OTT Movie: క్షుద్రపూజలు, నరబలులు, సీరియల్ హత్యల నేపథ్యంలో తెరకెక్కిన ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ ప్రస్తుతం ఓటీటీలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. థియేటర్లలో పెద్దగా విజయాన్ని సాధించలేకపోయిన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో సూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, గూస్‌బంప్స్ తెప్పించే ట్విస్టులతో ఈ సినిమా ఓటీటీ ఆడియెన్స్‌కి బాగా నచ్చుతోంది.
కథ ఏమిటి?
కర్ణాటక–ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో వరుసగా యువతులు హత్యకు గురవుతుంటారు. హంతకుడు వారి తలలను నరికి, దిష్టి బొమ్మలను అమర్చుతాడు. ఈ ఘోర ఘటనలు రెండు రాష్ట్రాల్లో కలకలం రేపుతాయి. 17 హత్యలు జరిగినా పోలీసులు ఒక్క క్లూ కూడా అందుకోలేరు.
ఇలాంటి పరిస్థితుల్లో ఒక స్థానిక డిటెక్టివ్ రంగంలోకి దిగుతాడు. విచారణలో ఈ హత్యలకు క్షుద్రపూజలు, నరబలుల బ్యాక్‌డ్రాప్ ఉందని తెలుస్తుంది. క్రాస్-స్టేట్ కనెక్షన్ కూడా బయటపడుతుంది. అమ్మాయిలను హతమార్చిన ఆ సైకో కిల్లర్ ఉద్దేశమేంటి? దిష్టి బొమ్మల వెనుక మిస్టరీ ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం ఈ సినిమా క్లైమాక్స్‌లో లభిస్తుంది. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే అంచనాలకు అందని ట్విస్టులు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌కి కట్టిపడేస్తాయి.
నటీనటులు & టెక్నికల్ టీమ్
పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివ కందుకూరి, రాశి సింగ్, అరుణ్ కుమార్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కథా నిర్మాణం, టెన్షన్ క్రియేట్ చేసే సీక్వెన్స్‌లు, థ్రిల్లింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా హైలైట్స్‌గా నిలుస్తాయి.
ఎక్కడ చూడొచ్చు?
ఈ సినిమా ప్రస్తుతం ఆహా మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్ చూడాలనుకునే ప్రేక్షకులకు ఇది తప్పక చూడదగ్గ మూవీగా మారింది.
ఇవీ చదవండి: OTT Movie : రివెంజ్ ఫర్ లవ్.. ఓటీటీలో అదరగొడుతున్న హారర్ థ్రిల్లర్!
OTT Movie : సోనీ లివ్‌లో అద్భుతమైన సినిమాలు, సిరీస్‌లు, స్పోర్ట్స్ ఈవెంట్స్!






