.150 తగ్గింది. రూ.26,710 వద్ద కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా మిగతా అన్ని ప్రముఖ నగరాలు, పట్టణాల్లో ప్లాటినం విషయంలో ఒకే ధర అమల్లో ఉంటుంది.
సాధారణంగా బంగారం, సిల్వర్ సహా ప్లాటినం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అలంకరణ లోహాల్లో ప్రతి రోజూ ఈ మార్పులు సహజం. ప్రపంచంలో జరిగే అనేక పరిణామాలు, వాణిజ్య కార్యకలాపాలపై వీటి ధరలు ఆధారపడి ఉంటాయి. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో రేట్లు పెరగడం, లేదా తగ్గడం లాంటి పరిణామాలతో మనదేశంలోనూ మార్పులు జరుగుతాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల ధరలు పుంజుకొనేందుకు, తగ్గుదల నమోదు చేసేందుకు పలు కారణాలు ఉంటాయి. ఏడాదిన్నరగా కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్ వార్.. ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ నేపథ్యంలో కొన్ని నెలలుగా అన్ని రకాల ధరలూ అమాంతం పెరిగిపోతున్నాయి. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం స్టాక్, వడ్డీ రేట్ల హెచ్చు తగ్గులు.. ఇలా అనేక అంశాలు గోల్డ్ ప్రైస్‌ను నిర్దేశిస్తుంటాయి.
Read Also : Money Tips in Astrology: అప్పుల బాధలన్నీ తీరి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి?