Vasireddy Padma: మహిళలపై మహిళలే ట్రోల్ చేస్తూ జుగుప్సాకర పోస్టులు పెట్టడం బాధాకరమని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆవేదన చెందారు. సోషల్ మీడియా నిబంధనల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె పేర్కొన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె.. మహిళలపై పైశాచికత్వానికి పరాకాష్టగా సోషల్ మీడియాలో పోస్టింగులు ట్రోల్ చేయడం రాతియుగంలో కూడా లేని హీనత్వాన్ని తలపిస్తున్నాయని చెప్పారు. ప్రధానంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులకు చెందిన మహిళలపై అసభ్యకరమైన పదజాలంతో పాటు అశ్లీల చిత్రాలు, అక్రమ సంబంధాల వంటి కట్టు కథల పోస్టింగులు సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడం ఎంతో జుగుప్సాకరమైన విషయం అన్నారు. (Vasireddy Padma)
యు.కె. లో ఉంటున్న ఒక మహిళ రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో ఉన్నవారి కుటుంబ మహిళలపై సోషల్ మీడియాలో ఎంతో బాధాకరమైన పోస్టులు పెట్టడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. అయితే అటు వంటి వారిని ప్రతి పక్షాల వారు సమర్థించడం అనేని ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు. ఇటువంటి సందేశాలు ఇవ్వడం ద్వారా వారు సమాజానికి ఎటు వంటి సంకేతాలు ఇస్తున్నారు అనే విషయాన్ని ఆలోచించాలన్నారు. సోషల్ మీడియాలో పోస్టుకు పోస్టు పెట్టడమే సమాధానం కాదని, ఎంత మాత్రం సమర్థనీయం కాదని ఆమె స్పష్టం చేశారు.
పోలీస్ వ్యవస్థ కూడా ఏమీ చేయలేని పరిస్థితి..
సోషల్ మీడియా సమాజంలో సృష్టించే దారుణాతి దారుణమైన పరిస్థితులను నియంత్రించడంలో న్యాయ, పోలీస్ వ్యవస్థలు కూడా ఏమీ చేయలేని పరిస్థితులో ఉండటం వల్ల సమస్య మరింత జఠిలం అవ్వడానికి దారితీస్తోందన్నారు. సోషల్ మీడియా దాడిని యాసిడ్ దాడులు, హత్యా యత్నాలతో సమానంగా చూడాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. వ్యక్తిత్వ హననం హత్య కంటే దారుణంగా మారినప్పుడు చట్టాలకు పదును పెట్టి అదుపుతప్పున సోషల్ మీడియాను కట్టడి చేయాల్సిన అవసం ఎంతో ఉందన్నారు.
సోషల్ మీడియాలో సంస్కరణలు తీసుకురావల్సిన ఆవశ్యకతపై పలువురి సూచనలు, సలహాలను స్వీకరించేందుకు రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో వచ్చేనెల 5న విజయవాడలో ఒక సెమినార్ నిర్వహించనున్నట్లు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. సమాజంలోని మేధావులు, సంఘ సంస్కర్తలు, విద్యావంతులు ఈ సెమినార్‌లో పాల్గొని సోషల్ మీడియాలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. తమ కార్యాలయానికి మెయిల్ ద్వారా కూడా సూచనలు, సలహాలు ఇవ్వవచ్చని ఆమె తెలిపారు.
తమ కమిషన్ కు వచ్చిన పిర్యాధులు అన్నింటిపై సత్వరమే చర్యలు తీసుకోనేందుకు పోలీస్ శాఖకు పంపుతున్నామని వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. ముఖ్యంగా సైబర్ క్రైం డిపార్ట్‌మెంట్‌కు పంపించామని పేర్కొన్నారు. ఇటీవల టీడీపీ సోషల్ మీడియా వర్సెస్ వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియాయుద్ధం భీకరంగా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టడం, ట్రోల్‌చేయడంతో మొదలైన ఈ రగడ.. టీడీపీపై వైసీపీ విరుచుకుపడే వరకు వెళ్లింది. ప్రస్తుతం ఇది కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ మహిళా కమిషన్ రియాక్ట్ అయ్యింది.
Read Also : CBN on Sajjala Bhargav: సజ్జల భార్గవ్ పేరును కలవరిస్తున్న టీడీపీ నేతలు.. స్వయంగా చంద్రబాబు సైతం…!