Revanth Reddy YS on Jagan: ఏపీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి మైలేజీ పెంచేలా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కామెంట్స్ చేస్తుండటం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వరుసగా జగన్‌మోహన్‌రెడ్డి గురించి చేస్తున్న కామెంట్స్.. వార్తల్లో నిలుస్తున్నాయి. ఏపీ ప్రయోజనాల కోసం వైయస్ జగన్ ఎంత చిత్తశుద్ధిగా కృషి చేస్తున్నారో రేవంత్‌రెడ్డి పూసగుచ్చినట్లు వివరిస్తున్నారు. Revanth Reddy on YS Jagan
మొన్నామధ్య నాగార్జున సాగర్ నీటి విడుదల విషయంలో రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ఆయన.. మాజీ సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. ప్రాజెక్టుల విషయంలో జగన్‌మోహన్‌రెడ్డి పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తూ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టుపెట్టారంటూ విమర్శలు గుప్పించారు. నాగార్జున సాగర్ గేట్ల వద్ద ఏకే 47 తుపాకులతో ఏపీ పోలీసులను సీఎం జగన్ పంపి.. ఆ రాష్ట్రానికి నీళ్లు తీసుకుపోయారంటూ కామెంట్స్ చేశారు.
ఈ క్రమంలో కేసీఆర్‌ను రండ అంటూ తీవ్ర పదజాలం వాడారు. అయితే, ఇందుకు బీఆర్‌ఎస్ పార్టీ నేతలు కూడా ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టుల నిర్వహణను అప్పగించిన చేతగాని సర్కార్ రేవంత్‌దని దుయ్యబట్టారు. మాజీ మంత్రి హరీష్‌రావు ఈ విషయంపై వివరణ కూడా ఇచ్చారు. కేసీఆర్‌పై ద్వేషం, కోపంతో రాష్ట్రానికి అన్యాయం చేయొద్దని సూచించారు.
తాజాగా అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి.. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వైయస్ జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వివరించారు. “శ్రీశైలం ప్రాజెక్టు కొంత తెలంగాణలో, కొంత ఆంధ్రలో ఉంది. అంతకు ముందు ప్రాజెక్టులు లేవు. అంతకుముందు పోతిరెడ్డిపాడు 11,000 క్యూసెక్కులు ఉండేది. అది 44,000 క్యూసెక్కులకు పెరిగింది. అంతకు ముందు లేని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇయ్యాల 8 టీఎంసీలు తరలించేందుకు లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టారు.
ముచ్చుమర్రి నుంచి అర టీఎంసీ కట్టారు. మొత్తం 12.5-13 టీఎంసీలు పర్ డే. ఒక్క నెల రోజులు మనం కళ్లు మూసుకుంటే శ్రీశైలంలో బురద కూడా ఉండదు. రాయలసీమ లిఫ్ట్ 797 ఎఫ్‌ఆర్‌ఎల్ దగ్గర కట్టిర్రు. కుండ సైడుకు బొక్క పెట్టలేదు. కుండ కింద బొక్కపెట్టిర్రు. వీళ్లు పిలిచి పంచభక్ష పరమాన్నాలు పెట్టిర్రు. జగన్‌మోహన్‌రెడ్డి వీళ్ల కింద బొక్కపెట్టిండు.” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఏపీ ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గకుండా చిత్తశుద్ధితో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పని చేస్తోందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏపీ ప్రభుత్వాధినేతపై ఎలివేషన్లు ఈ స్థాయిలో ఇవ్వడం సాధారణ విషయం కాదని, అక్కడి ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారనే మాటున సీఎం జగన్‌కు మైలేజీ ఇస్తున్నారని స్పష్టం చేస్తున్నారు.
ఇదీ చదవండి: Telangana Voters: తెలంగాణలో ఫైనల్ ఓటర్ల జాబితాను ప్రకటించిన ఈసీ.. మొత్తం ఓటర్లు ఎంతమంది అంటే…
CM Revanth on Auto drivers: ఆటో డ్రైవర్లకు సీఎం రేవంత్‌రెడ్డి అభయం.. వారి కోసం ఏం చేస్తారంటే..
