HomeAndhra PradeshWeather Report: 127 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు.. విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక

Weather Report: 127 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు.. విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక

ఏపీలోని పలు మండలాల్లో రేపు తీవ్ర వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (Weather Report) హెచ్చరించింది. మోచా తుపాను ప్రభావం తీవ్రత రాష్ట్రంపై పడలేదు. అయితే అకాల వర్షాల తర్వాత గత మూడు నాలుగు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే సుమారు 4 డిగ్రీలు అధికంగా (Weather Report) నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే రేపు ఆంధ్రప్రదేశ్‌లోని పలు మండలాల్లో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతిలోని (Weather Report) విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులను బయటకు తీసుకెళ్లవద్దని సూచించారు.

రేపు 127 మండలాల్లో తీవ్రవడగాల్పులు,173 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 92 మండలాల్లో తీవ్ర వడగాల్పులు,190 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు ఎండ తీవ్రత నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

రేపు తీవ్ర వడ గాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు..
అల్లూరి సీతారామరాజు జిల్లా 2, అనకాపల్లి 8, బాపట్ల 9, తూర్పుగోదావరి 17, ఏలూరు 3, గుంటూరు 13, కాకినాడ 18, కోనసీమ 15, కృష్ణా 18, ఎన్టీఆర్ 8, పల్నాడు 2, మన్యం 1, విశాఖపట్నం 3, పశ్చిమగోదావరి జిల్లాలోని 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 173 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

రేపు విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ,ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీల నుంచి – 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.

మరోవైపు ఆదివారం ఎన్టీఆర్ జిల్లాలో 10 మండలాలు, మిగిలిన చోట్ల మొత్తం 34 మండలాల్లో వడగాల్పులు వీచాయని వివరించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో 44.8 డిగ్రీలు, ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలో 44.7 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో ప్రజలు అల్లాడుతున్నారు. వడగాలుల తీవ్రత పెరిగింది. రాత్రి ఏడు గంటలు దాటినా కూడా పలు ప్రాంతాల్లో 37 డిగ్రీల నుంచి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఉక్కపోత భరించలేకపోతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా 33 డిగ్రీలకు చేరడం గమనార్హం. అర్ద్రరాత్రి దాటాక కూడా వేడిగాలులు తగ్గటం లేదు.

తెల్ల వారు జాము నుంచే ఉక్కపోత పలు ప్రాంతాల్లో మొదలవుతుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తప్పనిసరి అయితేనే బయటకు రావాలని, లేదంటే ఇంట్లోనే తగిన జాగ్రత్తలు తీసుకొని ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. బయటకు వెళ్లాల్సి వచ్చినా ముఖానికి మాస్కులు, తలకు టోపీ, శరీరం మొత్తం కవర్‌ అయ్యేలా దుస్తులు ధరించాలని, నీరు ఎక్కువగా తాగుతుండాలని సూచించారు.

Read Also : Journalist Health Camp: బెజవాడలో జర్నలిస్టులకు ఉచిత హెల్త్ క్యాంప్‌..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు