బుధవారం, 21 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Cinema

Bellamkonda Srinivas: పెళ్లి బాట పట్టనున్న టాలీవుడ్ యంగ్ హీరో… త్వరలో నిశ్చితార్థం? వ‌ధువు కావ్యారెడ్డి?

Keerthanaa News Deskప్రచురణ తేదీ: శనివారం, 7 మార్చి 2026

Bellamkonda Srinivas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం పెళ్లిళ్ల సందడి కనిపిస్తోంది. ఒకవైపు స్టార్ హీరోలు, యంగ్ హీరోలు వరుసగా పెళ్లిపీటలెక్కుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీల పెళ్లిళ్లు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో మరో యంగ్ హీరో కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆ హీరో ఎవరో కాదు బెల్లంకొండ శ్రీనివాస్.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడైన శ్రీనివాస్ త్వరలోనే తన బ్యాచిలర్ జీవితానికి గుడ్‌బై చెప్పనున్నాడని సమాచారం. తాను ప్రేమించిన అమ్మాయితో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

త్వరలో నిశ్చితార్థం
సమాచారం ప్రకారం బెల్లంకొండ శ్రీనివాస్ గత కొన్నేళ్లుగా కావ్యా రెడ్డి అనే యువతితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. దీంతో ఆదివారం మార్చి 8న వీరి నిశ్చితార్థం జరగనుందని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్‌లో జరిగే ఈ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమం చాలా సాదాసీదాగా ఉండనుందని తెలుస్తోంది. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అత్యంత దగ్గరి స్నేహితుల సమక్షంలోనే శ్రీనివాస్ – కావ్యలు ఉంగరాలు మార్చుకోనున్నారని సమాచారం. ఎంగేజ్‌మెంట్ అనంతరం త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు.

కావ్యా రెడ్డి ఎవరు?
బెల్లంకొండ శ్రీనివాస్‌కు కాబోయే భార్య కావ్యా రెడ్డి కూడా హైదరాబాద్‌కే చెందినవారట. అయితే ఆమెకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధాలు లేవని తెలుస్తోంది. కావ్య తండ్రి హైదరాబాద్‌లో ప్రముఖ లాయర్‌గా పనిచేస్తున్నారని సమాచారం.

శ్రీనివాస్ – కావ్యల పరిచయం ఎలా ప్రారంభమైంది? ఎప్పుడు ప్రేమలో పడ్డారు? అనే విషయాలు బయటకు రాలేదు. అయితే వీరి ప్రేమ గురించి ఇరు కుటుంబాలకూ తెలుసని, పెద్దలు కూడా వీరి సంబంధానికి అంగీకారం తెలిపారని టాక్ వినిపిస్తోంది.

ఈ ఏడాది చివర్లో పెళ్లి?
మార్చి 8న నిశ్చితార్థం జరిగితే, ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరిగే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఎంగేజ్‌మెంట్ తర్వాత పెళ్లి తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ ప్రయాణం
బెల్లంకొండ శ్రీనివాస్ 2014లో వచ్చిన ‘అల్లుడు శీను’ సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.

అతను నటించిన సినిమాల్లో స్పీడున్నోడు, జయ జానకీ నాయక, సాక్ష్యం, కవచం, సీత, రాక్షసుడు, అల్లుడు అదుర్స్ వంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ముఖ్యంగా ‘రాక్షసుడు’ సినిమా మంచి విజయాన్ని అందించింది. అలాగే ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ ద్వారా బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చాడు.

ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ చేతిలో పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ‘టైసన్ నాయుడు’, ‘హైందవ’ వంటి సినిమాలతో పాటు మరికొన్ని ప్రాజెక్టులు కూడా లైన్లో ఉన్నాయని సమాచారం.

మొత్తానికి టాలీవుడ్‌లో మరో పెళ్లి వార్త వినిపించడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. త్వరలోనే ఈ జంట నిశ్చితార్థంపై అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.

ఇవీ చ‌ద‌వండి: Raghu Babu: “గంగిరెడ్డి పాత్రతోనే నా కెరీర్ మలుపు తిరిగింది” – రఘుబాబు ఇంట్రెస్టింగ్ రివిలేషన్స్
Puri Jagannath: పూరి జగన్నాథ్ రైటింగ్‌కి గ్లోబల్ రేంజ్ ఉంది – ప్రభాస్, మహేష్ బాబు ప్రశంసలతో మాస్ డైరెక్టర్ కమ్‌బ్యాక్ హైప్

ట్యాగ్స్: , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading