CBN on Sajjala Bhargav: సజ్జల భార్గవ్‌ పేరును కలవరిస్తున్న టీడీపీ నేతలు.. స్వయంగా చంద్రబాబు సైతం…!

CBN on Sajjala Bhargav: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSRCP) ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) తనయుడు సజ్జల భార్గవ్‌ (Sajjala Bhargav Reddy) పేరు ఇప్పుడు ఏపీలో మార్మోగుతోంది. ఎందుకో తెలుసా? ఆయన ఈ మధ్య కాలంలోనే వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా (YSRCP Social Media) బాధ్యతలు తీసుకున్నారు. అప్పటిదాకా కాస్త స్తబ్ధుగా ఉన్న వైసీపీ సోషల్‌ మీడియా సైనికులు.. సజ్జల భార్గవ్‌ ఎంట్రీతో యాక్టివ్‌ అయ్యారు. ప్రతిపక్షం (TDP) దుర్నీతిని ఎండగడుతూ, వ్యక్తిగతంగా అటాక్‌ చేస్తున్న వారికి తగిన గుణపాఠం చెబుతున్నారు. సోషల్‌ మీడియాలో ముఖ్యమంత్రి జగన్‌ (CM YS Jagan) కుటుంబంపై వ్యక్తిగత దాడిని మొన్నటి వరకు తిప్పికొట్టలేకపోయిన వైసీపీ… ఇప్పుడు సరైన ట్రాక్‌లో పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. (CBN on Sajjala Bhargav)

ఇటీవల వైసీపీ సోషల్‌ మీడియా వర్సెస్‌ టీడీపీ సోషల్‌ మీడియాగా (TDP Social Media) వార్‌ నడుస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌ కుటుంబంపై, ఆయన ఇంట్లో ఆడవాళ్లపై కూడా టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం, విదేశాల్లో ఉంటున్న కొందరు మహిళలతో అసభ్యకర పదజాలంతో ట్విట్టర్‌, (Twitter) ఫేస్‌బుక్‌ (Facebook) పోస్టులు, అసభ్యకర ఎడిటింగ్‌లతో విపరీతంగా సర్క్యులేట్‌ చేశారు. దీంతో వైసీపీ సోషల్‌ మీడియా అలెర్ట్‌ అయ్యింది. సదరు పోస్టులు పెడుతున్న వారి బాగోతాలన్నీ సామాజిక మాధ్యమాల్లో ఎండగడుతూ ఇటు వైపు నుంచి అటాక్‌ మొదలు కావడంతో ప్రతిపక్ష పార్టీలో గుబులు మొదలైంది. వైసీపీ సోషల్‌ మీడియాను తట్టుకోలేకపోతున్నాం.. అంటూ విలవిలలాడుతున్నారు.

చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఉమెన్‌ ట్యాగ్‌..

టీడీపీ సానుభూతిపరులైన కొందరు సీఎం జగన్‌, ఆయన కుటుంబంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని పక్కాగా ప్లాన్‌ చేసినట్లు అర్థమవుతోంది. విదేశాల్లో ఉంటే ఏమీ చేయలేరనే భావనతో అక్కడి నుంచి ఈ ప్లాన్‌ను అమలు చేయిస్తున్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల వారిపై వైసీపీ సోషల్‌ మీడియా యుద్ధం చేస్తుండడంతో స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగారు. పోస్టులు పెట్టిన మహిళలతో ఆయన మాట్లాడి ఓదార్చారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దీంతో ఇందంతా ఆయనే చేయిస్తున్నాడనే అభిప్రాయాన్ని బలంగా చెబుతున్నాయి వైసీపీ శ్రేణులు. తప్పుడు పనులు చేసి దాన్ని కవర్‌ చేసుకొనేందుకు మహిళలపై దాడులా.. మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా? వారిపై కూడా ఇలాగా ప్రవర్తిస్తారా?…… అంటూ ఏమీ ఎరుగనట్లు వీడియోలు విడుదల చేస్తున్నారంటూ వైసీపీ సోషల్‌ మీడియా శ్రేణులు మండిపడుతున్నాయి.

ఇదంతా కొత్తగా వచ్చిన సజ్జల భార్గవ్‌ చేయిస్తున్నాడంటూ టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. మహిళా నేతలు మొదలుకొని మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలంతా సజ్జల భార్గవ్‌ పేరును కలవరిస్తున్నారు. స్వయంగా చంద్రబాబే నిన్నటి సమావేశంలో సజ్జల భార్గవ్‌ పేరును ప్రస్తావించారు. సజ్జల భార్గవ్ కూడా సైకోలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దీంతో వైసీపీ సోషల్‌ మీడియాను తట్టుకోలేకపోతున్నామనే అభిప్రాయం చెప్పకనే చెబుతున్నారు. మరి ముఖ్యమంత్రి జోలికి వచ్చి ఆయనపై వ్యక్తిగతంగా, అసభ్యకర రీతిలో పోస్టులు పెట్టిన వారికి సపోర్ట్‌ చేస్తే ఇలాగే ఉంటుందని వైసీపీ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆడవాళ్ల గురించి, వారి మాన, ప్రాణాల గురించి లెక్చర్లు ఇచ్చే ముందు అందరు ఆడవాళ్లూ సమామని గుర్తించాలని హితబోధ చేస్తున్నారు.

2019 ఎన్నికల సందర్భంగా వైసీపీ సోషల్‌ మీడియా జోరుగా పని చేసింది. ఆ తర్వాత కాస్త మందగించినట్లు కనిపించింది. అయితే, ఎన్నికలు మరో 9 నెలల్లో రానుండటంతో సోషల్‌ మీడియాను పటిష్టం చేయడంపై అధికార పార్టీ ఫోకస్‌ పెట్టినట్లు స్పష్టమవుతోంది. ఇందులో భాగంగానే సజ్జల భార్గవ్‌కు బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి బెంగళూరు, చెన్నై, తిరుపతి, తదితర ప్రాంతాల్లో వైసీపీ సోషల్‌ మీడియా సమావేశాలు నిర్వహించారు. ఎవరైనా అసంతృప్తిగా ఉన్న వారికి బుజ్జగింపులు, సముదాయింపులు చేసి అన్ని విధాలా న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారు. దీంతో సోషల్‌ మీడియా సైనికులు మళ్లీ ఉత్సాహంగా పని చేసేందుకు ముందుకొస్తున్నారు.

Read Also : Chandrababu Naidu: ప్రతి ఇంటి నుంచి అమెరికా వెళ్లారంటే అది మావల్లే: చంద్రబాబు

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles