Astrology tip: పని మీద బయటకు వెళ్తన్నప్పుడు ఎవరు ఎదురొస్తే ఏం జరుగుతుందని తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలో అనేక సందేహాలు మనసును తొలుస్తుంటాయి. నల్లపిల్లి ఎదురొస్తే పని నెరవేరదని చాలా మంది చెబుతుంటారు. అలాగే బొట్టు లేని స్త్రీ ఎదురొచ్చినా ఆటంకాలు తప్పవని చెబుతుంటారు. ఇలాంటి సంకేతాలు, ఆచారాలు ఎందుకు? వాటి వెనుక దాగి ఉన్న ఆంతర్యం ఏమిటో ఈ కథనంలో తెలుసుకోండి. (Astrology tip)
ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు శకునాలు చూసుకొని వెళ్లడం హిందూ సంప్రదాయంలో అనాదిగా కొనసాగుతోంది. శకున శాస్త్రం అని కూడా ఇందుకోసం ప్రత్యేకంగా మన పూర్వీకులు తెచ్చారు. సాదారణంగా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు పుణ్యస్త్రీ ఎదురు వస్తే మంచిదని, విధవరాలు ఎదురు వస్తే మంచిది కాదని చెబుతుంటారు. పుణ్యస్త్రీ తన సంసారంలో ప్రశాంతంగా, సంతోషంగా గడుపుతూ ఉంటుంది కాబట్టి మనకు ఎదురు వస్తే మంచి జరుగుతుందని భావిస్తారు.
పనిమీద బయటకు వెళ్తున్నప్పుడు ఒంటరిగా బ్రాహ్మణుడు ఎదురు వస్తే ఆ ప్రయాణాన్ని ఆపేయాలని చెబుతారు. ఎవరైనా చనిపోయిన సందర్భాల్లో మాత్రమే ఇలా బ్రాహ్మణులు ఒంటరిగా వస్తుంటారని చెబతారు. పెళ్లిళ్లు, వేడుకలు, పండుగలకు ఆశీర్వదించడానికి వచ్చే వారు జంటగానో, లేదంటే ముగ్గురు నలుగురో కలిసి వస్తారని చెబుతున్నారు. అయితే, ఆఫీసుకు వెళ్లే వారు, గుడికి వెళ్లే పంతులు ఎదురు వస్తే దోషంగా భావించరాదని చెబుతున్నారు.
విధవరాలు ఎదురు రావడం వల్ల ఆమె దుఃఖంలో, బాధలో ఉంటుంది కాబట్టి మన పనులు కూడా నెరవేరే క్రమంలో ఆటంకాలు ఎదురవుతాయని చెబుతారు. ఆమెకు సంబంధించిన ఆవేదన వైబ్రేషన్స్ మనమీద పడతాయని చెబుతారు. మనం బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా ఏడుస్తూ ఎదురు వస్తే.. లేదంటే దుఃఖంతో ఎదురు వస్తే ఇలాంటి సందర్భాల్లో ఆ పనులు వాయిదా వేసుకోవాలని చెబుతారు.
బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుడు ఎదురు వస్తే ఏం జరుగుతుంది?
బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుడు రావడం వల్ల మంచి జరుగుతుందని చెబుతారు. అపర కార్యక్రమానికి బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుడు వెళ్లడు కాబట్టి మంచి కార్యక్రమాలకే వస్తుంటారు కాబట్టి బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుడు ఎదురు వస్తే మంచిదని చెబుతారు. అలాగే గుడ్ల గూబ ఇంటి పరిసరాల్లోకి వస్తే మంచిది కాదని చెబుతారు. ఇలా రావడం వల్ల ప్రాణహాని కూడా జరుగుతుందని చెబుతారు. అలాగే పనిమీద వెళ్లేటప్పుడు భిక్షగాడు ఎదురు వస్తే ఆ పని జరగడంలో ఆటంకం ఏర్పడుతుందంటున్నారు.