Tomato rates: టమాటా ధర సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. ప్రస్తుతం టమాటా ధర రూ. 200 కి చేరుకుంది. సామాన్యులు టమాటా కొనాలంటేనే బెంబేలెత్తుతున్నారు. 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత ధర పలకడంతో అల్లాడుతున్నారు. సామాన్యుడికి అందనంత ఎత్తులో టమాటా చేరుకుంది. (Tomato rates)
Read Also : Tomato Pulusu: రాచిప్పలో టమాటా పులుసు.. ఇలా ట్రై చేయండి.. టేస్ట్ అదిరిపోవాల్సిందే..!
మదనపల్లె, మెదక్ మార్కెట్ లో కిలో టమాటా రూ. 200 పలుకుతోంది. మదనపల్లె మార్కెట్ చరిత్రలోనే అత్యధికం కావడం విశేషం. కిలో నాణ్యమైన టమాటా రూ.196 పలుకుతోంది. అత్యల్పంగా కిలో రూ.140 ధర నమోదైంది. రెండో రకం టమాటా రూ.120 పలుకుతోంది. 25 కేజీల బుట్ట ధర రూ.4,500 నుంచి రూ.5 వేలు పలుకుతోంది. మదనపల్లె మార్కెట్ కు 253 టన్నుల సరకు వచ్చి చేరింది.
Read Also :Tomato price: అయితే డకౌట్.. లేదంటే సెంచరీ.. టమాటా ధర పరిస్థితి ఇదీ..!