Gangamma Jatara: అంగరంగ వైభవం.. గంగమ్మతల్లి జాతరకు భారీగా తరలి వచ్చిన భక్తజనం

Gangamma Jatara: తిరుపతిలో గంగమ్మ జాతర (Gangamma Jatara) అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఐదోరోజు గంగమ్మ (Gangamma Jatara) భక్తి చైతన్య యాత్ర ఊహకు అందని స్థాయిలో తిరుపతి పట్టణ ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో గంగమ్మ భక్తి చైతన్య యాత్రలో భాగస్వాములయ్యారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం తొలి గడప అనంత వీధి నుంచి ప్రారంభమైన గంగమ్మ భక్తి చైతన్య యాత్ర.. పరసాల వీధి, రామచంద్ర పుష్కరిణి, మహతి ఆడిటోరియం, ఎస్పీ కార్యాలయం, కృష్ణాపురం ఠాణా, గాంధీ రోడ్డు, బండ్ల వీధి ద్వారా శ్రీ తాతయ్య గుంట, గంగమ్మ ఆలయానికి చేరుకుంది.

దారి పొడవునా జానపద శైలిలో సాగే అమ్మ వారి భక్తి కీర్తనలతో, డప్పు వాయిద్యాల నడుమ భక్తులు లయబధ్ధంగా చిందేస్తూ పులకించి పోయారు. గమ్మ నామ స్మరణతో పట్టణం మార్మోగింది. నవదుర్గలు, కాంతారా, తప్పెటగుళ్లు, డప్పులు,తీన్ మార్, కీలు గుర్రాలు, కొమ్ము కొయ్య, దింసా, పగటి వేషగాళ్లు, పులివేషాలు, గరగల్లు, బోనాల,గిరిజన నృత్యం వంటి కళాప్రదర్శలు నడుమ ఊరేగింపుగా భక్తి చైతన్య యాత్ర గంగమ్మ ఆలయానికి చేరుకుంది.

అనంతరం ఆలయం వద్ద ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 5వ రోజు నిర్వహించిన గంగమ్మ భక్తి చైతన్య యాత్ర ఊహకు అందని స్థాయిలో పట్టణ ప్రజలకు భాగస్వాములు అయ్యారని తెలిపారు. రంగుల పోటీల్లాగా వేషాలు వేసుకొని ఉత్సాహంగా భక్తులు పాల్గొన్నారు. గంగమ్మ జాతరంటే ఇలాగా ఉంటుందని అనిపించేలా భక్తి చైతన్య యాత్ర సాగిందని ఎమ్మెల్యే తెలిపారు. వేంకటేశ్వర స్వామి చెల్లి గంగమ్మకు జరుపుకునే పండగ ఇదేని అనిపించేలా పట్టణంలోని ప్రతి గడప గడప నుంచి కదిలివచ్చి చైతన్య యాత్రలో భాగస్వామ్యం అయ్యారన్నారు.

జాతర బ్రహ్మత్స వాలు మొదలైనప్పటి నుంచి ఆలయంలో భక్తులతో కిటకిటలాడుతున్నదిని తిరుపతి చుట్టుపక్క ప్రాంతాల ప్రజలే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా అనేకమంది భక్తులు వచ్చి వేశాలు వేసి గంగమ్మను దర్శించుకుంటున్నారని చెప్పారు. బ్రహ్మోత్సవాలు మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు 80 వేల మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారన్నారు. ఈరోజు సుమారు లక్ష మంది భక్తులు గంగమ్మను దర్శించుకున్నారని వెల్లడించారు. గంగమ్మ తల్లికి ఇష్టమైన వేషాలు వేసుకొని ఈరోజు నిర్వహించిన భక్తి చైతన్య యాత్ర విజయవంతంగా ముగిసిందని భూమన పేర్కొన్నారు.

మరోవైపు గంగమ్మ తల్లికి సారె ఇచ్చే అదృష్టం కలగడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె.రోజా పేర్కొన్నారు. తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతర సందర్భంగా మంత్రి కుటుంబ సభ్యులతో కలసి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లికి సారె సమర్పించారు.

ఈ సందర్భంగా ఆలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ బిడ్డలందరినీ చల్లగా చూసుకుంటు అందరిని కాపాడుకుంటూ పిల్లల భవిష్యత్తుకు తల్లులు కోరుకునే విధంగా ఇవ్వడమే గంగమ్మ తల్లి కే చెల్లునని, గంగమ్మ తల్లి మన తిరుపతి ఆడబిడ్డని నేను చదువుకునే రోజుల్లో చూసిన గంగజాతరకు ఇప్పుడు జరుగుతున్న గంగ జాతర కు చాలా అభివృద్ధి చెందిందన్నారు.

Read Also: Tirumala: తిరుమలలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? టికెట్లు దొరుకుతాయా?

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles